Others

చూడగానే నచ్చేస్తుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ కందుకూరి, వర్ష, మాళవిక ప్రధాన తారాగణంగా శేష సింధూరావు దర్శకత్వంలో రాజ్ కందుకూరి రూపొందించిన చిత్రం చూసీ చూడంగానే. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ- యువతరంతో సినిమాలు చేయడానికి ఇష్టపడే నేను అలాంటి ఓ యంగ్ బ్యాచ్‌ని పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించానని, గోపీసుందర్ సంగీతం సినిమాకు హైలెట్ కానున్నదని, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు, పాటలకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఓ మంచి సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నాకు దర్శకురాలు శేష సింధూరావు ఈ కథ చెప్పినపుడు బాగా నచ్చిందని, సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ నన్ను హీరోగా నమ్మి పనిచేశారని కథానాయకుడు శివ కందుకూరి అన్నారు. దర్శకుడు శేష సింధు మాట్లాడుతూ- శివాకు నటించే స్కోప్ వున్న మంచి సబ్జెక్ట్ ఇది. వర్ష ఈ చిత్రంలో బాగా నటించిందని, తెలుగు రాకపోయినా షూటింగ్ పూర్తయ్యేలోపు నేర్చేసుకుందని తెలిపారు. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం తాను కూడా ఉద్వేగంగా ఎదురుచూస్తున్నానని కథానాయిక వర్ష తెలిపారు. దర్శకురాలు రాసుకున్న ఓ అందమైన పాయింట్ స్క్రీన్‌పై వైవిధ్యంగా చూపించారని, తనకు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నట్లు మరో కథానాయిక మాళవిక తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు.