Others

ఆరాధ్య దేవత కన్యక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసవీ దేవి అగ్ని ప్రవేశం చేసి, నేటికి 1000 సంవత్సరాలు గడిచాయి. వాసవీ మాత మాఘ శుక్ల పక్ష విదియ శుక్రవారం శతభిష నక్షత్రం రోజున ప్రాయోపవేశం చేసినట్లు పురాణ కథనం. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడమే జగజ్జనని4కన్యక22 అవతారం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రైమూర్త్య దేవతలకు మూల కారణమైన భువనేశ్వరీదేవిని వాసవీ కన్యకా పరమేశ్వరీ రూపమున పూజించడం సదాచార పరంపరగా కొనసాగుతున్నది. గోదావరీ తీరాన గల 714 గోత్రీకులకు నిలయాలైన 18పట్టణాలకు కేంద్రంగా పెనుగొండ ముఖ్య పట్టణంగా మహా సంపదలతో వైశ్యులలో తలమానికపైన కుసుమ శ్రేష్ఠి, కుసుంబా దేవి దంపతులకు అనేక జన్మార్జితాలైన పుణ్యాలకు తోడు పుత్ర కామేష్ఠి యాగ ఫలము ఏకమై జగజ్జనని పరమేశ్వరీ దేవి వైశాఖ శుక్లపక్ష దశమి నాడు అవతరించింది. అంతకు కొన్ని నిమిషాల ముందే ఒక బాలుడు జన్మించాడు. పరమేశ్వరుని పూజా ఫలమైన కుమారునికి 34విరూపాక్షుడని, జగజ్జనని అవతారమైనందున 34పరమేశ్వరి2అని నామకరణాలు చేశారు.
దేవి సర్వప్రాణులలో శక్తి రూపాన వసిస్తున్నందున వాసవిఅని, పర పురుషులవైపు చూడక, పరమేశ్వరుని యందే మనసు లగ్నం చేసినందున కన్యక2అని నామాంకితయైనది. ఇరువురు కుల గురువు భాస్కరాచార్యుని వద్ద వేదోక్త సంస్కారాలు, వేదాంగాలు నేరుకోగా, పరమేశ్వరి, పండితుల చెంత సంగీత నాట్య సకల కళలలో అసమాన ప్రతిభురాలై, విదుషీమణి యైనది. యుక్త వయస్కుడైన విరూపాక్షునకు సంపన్న కుబేరుడైన అరిది శ్రేష్ఠి కూతురు రత్నావళితో వివాహం జరిపించారు. పరమేశ్వరి వనవతియై, విశ్వమయుడై, మృత్యంజయుడియందే మనసు లగ్నం చేసి నిరంతర ధ్యానం చేస్తున్నది. ఇలా ఉండగా రాజమహేంద్రవరాన్ని పాలించే దుష్టుడైన విష్ణువర్ధనుడు, పక్క రాజ్యాలను జయించి, తిరిగి వెళుతూ, పెనుకొండ వద్ద ఉద్యానవనంలో బసచేయగా, కుసు మ శ్రేష్ఠి తమ ప్రభువును దర్శింప కట్న కానుకలు, దాసదాసీ జనంతో వెళ్ళాడు. రాజును చూడడానికి మహేశ్వరి, తన తల్లి కుసుంబా దేవితో వెళ్ళి, ఆమె వెనక నిలుచుంది. అపురూప సౌందర్యవతియైన మహేశ్వరిని రాజు చూసి, కామవాంఛా పరవశుడై, తాను వివాహం చేసుకుంటానని, కాదంటే బలవంతంగా తీసుకు వెళతానని ప్రకటిస్తాడు. 714 గోత్రికులు సమావేశమై, ఇట్టి వివాహం వర్ణ సంకరం, వయో వ్యత్యాసముచే అనుచితమని నిర్ణయించారు. అయితే రాజుకు నచ్చ చెప్పి పంపుతారు.
కొద్ది దినాలకు విష్ణువర్ధనుడు వివాహ యత్నం చేయగా, పరమేశ్వరిని ఇవ్వడానికి సిద్దంగా లేమని సమాధానం పంపుతారు. ఇది విన్నంతనే రాజు సందేహహరులను ఖైదు చేస్తాడు. వారు తప్పించుకుని, పెనుకొండకు చేరుతారు. కులగురువగు భాస్కరాచార్యుడు అక్షయ నామ సంవత్సర ఫాల్గుణ శుక్లపక్ష పాడ్యమి నాడు 18పట్టణాల 714 గోత్రికులతో నగరేశ్వర మండపాన సమావేశ పరచగా, మహేశ్వరితో పాటు అగ్ని ప్రవేశం చేయ నిర్ణయించారు. కన్యకను అభిప్రాయం కోరగా, పరంజ్యోతి నుండి తనను ఎవరూ వేరు పరచ జాలరని, అగ్ని ప్రవేశం ద్వారా జ్ఞాన మార్గాన పరమేశ్వరుని చేరుకుని, కైలాస వాసిని కాగలనని తేల్చి చెప్పింది. ఇది విన్న కొంత మంది ప్రాణ భయంతో పారిపోగా, 102 గోత్రికులు కన్యకతో ప్రాణ త్యాగానికి సంసిద్దులౌతారు. అగ్ని ప్రవేశ సమయాన వాసవి, తన తల్లిదండ్రులు నలకూబర దంపతులని, వీరనారాయణ పురవాసులగు ధనగుప్త దంపతులు కైలాస నివాసులు, నందీశ్వర దంపతులని, 102 గోత్రికులు ప్రమథ గణాలకు చెందిన వారని వివరించింది. వైశ్యులంతా వేద చోదితమైన మార్గమును వీడవలదని, వేదోక్త సంస్కారాలన్ని ఆచరించాలని, గాయత్రి మంత్ర జపమాచరించాలని, శృతి స్మృతి నిర్దేశిత మార్గాన్ని అనుసరించాలని ధర్మమార్గాన్ని వీడ వలదని బోధించింది. అలా అగ్ని గుండాన ప్రవేశించి, ఆత్మార్పణం ద్వారా నిజ స్థానాన్ని పొందింది. 102 గోత్రికులు అనుసరించి పుణ్యలోక ప్రాప్తులైనారు. నాటి నుండి వైశ్యులు త్రిమూర్తులకు మూల కారణమైన భువనేశ్వరిని, కన్యకా పరమేశ్వరీ రూపాన పూజించడం సదాచారంగా, సత్సంప్రదాయంగా మారింది.

- సంగనభట్ల రామకిష్టయ్య