Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

49
అక్షరం
శబలవర్ణ కోమలంగా కదిలితే
పరిమళాన్ని ఎక్కుపెట్టిన పూలమొక్క అవుతుంది
అనుగమమో అనునయమో
అది గమనంలో గంధస్థాసక మరుత్తు అవుతుంది
ఏటి చెంపల్ని సున్నితంగా తాకిన
కోటి కోర్కెల వలయాల నిమ్న నాభి అక్షరం
ఇంద్రధనుసులు వొంగిన చంద్రవంక లాంటి ఫాలం మీద
చెమ్మగిలిన సింధూర తిలకం అక్షరం
ఆవల వచ్చిన అర్థాన్ని జూచి తొందర తొట్రు జారి
కలువమొగ్గల మధ్య తూలిపడ్డ సిగ్గుతునక అక్షరం
అరమూత కన్నుల అంజనరేఖలో అస్పష్ట లాలస
కునుకు చదువుగా కులికితే అక్షరం
చిరునవ్వు మొగ్గ విచ్చుకునే చిగురు పెదవి తీవెలపై
చూపు ఊయలలూగితే అక్షరం
అక్షరం అరణ్యాన్ని ఆవిష్కరించిన
ఎదలోతు దాహం
అక్షరం ఆకసాన్ని ధరించిన
మహాశూన్యదేహం
కడమ కాని పడమటి వియోగంలో
పల్లవించే ప్రతి ఉదయం అక్షరం
జన్మతోనే మృత్యువును కౌగిలించుకున్న
సమన్వయ శరీరం అక్షరం
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404