Others

మంచి నిద్రనిచ్చే పానీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బరువు తగ్గాలనుకుంటే నిద్రపై కూడా సరైన దృష్టి పెట్టాలి. కంటి నిండా నిద్ర లోపిస్తే, ఇన్సులిన్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు, ఎమోషనల్ ఈటింగ్ మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ శరీర బరువును పెంచేవే.. అయితే నిద్రకు తోడ్పడే ఈ పానీయాలకు నిద్రకు ముందు తాగితే ప్రయోజనం ఉంటుంది.
పాలు
పాలలోని ట్రిప్ట్ఫోన్, కాల్షియం, కెసీన్ ప్రొటీన్‌లు గాఢనిద్రలోకి జారుకునేందుకు తోడ్పడతాయి. కెసీన్ జీర్ణప్రక్రియను నెమ్మదింపజేసి గాఢనిద్రలో ఉండగా కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది. ఫలితంగా పరోక్షంగా కండరాలు బలపడి, ఫిట్‌నెస్ సొంతమవుతుంది.
ద్రాక్ష రసం
గాఢనిద్ర పట్టడంతో పాటు, నిద్రావస్థలో కొవ్వు కరిగేలా చేసే గుణం ద్రాక్ష రసానికి ఉంది. ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలోని ఇన్సులిన్ స్రావాన్ని క్రమపరిచి జీవ గడియారం కరెక్టుగా పనిచేసేలా తోడ్పడతాయి.
దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లు ఉంటాయనే విషయం మనకు తెలుసు. నిద్రకు ముందు ఈ చెక్క పొడితో చేసిన టీ తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది. అలాగే శరీరంలోని మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దాంతో బరువు కూడా తగ్గుతారు.
మెంతులు
మెంతులు నానబెట్టిన నీళ్లను క్రమం తప్పకుండా తాగడం వల్ల ఒంట్లో వేడి ఎక్కువై బరువు పెరగకుండా ఉంటాం. అలాగే జీర్ణవ్యవస్థ మెరుగైన పనితీరు కోసం కూడా మెంతుల నీళ్లు తాగాలి. అయితే నిద్రకు అరగంట ముందు ఈ నీళ్లు తాగినప్పుడు ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. *