Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ వంగుచున్నట్టి మొక్కల బాగుఁగోరి
చక్కగను దరిఁ జేతురాసక్తి తోడఁ
గన్నకొడుకులు చెడి పోవ ఁ గావఁ బోరె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: వంగిపోతున్నటువంటి మొక్కలను వాటి సంక్షేమంకోరి ఆసక్తితో చక్కగా సరిచేసి పెంచిపోషిస్తారు. మరి ఓ పక్క కన్నకొడుకులు చెడిపోతుంటే అతిగారాబం చేయడం కారణంగా కాపాడాలనుకోవడం లేదే! ఈవిషయాన్ని కర్మసాక్షివైన ఓసూర్యనారాయణమూర్తి కాస్త నీవైనా ప్రబోధించు స్వామి.
తే.గీ. దీపమున్నప్పుడే యిల్లు దిద్దుకొనగ
వలయుఁ జక్కంగ నటులనే బలము గల్గి
కాలుసేతులా డిన వాడెకాసువీస
ములను నార్జించి దాచుకోవలయుఁ గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అలాగే శక్తిసామర్థ్యాలు కలిగియుండి కాలుచేతులు చక్కగా ఉన్నప్పుడే ముందుచూపుతో నాల్గురూపాయలు వెనకేసుకోవాలన్న సత్యాన్ని ఈ లోకానికి తెలియుజేయుము సూర్యదేవా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262