Others

మాఘ స్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైందవ సాంప్రదాయంను అనుసరించి ప్రతి మాసానికి ఒక విశిష్ఠత ఉంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువులో ఉంటాయి. సంవత్సరంలో పదవ మాసమూ, హేమంత రుతువులోని రెండో మాసమూ అయిన పుష్యం తెలుగు వారికి శూన్యమాసం. సంవత్సరంలోని నాలుగవ మాసమూ, గ్రీష్మ రుతువులోని రెండవ మాసమూ అయిన ఆషాఢం కూడా తెలుగు వారికి శూన్యమాసమే. శూన్య మాసాలు శుభ శోభనాలకు పనికిరానివి. ఒక సంవత్సరం చివరి పాదంలో వచ్చే పుష్య మాసానికి, మరు సంవత్సరం రెండవ పాదంలో వచ్చే ఆషాఢానికీ మధ్య ఆయిదు మాసాల తేడా ఉంటుంది. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టంలకు మాఘాది పంచకం అని పేరు. ఇవి శుభకార్యాలకు అనుకూల కాలం. వాన, చలి అంతగా ఉండక, వస్త్ర, గృహ సమస్య ఇబ్బంది కలిగించక, ధాన్యలక్ష్మి ఆరు బయట విరివిగా మసలే కాలమిది. శాకపాకాలు సమృద్దిగా, అనుకూలంగా ఉండే మాస పంచకానికి తొలిమాసం మాఘం. సంవత్సరంలో పదకొండవ మాసమైన మాఘంలో గృహ నిర్మాణాలు ఆరంభిస్తే సంపత్తి కలుగగలదని మత్స్య పురాణం స్పష్టపరుస్తున్నది. మాఘ మాసపు ఆదివారాలు మహిమాన్వితాలు. ఈరోజులలో సూర్యపూజ చేసిన వారికి ఆరోగ్య, భోగభాగ్యాలు కలుగుతాయని పుద్మపురాణాధారం. కార్తీకంలో దీపానికి ఎంత ప్రాధాన్యత ఉందో, మాఘ మాసంలో స్నానానికి అంత ప్రాముఖ్య ఉంది. మరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించింది ఈ మాసంలోనే. మాఘంలోనే వసంత పంచమి నాడు జ్ఞాన స్వరూపిణి సరస్వతీ దేవి జన్మించింది. ఆరోగ్యం ప్రసాదించమని కొలిచే కాల చక్రాత్మగా పిలువబడే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని జయంతి రథ సప్తమిగా పిలువబడే మాఘ శుక్ల సప్తమి. మకర లగ్నంలో సూర్య భగవానుడు ఉండే సమయాన స్నానం ఫలితం కోటి జన్మాల పుణ్య కార్యాలతో లభ్యం కానిదని చెపుతారు. మాఘమాసంలో ఉష:కాల స్నానం పుణ్యప్రదం. సూర్యుడు మకర రాశిగతుడు అయినప్పటి నుండి ప్రాత:కాల స్నానాలు తప్పక చేయాలి. మాఘమాసంలో ఉష:కాల సమయాన నదులలో, చెరువులలో, మడుగులలో, కొలనులలో, తుదకు బావులలో స్నానం చేస్తే ప్రయాగ స్నాన ఫలితం దక్కుతుంది. ‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ - నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు‘. గంగ, గోదావరి, కావేరి లాంటి పవిత్ర నదులను తలుచుకుని, పుణ్య స్నానం ఆచరించాలి. సూర్యుడికి అర్ఘ్యం ప్రదానం చేయాలి. అశక్తత చేత నిర్ణీత సమయమందు స్నానం చేయజాలని వారు పొద్దు పొడిచిన జాములోగా చేయాలి. చలికి వెరవకయే మంచు ఆవరించి ఉన్న నదీ జలాలలో స్నానం శ్రేష్ఠమని పురాణాలు ఘోషిస్తున్నాయి. స్నానానంతరం శివాలయాలకు వెళ్ళి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే సకల దోష పరిహారం కాలదనే విశ్వాసం. మాఘమాస అరుణోదయ స్నానం, అరుణోదయ దీపారాధనం, తిల దానం, తిల భక్షణం ఉత్కృష్టమైనవి.

- సంగనభట్ల రామకిష్టయ్య