Others

నవ ‘వత్సర’ ఆశాదీపిక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ వత్సరం రెక్కలు విచ్చుకు
మది ముంగిట వాలింది
మరిన్ని ఆశల రాశుల పోగేసింది

ఇకపై
చెడుకు చరమగీతి పాడి
మంచికి తలు(ల)పుల తెరుద్దాం

సంకుచితత్త్వాల సమాధి చేసి
విశాల భావనకు ఊపిరిపోద్దాం

స్వార్థ చింతనల తుంచేసి
స్వేచ్ఛా ‘జీవన’కు దారులు వేద్దాం

మూఢత్వ ముళ్ళ కంచెను తెంచి
మనిషితనాలకు ‘పాదులు’ తీద్దాం

అసమానతల అడ్డుగోడల కూల్చి
ఆత్మీయతల ‘పందిరి’వేద్దాం

ఆర్థిక బంధనాల తెంచి
మానవ సంబంధాల పురిపెడదాం

జడత్వ జాడల ఊడల తుంచి
నవ చేతనకు ‘చిగురు’ తొడుగుదాం

అజ్ఞాన చిమ్మ చీకట్ల చిదిమి
విజ్ఞాన ‘ప్రమిద’ వెలిగిద్దాం

కోటి ఆశలతో..
కొత్త జీవితాలను వెలిగిద్దాం..

మేటి ఆశయాలతో..
కొంగ్రొత్త ప్రపంచం సృష్టిద్దాం..

సౌఖ్యంగా..
సమైక్యంగా..
విశ్వ ‘శాంతి’గీతాల పల్లవిద్దాం
నవ సంవత్సర కాలమంతా
ఆనంద ‘సందడి’ చేద్దాం

- కోడిగూటి తిరుపతి 95739 29493