Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు సెలయేటి తరగల యంచుదాకి
సంతతానంద మయ నూత్న సత్య కాంతి
ఎడద నూగిస వాడిన ఎలమియయ్యె
సాంధ్య వేణుగీతమ్ముగ సాగి సాగి

మావి తోపుల తిరుగాడు మబ్బు నీడ
కొమ్మ పైకెక్కి చాటుగా కూయు పికము
పవన పరిరంభ పులకిత ప్రసవ చయము
ప్రణయ తంత్రుల విశ్వవిపంచి మీటె

పరిగ రాలిన వరి చేలు పైన బ్రాకి
వచ్చు చిరుగాలి తరగల వరుస కోలె
ఈ మహానంద పులకిత హృదయమందు
పరుగులిడుచుండె వింత భావమ్ము లెన్నొ

త్రిభువనమ్ములలో రసోద్దీపనమ్ము
వెల్లివిరియించు ప్రణయ రూపిణివి నీవు
సందువోయిన నా పూర్వ జన్మ తపము
పట్టు పఱుపగలేని యుపాసనాధి
దైవతమ నీవు..

ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404