Others

దారి మార్చని రజనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు రజనీ సినిమా గురించి -విడుదలకు రెండునెలలు ముందు, రెండు నెలలు తరువాత మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. కాని వరుస ఫ్లాపుల కారణంగా రజనీ ఇమేజ్ దెబ్బతినడంతో ఆయన్నుంచి వస్తోన్న చిత్రాలను మరుసటి రోజుకే మర్చిపోతున్న వైనం కనిపిస్తోంది. కాలా, పేటలాంటి చిత్రాలు విడుదలకు ముందు ఎంత బజ్ క్రియేట్ చేశాయో, తరువాత అంతే వేగంగా మాయమైపోయాయి. స్టార్ డైరెక్టర్లు సైతం రజనీకి ఒక్క హిట్టూ ఇవ్వలేకపోతున్నారు. పాతికేళ్లు క్రితం రజనీలో ఏంచూశామో, ఇప్పటికీ అదే స్టయిల్, మేనరిజమ్స్‌తో కనిపిస్తుంటే నచ్చటం లేదన్నది ఆడియన్స్ మాట. మొనాటినీ నుంచి బయటపడాల్సిన తరుణంలో -దర్బార్‌లోనూ అదే రజనీ కనిపించటం ఆడియన్స్‌కి కనెక్టవ్వలేదు. పా.రంజిత్, కార్తీక్ సుబ్బరాజు, మురుగదాస్ లాంటి దర్శకులు సైతం రజనీ కెరీర్‌ను ముందుకు తొయ్యలేకపోతున్నారు. రజనీతో సినిమా అంటే అలవాటైన ప్యాట్రన్‌లోనే తెరకెక్కించాలన్నట్టు క్రియైటివ్ డైరెక్టర్లు సైతం హిప్నాటైజ్ అవుతుండటంతో -ఏ సినిమా ఎవరు తీసినా ఒకే సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్న ఫీలింగే కలుగుతోందన్నది ఆడియన్స్ వాయిస్. తనకొచ్చిన అవకాశాన్ని పా.రంజిత్ మిస్‌ఫైర్ చేస్తే, కార్తీక్ సుబ్బరాజ్, మురుగదాస్‌లు సైతం తమ శైలిని మర్చిపోయి, రజనీ సిగ్నేచర్‌తో సినిమా చేయడమే కొంపలు ముంచింది. గత సంక్రాంతికి పేట, ఈ సంక్రాంతికి దర్బార్.. ట్రెండీ సినిమాలు అవుతాయనుకుంటే -స్క్రీన్‌మీద వింటేజ్ రజనీయే కనిపించటంతో ఆడియన్స్ బోర్ ఫీలయ్యారు. కథమీద కసరత్తుకంటే, రజనీ చరిష్మాపైనున్న నమ్మకాలను టాప్ డైరెక్టర్లు సైతం వీడకపోవడంతో -రజనీ గ్రాఫ్ క్రమంగా మసకబారుతోంది. ‘నా దారి రహదారి. బెటర్ డోన్ట్ కమ్ ఇన్ టు మై’ అన్న డైలాగ్‌ని బాగా పాపులర్ చేసిన రజనీ -ఇప్పటికైనా ఆ రూటు మార్చకపోతే.. దర్శకులను మార్చినా సినిమాలు, ఫలితాలు మారవన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలి.