Others

శంఖంలాంటి మెడ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమందికి మెడ చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. డబుల్‌చిన్ వచ్చేస్తుంది. దీనివల్ల ముఖం అందవికారంగా, గండుగా కనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, ముఖం అందంగా, సన్నగా, మెడ శంఖంలా ఉండాలంటే మెడకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయాలి.
* మెడను ఎడమవైపుకు వంచినప్పుడు మెడ కండరాలు, దాని వ్యతిరేకపు వైపుకు లాగినట్లుగా అనిపిస్తుంది. మెడను కుడివైపుకు వంచినప్పుడు కూడా ఎడమవైపు మెడ కండరాలు లాగినట్లు అనిపిస్తుంది. రెండువైపులా చేసినప్పుడు అది ఒక పర్యాయం అవుతుంది. ఇలా పది పర్యాయాలు చేయాలి.
* భుజాలను అలాగే ఉంచి, తలను నిటారుగా చాలా నెమ్మదిగా, సమానంగా, సౌకర్యవంతంగా ఉన్నంతవరకు కుడివైపుకు తిప్పాలి. ఇలా కొన్ని సెకన్లు ఉంచి తిరిగి తలను యథాస్థానానికి తీసుకురావాలి. ఎడమవైపు కూడా ఇలాగే చేయాలి. ఇలా తలను తిప్పినప్పుడు కండరాలు సంకోచం చెందుతాయి. మళ్లీ యథాస్థితికి వచ్చినప్పుడు విశ్రాంతి పొందుతాయి. ఇది ఒక పర్యాయం అవుతుంది. దీన్ని కూడా ప్రతిరోజూ పది పర్యాయాలు చేయాలి.
* మెడను విశ్రాంతి పొందేవిధంగా ఉంచుతూ భుజాలను ముందు వైపుకు వంచి తల గవద భాగం కిందికి చేరుకునేంతవరకు కిందికి వంచాలి. తరువాత కుడి చెవి వరకు, కుడి భుజానికి దగ్గరగా వచ్చేంతవరకు తలను కుడివైపు తిప్పాలి. ఇలా సౌకర్యవంతంగా ఉన్నంతవరకూ తిప్పాలి. తరువాత ఎడమవైపు ఇలాగే చేయాలి. ఇలా ఒక వలయాకారాన్ని పూర్తిచేస్తూ తలను ప్రారంభ స్థానానికి తీసుకురావాలి. ఇది ఒక పర్యాయం అవుతుంది. సవ్యదిశలో ఐదుసార్లు, అపసవ్యదిశలో ఐదుసార్లు ఇలా చేయాలి.
* ముఖాన్ని ముందువైపు ఉంచాలి. మెడను కిందికి చూస్తున్నట్లుగా వంచి, భుజాలకు విశ్రాంతిని కల్పిస్తూ, నెమ్మదిగా భుజాలను చెవుల వైపుకు ఎత్తాలి. ఇలా కొన్ని సెకన్ల పాటు ఉంచి తిరిగి ప్రారంభదశకు వచ్చేయాలి. ఇది ఒక పర్యాయం అవుతుంది. ఇలా పది పర్యాయాలు చేయాలి.
* నోరు తెరచి వీలున్నంతవరకు నాలుకను బయటకు తీసుకురావాలి. ఈ సమయంలో మెడ కండరాలు బిగుసుకున్న అనుభూతిని పొందాలి. తర్వాత మెడ నరాలు బయటలకు కన్పించేంతవరకు దవడలను గట్టిగా నొక్కిపెట్టాలి. ఇలా పదిసార్లు చేయాలి.
ఈ వ్యాయామాలు చేసేటప్పుడు నెమ్మదిగా, ప్రశాంతంగా చేయాలి. గట్టిగా, హడావుడిగా చేయడం వల్ల కండరాలు పట్టేసే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు, గర్భంతో ఉన్నవారు ఎక్కువగా వెనక్కి లేదా ముందుకు వంగకుండా జాగ్రత్తగా చేయాలి. వ్యాయామ నియమావళిని నిర్దేశించికుని క్రమం తప్పకుండా వీటిని అభ్యసించడం వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు.
*