Others

వేదమార్గం.. సత్యనిరతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదములు అనాది నుంచి ఉన్నాయి. ఈ సృష్టి ద్రవ్యము. గుణము అనే రెండు ప్రధాన లక్షణాలను కలిగి ఉంది.
సృష్టి నశించినపుడు అంటే ప్రళయం సంభవించినపుడు ఈ లోకం తిరోధానం చెంది సూక్ష్మరూపాన్ని పొందుతుంది. ఒక బిందు ప్రాయమైన బీజం పునర్భవం పొందుతుంది. అంటే పూర్వం ఈ సృష్టి ఎలా ఉన్నదో అట్లాగే తిరిగి పూర్వ సృష్టి సృష్టించబడుతుంది. ఈ క్రమాన్ని అనేక విధాలుగా చెపుతారు. తిరోధానం పొందిన పూర్వ సృష్టి బీజంలో సనాతనంగా ఉండి ప్రతీ పునఃసృష్టిలో వస్తూనే ఉంటుంది. వేద విజ్ఞానం కూడా సూక్ష్మంగా అందులోనే దాగి ఉందని మనం గ్రహించాలి. పునఃసృష్టి తోపాటే ఆ వేద జ్ఞానం కూడా మళ్లీ శబ్ద , ఛంద, స్వరాది లక్షణాలు కలిగిన శరీరాన్ని ధరించి సృష్టిలో వ్యాపిస్తుంది. దానిని తెలుసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆ జ్ఞాన శబ్దం ప్రపంచంలోని అందరికీ వినిపించేంత ఆర్భాటంతో ఉండదు. దానిని వినడానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది. అదే యోగం. యోగమార్గంలో వెళ్లేవారికి ఆ శబ్ద విజ్ఞానం అందుతుంది. అంటే వినపడుతుంది. అంటే వౌనముద్రాంకితమైన అంతఃశోధనతో కూడిన ధ్యానం, తపస్సు లతో మాత్రమే ఆ శబ్ద జ్ఞానాన్ని ప్రాప్తిస్తుంది. మనశరీరం స్ధూలమైన ఇంద్రియాలకు ఆ శబ్దాలు వినపడవు. ఆ శబ్ద తరంగాలు కనిపించవు. సాధారణ మనుష్యుల చెవులకు శబ్దాలను వినడానికి కొన్ని పరిమితులుంటాయి.
ఆపరిమితులను దాటి ఆ శబ్ద తరంగాలను చూడాలి అంటే దానికి మార్గమే తపస్సు, ధ్యానం. మనం ఆ విజ్ఞానాన్ని పొందాలని నిశ్చయచిత్తంతో ఏకాగ్రతతోకూర్చోవాలి. పట్టుదలతో ధ్యానం సాగించాలి. మనస్సు నిర్మలం చేసుకోవాలి. మనసును చిత్తాన్ని నిర్మలం చేసుకొన్నపుడు వినిపింపచేసే శక్తి ఒక యంత్రంలా పనిచేస్తుంది.
అదొక విశేషమైన శక్తి సామర్థ్యం. అలాగే ఈ సృష్టిలో సృష్టితోనే ప్రాదుర్భావం పొంది ఆకాశంలో వ్యాపించి అంతటా నిండి ఉన్నది సనాతమైన శబ్దం. అది పూర్వపు సృష్టి ధర్మాలతో కూడి ఉండడం చేత సనాతన ధర్మంగా వ్యవహరించబడుతోంది. వాగింద్రియం ద్వారా వ్యక్తం చేసినపుడు మాత్రమే వాయువులో వ్యాపించిన శబ్ద తరంగము మన చెవికి చేరుతుంది.
సృష్టి బీజంలో నిండి ఉన్నశబ్ద వేదతరంగాలు ఈ సృష్టి ఉన్నంత కాలం నిలిచి పోవడం చేత వేదం నిత్యము, అపౌరుషేయమూ అయింది. దానిలో దాగున్న విషయము సృష్టిరహస్యం. ఈ సృష్టి రహస్య వివరణము బోధపడుట కష్టతరం. దాని ఉపయోగం మనుష్యుని విజ్ఞాన వాకిళ్లు తెరవబడుటయే.సృష్టి ఏవిధంగా, ఎందుకు ఏర్పడుతున్నదో తెలుసుకోవడమే విజ్ఞానంగా భావించవచ్చు. ఆ విజ్ఞానపు ఉపయోగమే సృష్టి అయితే ఈ సృష్టి నిజస్వరూపాన్ని తెలుసుకొని ప్రకృతి నిబంధన నుండి విడివడి సృష్టికి ఆధారమైన సత్యాన్ని చేరుకొనడమే ముక్తిని పొందుట. సత్యమార్గంలో సనాతన ధర్మాన్ని సక్రమంగా పాటించగలిగిన వారే దీన్ని సాధించగలరు. ఎందుకంటే ఒక సనాతనమైన ధర్మాన్ని ఆశ్రయించి మనుగుడ సాగించడం అంటే సృష్ట్ధిర్మాన్ని అనుసరించడమే కదా. కనుక ఆ పథంలో నడిచేవారికి ఆ పధం యొక్క రహస్యాలను సులభంగా అర్థమవుతాయి. దీనికి మనోనిబ్బఱం, ధర్మనిరతి, దృఢ సంకల్పం, సత్యనిరతి ఉండితీరాలి. అపుడే వేదమార్గం అనుసరించడానికి మార్గం సుగమం అవుతుంది. ధర్మనిరతి సత్యం పట్ల నిష్ట లేనివారికి ఈ సృష్టి రహస్యం బోధపడుతుంది అనుకోవడం అవివేకం అనుకోవచ్చు.

- సుజాత పి.వి.ఎల్