Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. పెద్దవారనుభవముల విస్మరించఁ
బోకుమవి దివ్య పథముల నీకుఁజూపు
నెల్లవేళల నినుఁగాయ నిలఁ గనంగ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పెద్దల అనుభవాలను తేలికగా కొట్టిపారేయరాదు. వారి వారి అనుభవాలు తేజోవంతమైన బ్రతుకు బాటలు నీకు చూపిస్తాయి. నినె్నల్లవేళలా కంటికి రెప్పలా కాపాడేవి పెద్దల అనుభవాలేనని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామి.

తే.గీ. కార్యసాధన లక్ష్యమై కదల వలయు
లక్ష్యసాధన ధ్యేయమై లక్ష్యవెట్ట
రాదుకష్టసుఖంబులు చేదు ఘటన
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మనమంతా కార్యసాధనే లక్ష్యంగా ఆ లక్ష్యసాధనే ధ్యేయంగా కదిలిపోతుండాలి. కార్యసాధకులమైన మనం కష్టసుఖాలు, చేదు ఘటనలు ఎదురైనప్పుడు వాటిన్నింటిని సమదృష్టితో చూడాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు ప్రభాకరా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262