AADIVAVRAM - Others

విద్యార్థులకు ప్రేరణ కల్గించే విధానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతరులకు తమకు తెలిసిన విషయాలు చెప్పే అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరు తమకు తెలియకుండానే ఉపాధ్యాయుడు పాత్రలో ప్రవేశిస్తూ ఉంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. లేదా మీకు ఇష్టమైన క్రీడల గురించి ఇతరులకు చెప్పాల్సి వస్తూ ఉంటుంది.
తరగతి గదిలో పాఠాలు చెప్పడం మాత్రమేగాక, ఇతరులకు తరగతి గది ప్రమేయం లేకుండా విషయాలు చెప్పవలసిన పరిస్థితులు వస్తాయి.
మీరు ఎలా చెప్పారు అనే విషయంకన్నా ఒక్కసారిగా ఉపాధ్యాయ పాత్ర నిర్వహించడం ఎంత కష్టమో మీ అనుభవంలోకి వస్తుంది. మీరు మీ నైపుణ్యంతో పనిని అద్భుతంగా చేయగల్గుతారు. కాని ఆ పనిని ఎలా చేయాలో చెప్పి ఇతరుల చేత చేయించడం ఎంత కష్టమో తెలుసుకుంటారు. విద్యార్థులకు ప్రేరణ కల్గించడం అనేది అత్యంత ఆవశ్యకమైన విషయం.
బోధించడం సరిగా తెలియక విద్యార్థిని మందలించడం వలన ఆ విద్యార్థి భవిష్యత్‌ను పరాధీనం చేసినవారవుతారు. ఆ విధంగా కాక విద్యార్థికి ప్రేరణ కల్గిస్తూ ఆసక్తిదాయకంగా విషయాన్ని వివరించగల్గితే ఆ విద్యార్థి ఎంతో సులువుగా విషయాలను నేర్చుకోగల్గుతాడు.
విద్యార్థుల ధోరణి
* తమ పరిసరాలను అదుపు చేయగల నైపుణ్యాలను నేర్చుకునేందుకు విద్యార్థులు ఇష్టపడతారు.
* సామాజికంగా వారికి గుర్తింపు తెచ్చే అంశాలు నేర్చుకునేందుకు వారు తాపత్రయపడతారు.
* నేర్చుకునే వారికి మేథాపరమైన అద్భుతాలు చెబితే అవి ఎంతో వారికి ప్రేరణగా నిలుస్తాయి.
* కొత్త సబ్జెక్ట్ విద్యార్థులు నేర్చుకునేటప్పుడు, ప్రత్యేక సమస్యల సాధనపై శిక్షణ పొందేందుకు ప్రాధాన్యత ఇవ్వడమేగాక, సులువుగా వాటిని నేర్చుకోగల్గుతారు.
* అసాధ్యమైన సవాళ్లు ఎంతటి గొప్ప ప్రేరణ కల్గించినా చురుకైన విద్యార్థుల ఉత్సాహాన్ని కూడా చల్లార్చి వేస్తాయి.
* ఉపాధ్యాయుడు ప్రేరణ పొందకపోతే, విద్యార్థులను ఏ మాత్రం ప్రేరణ చెందించలేడు. కనీసం ప్రేరణ విలువ కూడా ఉపాధ్యాయుడికి తెలియదు.
* కొత్త విషయాలు విద్యార్థి ముందుంచినపుడు, ఆ విద్యార్థికి దానిపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ అభిప్రాయం అనుకూలమైనది కాకపోతే, దానికి సంబంధించినది ఏది చెప్పినా విద్యార్థి గ్రహించలేడు.
* సాధారణంగా విద్యార్థులకు ఆసక్తి, భయం బాగా ప్రేరణ ఇస్తాయి. ఈ రెండింటిలోను ఆసక్తి చాలా బలమైన ప్రేరణ కల్గిస్తుంది.
* విద్యార్థులు తమ లక్ష్యాలు అర్థవంతమైనవని సులువుగా వాటిని సాధించగలరనే నమ్మిక వారికి కలుగజేయాలి.
* మీరు విద్యార్థిని ఏ విధంగా ఆదరిస్తున్నారనే దానికి వారి ప్రవర్తనే దానికి ప్రత్యక్ష స్పందన.
* కొత్త విషయాలు వారి ముందుంచినపుడు మూడు ప్రతిస్పందనలు వారిలో ఏర్పడతాయి.
1.తక్షణం వాటికి అనుకూలంగా తయారవ్వడం
2.నిరాశా నిస్పృహలతో వాటిని త్యజించడం
3.నిరాశను జయించి ఏదో విధంగా వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయడం.
*ఎట్టి పరిస్థితుల్లోను విద్యార్థిని తప్పు పట్టకూడదు. వారు నేర్చుకునే విధంగా వారిలో ప్రేరణ కల్గించాలి.
అనువర్తనాలు
* విద్యార్థులు నేర్చుకుంటూ అభివృద్ధి చెందేటట్లు చేయాలి. విద్యార్థిలో అభివృద్ధి గుర్తించినపుడు అతనిని ప్రోత్సహించాలి.
* నేర్చుకునే తొలి రోజుల్లో ఫలితాలకన్నా ప్రయత్నాన్ని గుర్తించాలి.
* మీరు చెప్పేవన్నీ మీ విద్యార్థులు సులువుగా నేర్చేసుకుంటున్నారంటే మీ ప్రమాణాలు తక్కువగా ఉన్నాయని అర్థం.
* ప్రతి ఒక్క విద్యార్థి నాణ్యమైన విధంగా తాము నేర్చుకున్నది ప్రయోగాత్మకంగా వినియోగించుకునేటట్లు బోధించాలి.
* ప్రవర్తనను విమర్శించవచ్చు గాని, ప్రవర్తించే వారిని విమర్శించకూడదు.
* ఆట మాదిరి విద్యార్థులు సబ్జెక్టు నేర్చుకునేటట్లు బోధించాలి. ఆడుతూ, పాడుతూ విషయాలు తెలుసుకుంటున్నట్లు చేయాలి.
* విద్యార్థులకు ప్రేరణ కల్గిస్తూ వారి ఆలోచనలకు పదునుపెట్టే ఓపెన్ - ఎండెడ్ ప్రశ్నలు వేయాలి.

-సి.వి.సర్వేశ్వరశర్మ