Others

రంగని మెప్పించిన నాయకామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన నిశ్చలమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాథుడ్నే మెప్పించిన మహాభక్తురాలు గోదాదేవి. ఆండాళ్‌గా పూజలందుకుంటున్న ఆ తల్లి ఆవిర్భవించిన పుణ్యధామమే ‘శ్రీవిల్లిపుత్తూరు’. తమిళనాడు రాష్ట్రం మధురై నగరానికి 75 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం గోదాదేవి పాద స్పర్శతో, ఆమె శ్రీహరి భక్తితో పునీతమైంది.
శ్రీవిల్లిపుత్తూరులో ప్రసిద్ధమైన ఆలయాలలో గోదాదేవి ఆలయం ఒకటి. మహిమాన్విత ఈ దివ్యాలయ ప్రాంగణం సదా గోదా, వటపత్ర సాయి నామస్మరణంతో మారుమ్రోగుతుంది. అణువణువూ ఆధ్యాత్మికానురక్తిని పెంచే గోదాదేవి ఆలయం ప్రశాంతమైన వాతావరణానికి కూడా వేదికగా విరాజిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉండే ఈ దివ్యాలయాన్ని 7వ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయ ప్రాంగణం గోదాదేవి భక్తికి ప్రబల నిదర్శనం.
పురాణగాథ: పూర్వం విష్ణు చిత్తుడనే పండితుడు శ్రీహరి భక్తుడు. అతడు రోజూ శ్రీహరినే సేవిస్తూ జీవనం సాగిస్తూఉండేవాడు. ఓసారి తులసి పాదులను తవ్వుతుండగా శ్రీమన్నారాయణుడి కటాక్షంగా ఓ శిశువు లభించిందాయనకు. ఆ శిశువుకు గోదాదేవి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచాడు. తండ్రి దగ్గర పెరుగుతున్న ఆ శిశువు తండ్రి భగవంతునిపై పెంచుకున్న ప్రేమను అర్థం చేసుకొన్నది. ఈలోకంలో భగవంతుడు తప్ప అన్యమేదీ లేదని ఎరుక పర్చుకుం ది. మనుష్యులందరికీ ఆ దేవదేవుడైన శ్రీమన్నారా యణుని ప్రేమ కావాలని తండ్రి దగ్గరే తెలుసుకున్నది. దానితో ఆమె పెరిగి పెద్దదవుతూ శ్రీరంగనాథుడ్ని అమితంగా సేవించడం అలవాటు చేసుకుంది. అంతే కాదు శ్రీరంగనాథుడే తన ప్రత్యక్షదైవమని, ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని అనుకొనసాగింది.
తండ్రి రోజు చేసే పుష్పకైంకర్యం తానూ చేయాలని ఉవ్విళ్లూరింది. కాస్త పెద్ద అమ్మాయ అవగానే రోజు తులసి తెంపి, పూవులను కోసి మాలలు అల్లి తండ్రి చేత రంగని పంపండం నిత్య కృత్యం చేసుకొంది. దినాలు గడిచేకొద్దీ నేను అల్లిపంపిన మాలలు ధరించిన స్వామి ఎలా ఉంటారో అనుకొనసాగింది. అనుకోవడమే కాదు రోజూ పుష్పహారాలను అల్లి తాను ముందుగా తన మెడలో ధరించి తన అందాన్ని చూసుకొని మురిసి ఇక స్వామి అందం ద్విగుణీకృతం అవుతుందీ మాలలతో అనుకొనేది. ఆ తర్వాత తండ్రి చేత స్వామివారి కైంకర్యానికి పంపించేది.పెళ్లీడు కొచ్చిన ఆండాళ్ స్వామిని ఎప్పటికైనా వివాహమాడాలని తలచేది. ధాని కోసం దనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించేది. భక్తిని మాలగా అల్లి ఆ భగవానుడ్ని సేవించి ముక్తిపొందవచ్చని తలచింది. తాను ఆవిధంగా చేసి భగవంతుడిని చేరుకొంది. ఆమె రచించిన పాశురాలనే తిరుప్పావై ప్రబంధంగా నేడు భావిస్తున్నారు. ఇందులో 30 పాశురాలున్నాయి.
ఆ పాశురాలను భక్తితో గానామృతం చేసి తన భక్తి ప్రపత్తులను చాటుకుని, స్వామిని వివాహమాడి చివరకి శ్రీరంగనాథునిలోనే ఐక్యమైన ఆండాళ్ ను స్మరించుకుంటూ నేడు శ్రీ గోదాదేవి కొలువైన ఈ దివ్యాలయ ప్రాంగణంలో తిరుప్పావై వేడుకను అత్యంత వైభవోపేతంగా చేస్తుంటారు. ఇక్కడ గోదాదేవి దొరికిన తులసీవనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. గోదాదేవి అమ్మవారి ప్రధానాలయం ప్రాంగణం విశాలమైంది. ఈ ప్రాంగణంలోపలి ప్రాకారంలో ఎడమవైపు లక్ష్మీనారాయణ పెరుమాళ్ మందిరం ఉంది. దీనికి సమీపంలో ఆండాళ్ పూజా మందిరం ఉంది. ప్రధానాలయ లోపల ప్రాకారం కేరళ సంప్రదాయ రీతిలో ఉంది.
అమ్మవారి ఆలయానికి ముందు మణిగన్, సుముఖన్, సేనై ఇముదల్వర్లల చిన్ని చిన్న మందిరాలున్నాయి. గర్భాలయం వెలుపల తులసీవనంలో బావి ఉంది. అమ్మవారు రోజూ ఈ బావిలోనే తన ముఖారవిందాన్ని చూచుకొనేదంటారు. ఇదే ప్రాంగణంలో ఊంజల్ మంటపం ఉంది. అత్యంత నయన శోభితంగ ఉన్న ఈ ప్రాంగణం చూపురులను అమితంగా ఆకర్షిస్తుంది. గర్భాలయంలో రంగమన్నార్ దర్శనమిస్తారు. స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుడు కొలువుదీరి వున్నారు. ఆలయం బయట ప్రాకారంలో గజలక్ష్మి, ఆంజనేయ మందిరాలున్నాయి. ఈ ప్రాకారంలోని అద్భుత శిల్పాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. అఘోర వీరభద్ర, సరస్వతి, శ్రీరాముడు, లక్ష్మణుడు, వేణుగోపాలస్వామి, విశ్వకర్మ, రంభ, ఊర్వశి, జలంధర్, మోహినీ అవతారం, మన్మధుడు, రతి, ఊర్ధ్వవీరభద్ర తదితర అద్భుత శిల్పరాజాలు చూపరుల దృష్టిని మరలనీయవు. అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా ఇవి దర్శనమిస్తాయి. అమ్మవారి గర్భాలయం బయట ప్రాకారంలో తిరుప్పావై పాశురాలకు చెందిన మనోహరమైన చిత్రాలున్నాయి. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారిని దర్శించుకునే కన్యలకు వివాహయోగం వస్తుందని భక్తుల నమ్మకం.

- డా. జి. సుజాత వెంకట్రావు 8885622196