Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవిత రసవఝరి ఒడ్డులొరిసి ప్రవహిస్తూ
రెండు పాయలైన ఒంటరితనపు నడిమి దీవి మీద
తరంగ స్మృతుల్ని చిద్రూపంగా మోస్తుంది
అంతర్గతానుభూతుల ఆశే్లషంలో
ప్రతి రేణువు
స్వభావోక్తి సంకేతమైన అక్షరం
అక్షరం
అక్షరం
***
ప్రియుల కౌగిళ్ళలో వున్న ప్రియురాళ్ళను చూచాను
పూలగుత్తు కౌగిళ్ళలోని పక్షుల్ని చూశాను
నక్షత్రాల కౌగిళ్ళలో
నలిగిపోతున్న ఆకాశాన్ని చూశాను
ఆకాశంలో
వ్రేలాడుతున్న వెనె్నల్ని చూశాను
ప్రభాతాన్ని రావద్దని పాదాలు పట్టుకుని ప్రార్థించాను..
ఎందుకో తెలియదు.. ప్రగాఢ వాంఛే నిరీక్షా ప్రవృత్తియేమొ..!
చంకలో మధుకలశం ఒదిగిపోగా ఒలికి
వసంత ఋతు వర్ణసుమాలు కొమ్ములు పట్టుకు
వ్రేలాడుతున్నాయి- హిందోళై
ఒకే ఒక స్మృతి మీటిన నరాల తీగల
నాజూకు వీణలా తోచిందామని
నేను తప్ప కందువ కళ్ళకెవరు తోచారని
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404