Others

బ్లాక్ సాల్ట్ మంచిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో వాడే మామూలు ఉప్పుకి తోడు.. తినే సోడా ఉప్పును కూడా వంటల్లో వాడుతుంటారు. కొన్నిసార్లు నిమ్మ ఉప్పును కూడా వాడతారు. కానీ బ్లాక్ సాల్ట్ అనేదాన్ని అందరూ వాడరు. ఎందుకంటే.. ఇది మామూలు ఉప్పులా అన్ని షాపుల్లోనూ దొరకదు. కానీ దీనికి ఉన్న రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా దీనికి పాపులారిటీ పెరుగుతోంది. చాలామంది దీన్ని వాడేందుకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. పూర్వం ఆయుర్వేద మందుల్లో దీన్ని వాడేవారు. ఇప్పుడు ఆయుర్వేదంతో పాటు.. ఇంట్లో కూడా వాడుతున్నారు. పేరుకి ఇది బ్లాక్ సాల్ట్ అయినా నల్లగా కాకుండా గులాబీ, గోధుమ రంగుల్లో ఉంటుంది. సాధారణ ఉప్పు కంటే నల్ల ఉప్పు వాడటం మంచిదే అంటున్నారు డాక్టర్లు, ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే.. నల్ల ఉప్పులో తక్కువ సోడియం ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి నల్ల ఉప్పు మేలు చేస్తుంది. అయితే బ్లాక్ సాల్ట్ ప్యాకెట్ కొనేటప్పుడు అందులో సోడియం ఎంత ఉందో చూసుకోవాలి. కొన్ని రకాల బ్లాక్ సాల్ట్‌లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల టేబుల్ సాల్ట్‌లలో ప్రమాదకర పొటాషియం అయోడైట్, అల్యూమినియం సిలికేట్ వంటివి ఉంటాయి. సంప్రదాయ బ్లాక్‌సాల్ట్ ఎక్కువ ప్రాసెసింగ్ చేయకుండా ఇతర పదార్థాలను కలుపకుండా ఉంచుతారు. టేబుల్ సాల్ట్‌లో యాంటీ కేకింగ్ ఏజెంట్స్ కలుపుతారు. బ్లాక్‌సాల్ట్‌లో ఇవి ఉండవు. ఎక్కువ ఖనిజాలుంటాయి. కాబట్టి బ్లాక్‌సాల్ట్ మంచిది.