Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరు నీటిని కలిసే ఆత్మ సంయోగంలో
రసహంసల రిరంసాదీవి అక్షరం
చైత్ర పల్లవాలమధ్య శ్రీకారం చుట్టుకున్న
తారళ్యపు మొగ్గల తారాట అక్షరం
హక్కుగా అగ్నిపత్రం వ్రాసుకున్న వేసవికాలాన్ని
వారించిన దక్షిణ మరుదంకురపు మల్లెమొగ్గ అక్షరం
***
తొలకరి చినుకుపడి సోయగమైన
పుడమి చెక్కిలి మీది సిరిగందపు చిన్ని సొట్ట అక్షరం
కదిలే దూదిపింజ గగనంలో మబ్బైతే
తెలి వెనె్నల పడి తళుకులీను హంసరెక్క అక్షరం
దొంతర చేమంతుల శ్రీమంత స్స్వాంతంలో
హేమంతపు చలిబాధను గెలిచే కుచోష్ణం అక్షరం
కాలం చేసే నగ్న పూజకు కర్పూర హారతి పట్టి
కంకాళాలకు పల్లవిత శాఖా చైతన్య కుంకుమనలదే
నవ్యోపమ అక్షరం
ఉదయాన్ని తీర్చిన రాత్రి
రాత్రిని తేల్చిన ఉదయం
అక్షానికమరిన రెండు గుణింతాల అక్షరం
క్షణం నిత్య నూతనంగా
ఆరు ఋతువుల్ని చుట్టూ తిప్పే అద్భుతాక్షరం అక్షరం
శబల వర్ణ మందార ప్రపంచంలో పరాగ పాంశువులు
ప్రజలైన ఆకాశంలో
పూచిన మరంద నక్షత్రమే అక్షరం
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404