Others

వంటింటి దినుసులతో జబ్బుల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటింట్లోని సామాన్లతో నే జబ్బులు రాకుండా నివారిం చుకోవచ్చు. అల్లం, మిరియాలు, మెం తులు, వాము, జీలకర్ర, ఆవాలు, పసుపు మొదలైన దినుసులతోనే ప్రాథమికంగా వ్యాథులను స్వల్పంగా తగ్గించుకోవచ్చు. పిల్లల్ని చిల్డ్రెన్ స్పెషలిస్టుల దగ్గరకు తరచూ తీసుకు వెళ్ళే ప్రయాస తగ్గుతుంది. వ్యయాలు తగ్గుతాయి.
ప్రాథమికంగా అన్ని జబ్బులు తాగే నీరువల్ల వస్తున్నాయి. పొల్యూషన్ నీటివల్ల సూక్ష్మజీవులవల్ల వ్యాధులు సంక్రమిస్తాయి.
వడపోసి కాచి చల్లార్చిన నీటినే తాగాలి. మంచినీటి పాత్రలోకి నేరుగా గ్లాసులను ముంచకుండా పాత్ర క్రింద భాగాన కుళాయి ఏర్పాటుచేసుకుంటే మంచిది. శుభ్రంగా వుంటుంది. అక్వా వాటర్ శుద్ధమై వుంటుంది.
నిద్రలేమితో బాధపడుతున్నవారు పడుకునేముందు కొత్తిమీర రసం, పంచదార స్వల్పంగా కలిపిన నీళ్ళు తాగితే ఫలితం వుంటుంది.
రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు మంచినీటిలో ఒక తులం పటికబెల్లం వేసి వుంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. 15 రోజులపాటు ఇలా తాగితే ఎంతోకాలంనుండి బాధించే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది. ఇది నీటి సంగతి.

***
భూమికకు రచనలు పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- బి.విజయలక్ష్మి