Others

షోల్డర్ ఫ్యాషన్ అదరహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్డ్ షోల్డర్స్, ఆఫ్ షోల్డర్స్.. ఇప్పుడు టీనేజర్లు ఇష్టపడే డిజైన్లు.. ముఖ్యంగా ఆఫ్ షోల్డర్స్‌ను ఇష్టపడని యువతరం లేదు. అందుకే టీషర్టులు, శారీ బ్లవుజుల వరకూ ఈ ట్రెండ్ విస్తరించింది. ఎంతలా అంటే చివరికి పెళ్లి కూతుర్లు కూడా ఈ బ్లవుజులనే ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే ఆఫ్ షోల్డర్స్ క్రేజ్ ఏమిటో తెలుస్తోంది. బ్లవుజుల్లో ఎన్నో రకాల డిజైన్లు ఉన్నా అమ్మాయిలు మాత్రం ఆఫ్ షోల్డర్ టీ షర్టులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులోనూ పొట్టి, పొడవు చేతుల్ని ఎంచుకోవచ్చు. లాంగ్ స్కర్టుకు ఆఫ్ షోల్డర్స్ క్రాప్ టాప్‌ను కూడా వేసుకోవచ్చు. ఇది ఎంబ్రాయిడరీ లేదా ఫ్రిల్స్, రఫుల్స్ డిజైన్‌లో ఉండేలా చూసుకుంటే చాలా బాగుంటుంది. ప్రత్యేక సందర్భం, రోజూ అని లేకుండా ఎప్పుడైనా ఈ ఆఫ్ షోల్డర్స్‌ను వేసుకోవచ్చు టీనేజర్లు. ముఖ్యంగా వేసవిలో అయితే ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఆఫ్ షోల్డర్స్ వేసుకోవాలనుకునేవారు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. వీటిని సందర్భానుసారంగా వేసుకుని మెరిసిపోవచ్చు.
* ఇప్పుడు పెళ్లిళ్లలో లాంగ్ గౌన్లు లేదా లాంగ్ స్కర్టులు విత్ ఆఫ్ షోల్డర్స్‌దే హవా.. అయితే వీటికి భారీ పనితరం ఉంటేనే అందంగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లికూతుర్ల ఆఫ్ షోల్డర్ బ్లవుజులకు భారీ పనితరం తప్పనిసరి.
* పొడవైన మెడ ఉన్నవారికి ఈ డిజైన్ చాలా బాగుంటుంది.
* సన్నగా ఉన్నవారికి తక్కువ స్లీవ్స్ ఉన్నవి, చేతులు కాస్త లావుగా ఉన్నవారు వెడల్పాటి ప్లాప్స్ రకాన్ని ఎంచుకుంటే చాలు. అయితే భుజాలు వెడల్పుగా, పెద్దగా ఉన్నవారికి ఇవి నప్పవు.
* భుజాలు తీర్చిదిద్దినట్లు సన్నగా, నాజూకుగా ఉన్న అమ్మాయిలకు ఆఫ్ షోల్డర్ దుస్తులు అద్దినట్లు సరిపోతాయి. వీటిపైకి జతగా టీనేజీ అమ్మాయిలకు పొడవాటి ఇయర్ రింగ్స్ అందాన్నిస్తాయి.
* పార్టీల్లో అయితే కలంకారీ, ఇకత్ ఆఫ్ షోల్డర్లకు జతగా వెండి ఆభరణాలు అందాన్నిస్తాయి. వేసవికాలంలో ఇవి మరింత అందాన్నిస్తాయి.
* చేతులు లావుగా ఉన్నవారు కూడా వీటిని నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్ షోల్డర్‌లో స్లీవ్స్ అటాచ్‌మెంట్, ప్లాప్స్ ఉంటాయి. దాంతో లావుగా ఉన్నవారు లావుగా కనిపించరు.
* ఉద్యోగినులు కూడా హై ఆఫ్ షోల్డర్, వన్‌సైడ్ ఆఫ్ షోల్డర్ వేసుకోవచ్చు. పొడవు చేతులతో ఉన్న రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. కానీ వెడల్పాటి భుజాలు ఉన్నవి ఆఫీసులకు బాగుండవు. అలాగే పెళ్లి వంటి వేడుకలకు కూడా ఇలాంటివి బాగోవు. అందుకే వీటిని కాస్త సన్నగా ఉండేలా చూసుకోవాలి.
* ఆఫ్ షోల్డర్స్‌లో ఆఫ్ షోల్డర్ విత్ స్లీవ్స్.. ఆఫ్ షోల్డర్స్ ప్లాప్స్, ఎసెమెట్రికల్ ఆఫ్ షోల్డర్స్.. ఇలా చాలా రకాలున్నాయి. ఆఫ్ షోల్డర్ విత్ స్లీవ్స్‌లో లాంగ్, షార్ట్ రకాలున్నాయి. వీటిలో నచ్చినట్లుగా చీరకు బ్లవుజుగా, లాంగ్ గౌనుగా, క్రాప్‌టాప్‌గా, అనార్కలీగా.. ఇలా మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. అంతే సందర్భం ఏదైనా, ఫంక్షన్ ఎలాంటిది అయినా ప్రత్యేకంగా కనిపించి తీరుతారు.
* చిన్న చిన్న ఫంక్షన్లకు మాత్రం కాటన్‌తో చేసిన ఆఫ్ షోల్డర్ ఫ్రాక్‌ను వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది.
* ఆఫ్ షోల్డర్స్‌కు ఎంబ్రాయిడరీ పనితనం వంటి హంగులు ఉంటేనే బాగుంటుంది.
* థర్టీ ప్లస్ ఉన్న మహిళలకు ఆఫ్ షోల్డర్ లాంగ్ గౌన్లు చాలా బాగుంటాయి.
*