Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం శివం సుందరం
*
ఈ గండ్రగొడ్డలి ఇక ఒళ్ళు విరుచుకోవాల్సిందే..
తొలి ఉషస్సును తల్లో పూవుగా ధరించిన ప్రాచీ పురంధ్రికి
మొక్కుతున్నప్పుడే
కాంతి నన్ను ఆపాదమస్తకం అరుణిమతో తడిపింది
నాలో కర్తవ్య కూలంకషలు ప్రవహిస్తాయి
నా జాతి కోసం వ్రాసే ఏ పాటైనా
అమరత్వాన్ని ఉల్మీలనం చేస్తుంది..
***
‘‘ఆకసమ్మున పందిరి నల్లుకొంచు
తొలి వెలుగు తోరణమ్ముల తీత సాగె
తలిరు టాకుల చాటున కులుకు మల్లె
మొగ్గ చిలికెడు తెలికాంతి నిగ్గు కరణి

ఆత్మ కుసువు వికాస రాహస్యమైన
ప్రేమ సౌరభమును గదంబించె ననగ
ప్రాణధాతువున కమరె పాంచజన్య
ముగ్ధ మోహన తారుణ్యమూర్తి శోభ’’

ఏ స్మృతులు తరంగాలై ఈ తీరానికి కొట్టుకొచ్చాయో
ఆ తరంగాలు రూపం మార్చుకొని- మళ్లీ
నాడీ రక్త ప్రవాహంలో ఆకారం ధరించే అంతశే్చతనై
తర్కాల్ని ఉల్లేఖిస్తుంది..
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404