Others

సామ్యవాది జననాయక్ కర్పూరీ ఠాకూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు కర్పూరీ ఠాకూర్ జయంతి
*
కర్పూరీ ఠాకూర్ ఒక స్వాతంత్య్ర పోరాట వీరుడు. ఆధునిక భారతాన్ని నిర్మించటంకోసం జరిగిన అన్ని ప్రయత్నాల్లో తనదంటూ ముద్రవేసిన సామ్యవాది. నిజాయితీకి మారుపేరు. ముఖ్యంగా రామ్‌మనోహర్ లోహియా ప్రభావం బీహార్‌లో ఎక్కువ. అంబేద్కర్‌లాగే లోహియా కుల నిర్మూలన జరగాలనీ, కులాధిపత్యం లేని సమాజం నిర్మించటం కోసం గాంధీతో సైద్ధాంతిక యుద్ధం చేశారు. అలాంటి ఆధునికవాది, సామ్యవాది రామ్‌మనోహర్ లోహియా ప్రభావంతో కర్పూరి ఠాకూర్ బిహార్ రాజకీయాలనే కాదు, దేశమంతటికీ ఆదర్శప్రాయమైన ఎన్నో విధానాలను అందించారు. కర్పూరీ ఠాకూర్ జనహితంకోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. అందువల్లే ఆయన్ని ‘జననాయక్’ అని ప్రజలు నేటికీ పిలుచుకుంటున్నారు. దేశ రాజకీయాల మీద, ప్రజాజీవితంమీద మరచిపోలేని ప్రభావం కర్పూరీఠాకూర్ చూపారు. లోహియా అనుచరుడిగా, లోక్‌నాయక్ జయప్రకాశ్ మిత్రుడిగా ఆయన బిహార్ రాజకీయాలను శాసించే స్థితికి ఎదిగారు. బిహార్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎనలేని సేవచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా వున్న కాలంలోనే బీసీ రిజర్వేషన్‌ను విద్యా, ఉద్యోగ నియామకాల్లో 1978లో ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం బిహార్ సామాజిక జీవితాన్ని మార్చేసింది. బీసీ రిజర్వేషన్లు బలవంతులైన కొన్ని కులాలకే ఉపయోగపడకుండా, ఎంబీసీలకు సబ్ కోటా కూడా ఆయనే కేటాయించి సామాజిక న్యాయసూత్రాన్ని పాటించారు. కర్పూరీ ఠాకూర్ చేపట్టిన ఈ విధానం దేశవ్యాప్తంగా అమలుకావాలన్న డిమాండ్‌మేరకే మండల్ కమిషన్ వచ్చింది. బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్. మద్యపానం రద్దు, అణగారిన విద్యార్థులకు ఫీజు రద్దు వంటి వాటితోపాటు, బిహార్‌ను ఆధునికత దిశగా నడిపించే ఆలోచనలెన్నో చేశారు. సమర్థుడైన పరిపాలనాదక్షుడు. కాన్షీరాం నిర్మించిన బహుజన ఉద్యమానికి బిహార్‌లో సహాయ సహకారాలు అందించారు. బీసీల గౌరవంకోసం, ఆత్మాభిమానం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు కర్పూరి ఠాకూర్.
అతి సామాన్యమైన, అత్యంత వెనుకబడిన వర్గమైన మంగలి కుటుంబంలో 1924 జనవరి 24న, బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని పితౌజియా గ్రామంలో రామ్‌దులారీదేవీ, గోపాల్‌ఠాకూర్ దంపతులకు జన్మించారు. బిహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బిహార్ రాజకీయాలను శాసిస్తున్న లాలూప్రసాద్‌యాదవ్, నితీశ్‌కుమార్, రాంవిలాస్ పాశ్వాన్‌లకు గురువు. బి.పి. మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్ సిఫారసు చేయకముందే 1978లోనే బిహార్‌లో ఓబీసీలకు, స్ర్తిలకు రిజర్వేషన్ కల్పించారు. దేశవ్యాప్త ఓబీసీ, ఎంబీసీ ఉద్యమానికి ఆద్యుడు. సామాజిక అణచివేత, వివక్షల మధ్య కర్పూరి ఠాకూర్ చదువుకున్నారు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన జాతీయోద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. చదువు ముగిసిన తర్వాత ఒక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ గ్రామీణులను చైతన్యం చేశారు. బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడి జైలు జీవితం గడిపారు. గాంధీ ఆలోచనలను ప్రచారంచేశారు. కానీ కులానికి వ్యతిరేకంగా గాంధీ సత్యాగ్రహం చేయాలని డా.అంబేద్కర్, లోహియాలు కోరినప్పుడు గాంధీ, కాంగ్రెస్ తప్పించుకున్న తీరు కర్పూరి ఠాకూర్‌ను ఆలోచింపజేసింది. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ, పౌరహక్కులు కావాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం జరుగుతున్న సమయంలో లండన్‌లోని రౌండ్ టేబుల్ సమావేశాల్లో గాంధీ వైఖరితో కర్పూరి ఠాకూర్ నిరాశ చెందారు. గాంధీవల్ల మన సమాజంలో ఎలాంటి మార్పురాదని గ్రహించి లోహియా సామ్యవాద సిద్ధాంతం, అంబేద్కర్ కులనిర్మూలన సిద్ధాంతంతో ప్రభావితుడయ్యారు. కాంగ్రెసుకూ గాంధీకీ దూరంగా జరిగి అణగారిన వర్గాల అభ్యున్నతికోసం జీవితాంతం పోరాడారు. రామ్‌మనోహర్ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టు పార్టీకి అధ్యక్షుడిగా చాలాకాలం సేవలందించారు.
స్వాతంత్య్రం వచ్చాక బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 1952లో జరిగాయి. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటినించి చనిపోయేంతవరకు జరిగిన ఎన్నికల్లో దేనిలోనూ ఆయన ఓడిపోలేదు. దేశ ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి పాలకులు కృషిచేయాలని బలంగా వాదించారు. నెహ్రూ అభివృద్ధి నమూనా పనికిరాదని ఆయన విశే్లషించారు. దేశంలో భూస్వాముల వద్ద పోగుపడిన లక్షలాది ఎకరాలు, ప్రభుత్వ ఆధీనంలోకి కోట్లాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేయటంవల్లే ఆర్థిక, సామాజిక సమానత్వం సిద్ధిస్తుందనీ, తద్వారా దేశం వేగంగా పురోగమిస్తుందని భావించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ పాలకుల మార్పిడి మాత్రమే జరిగింది తప్ప విధానాల్లో ఎలాంటి మార్పులేదని చెప్పారు. 1960లో టాటా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణకోసం 28 రోజులు జైలు జీవితం గడిపారు. అప్పుడు కూడా ఆయన శాసనసభ సభ్యుడే అన్నది గమనించాలి. అహింసాయుత సామాజిక పరివర్తనకోసం సంపూర్ణ విప్లవం నినాదాన్ని జయప్రకాశ్ నారాయణ్ పిలుపునిచ్చారు. జయప్రకాశ్ నారాయణ్‌కు సన్నిహితుడైన కర్పూరి ఠాకూర్ ఫార్ములాగా ప్రసిద్ధిగాంచింది. ఓబీసీల ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ కర్పూరి ఠాకూర్‌కు కొత్త రాజకీయ సవాళ్లు ఎదురయ్యాయి. ఓబీసీలతోపాటు ఎంబీసీలు కూడా అన్నిరంగాల్లో ప్రగతి సాధించాలని కోరుకున్నారు. మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అనే కేటగిరీ కర్పూరి ఠాకూర్ వల్లే ఏర్పడింది. దళితులు, ఎంబీసీలు, ముస్లింల హితంకోసం ఆయన పనిచేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి బతికారు. సుదీర్ఘకాలంపాటు బీహార్ రాజకీయాలను, దేశ రాజకీయాలను ఆయన ప్రభావితంచేశారు. సమర్థవంతుడైన పాలకుడిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా పేరొందారు. ఎన్నడూ అవినీతికి పాల్పడని సచ్ఛీలురు ఆయన. 1988 ఫిబ్రవరి 17న అంతిమ శ్వాస విడిచారు. తన 15వ ఏట విద్యార్థిగా ఉండి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగించి, అరెస్టయి, 50 రూపాయలు జరిమానా చెల్లించి, ఒకరోజు జైలు జీవితం గడిపి చిన్ననాటి నుంచి ధైర్యంగల చైతన్యవంతుడని నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడుగా ఉద్యోగంచేస్తూ గ్రామీణ సమాజంలో ఉద్యమాలుచేసి గుర్తింపు పొందారు. చరిత్ర, సమాజశాస్త్రం, రాజనీతి శాస్త్రాలు అధ్యయనం చేసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ భావాలకు ప్రేరేపితుడై క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 24 నెలలు జైలులో గడిపారు. టాటా కంపెనీలో కార్మికులకు మద్దతుగా సమ్మెలో పాల్గొని 28రోజులు జైలు జీవితం గడిపారు. జేపీ పిలుపు ‘సంపూర్ణ విప్లవం’ సాధనకై ఉద్యమించారు. 1978లో దేశంలోనే మొదటిసారి బిహార్‌లో బీసీలకు, మహిళలకు రిజర్వేషన్ల దృక్పథానికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. ‘కర్పూరీ ఠాకూర్ ఫార్ములా’గా ఈ విధానం ప్రసిద్ధి పొంది మండల్ కమిషన్‌కు ప్రేరణ అయ్యింది. జీవితకాలంలో తను నివసించిన పెంకుటింటికి పైకప్పు మార్చుకోలేని పేదరికం. ఢిల్లీలో తన అధికార నివాసం నుంచి లోక్‌సభకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే పార్లమెంటేరియన్‌ని ఎవరితో పోల్చుకోవాలి? ఇక్కడే కర్పూరీ ఠాకూర్ జీవితాన్ని చరిత్ర విస్మరించలేకపోయింది. ఆచరణతో కూడిన ఆదర్శవంతమైన రాజకీయాలు నడిపారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రజాస్వారుూకరించారు. శత్రుపక్షం సైతం పార్టీలను పక్కనపెట్టి ఆయన్ను గౌరవించారు.

- వాసిలి సురేష్ 9494615360