Others

వివేచనాజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టటం ఎంత సహజమో మరణించడమూ అంత సహజమే. ఈకాలంలో సాంకేతిక పెరిగి పుట్టడాన్ని వాయిదా వేయడం, లేదా పుట్టించకుండా ఉండడం సాధ్యమవౌతుంది. కానీ మరణించడం మాత్రమూ ఆపలేకుండా ఉంటున్నాం. కానీ పూర్వకాలంలో మరణాన్ని కూడా వాయదా వేసుకొనే మహాత్ములు మనకు పురాణాల్లోనే కాదు ఈ కలియుగంలోను కనిపిస్తారు. త్రైలింగస్వామి సుమారు 300 ఏండ్లు జీవించినట్టు చెప్తారు. అట్లానే ఎంతోమంది మహానుభావులు వయస్సు పెరగకుండా ఆపేసకుని యవ్వనంలోనే ఉండిపోయనట్టు కూడా మనకు ఆధ్యాత్మిక వీధుల్లో కనిపిస్తుంది.ఈ కాలంలోనూ 120 ఏండ్లు పైబడి బతికిన వారుంటున్నారు.
కానీ ఎంత కాలం బతికామని కాక ఎట్లా బతికాము. ఈ లభించిన మానవజన్మను సార్థకం చేసుకొన్నామా లేదా అన్న వివేచనతో మనం ఆలోచించుకుని ఎవరికి వారు సమీక్షించుకోవాలి. త్యాగమే మహోన్నత గుణం అని దానిద్వారానే అమృతత్వం సిద్ధిస్తుందని చెబుతారు మన పెద్దలు. త్యాగమనేది ఎవరైనా చేయవచ్చు. కర్ణుడిలా కర్ణకుండలాలు దానం చేయడానికి ధనశక్తి , వరశక్తి లేదుకదా అని అనుకోనక్కర్లేదు. ఉన్నదానిలో త్యాగం చేస్తేనే అది మహోన్నతను ఆఫాదించిపెడుతుంది. ధనశక్తితోనే త్యాగాలు చేయనక్కర్లేదు. శ్రమశక్తినీ దానం చేయవచ్చు. ఎవరి ఏది ఉంటే అది ప్రతిఫలాపేక్ష లేకుండా అవసరమైన వారికి, అర్థులైన వారిని దానం చేయడమే త్యాగం అనుకోవచ్చు. దీనివల్ల అటు దానగ్రహీతకు, ఇటు దానం చేసిన వారికి కూడా తృప్తి, ఆనందం రెండూ కలుగుతాయి.
అట్లా కలగాలంటే ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తేనో లేక మానవత్వం పరిమళిస్తేనో సాధ్యమవుతుంది. ఎందుకంటే మానవ జన్మ ఎత్తడం ఎంతో పవిత్రత అనుకొంటే ఆ పవిత్రతకు భక్తి మార్గాన్ని ఆపాదించి, భక్తియుత సేవలో పునీతం అయతే త్యాగం విలువ తెలుస్తుంది. అట్లాకాకుండా మానవత్వం మూర్త్భీవించినట్లయతే త్యాగం ఔన్నత్యపు విలువ తెలిసి త్యాగగుణం అలవడుతుంది. అపుడు అమృతత్త్వం సిద్ధిస్తుంది.

- శ్రీ