Others

విశ్వ తేజోన్ముఖుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వర్చస్సు...
కోటి కాంతులు తేజస్సు
ఆ మేధస్సు ప్రపంచ ఉషస్సు

ఆ వ్యక్తిత్వం మహోన్నతం
ఆ ఆశయం మహోజ్వలనం

ఆ స్వరం ‘‘శాంతి’’ సందేశం
ఆ హాసం ‘‘స్వేచ్ఛా’’ ప్రవాహం

ఆ ప్రబోధం మానవ జీవన వేదం
ఆ ప్రసంగం విశ్వవికాస నాదం

మొత్తంగా...
విశ్వ తేజోన్ముఖుడు
స్వామి వివేకానందుడు

రామకృష్ణుని ప్రియశిష్యుడు
సకల లోక కాంతి ప్రసాధితుడు

మానవాళిలో అలుముకున్న
అజ్ఞాన చిమ్మ చీకట్ల తొలచి
విజ్ఞానామృతం పంచిన అపర మేధావి

అసమానతల అడ్డుతెరల చీల్చి
సమైక్యతను చాటిన మానవతావాది

భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని
సంస్కృతి, సంప్రదాయ ప్రశాస్థ్యతను
విశ్వపరివ్యాప్తిచేసిన ఋషి పుంగవులు

చికాగో విశ్వమత సభలో ప్రసంగించి
ప్రపంచ ప్రసిద్ధిచెందిన విఖ్యాతుడు

లోకహితం కోరి సర్వం ధారవోసిన
యోగి పుంగవుడు... త్యాగధనుడు

ఆ దివ్యశక్తి సంపన్నుడు
చూపిన బాటలో సమైక్యమై సాగుదాం

తేజోమూర్తి ప్రబోధనల పరివ్యాప్తి చేసి
విశ్వవిజ్ఞానకాంతులు పంచుదాం..
*
(నేడు స్వామి వివేకానంద జయంతి)

- కోడిగూటి తిరుపతి, 9573929493