Others

వందనాలు వందనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. నీలోన నేతాజీ నీలోన కరుణ యల్లూరి
భగతుసింగము వీణ ప్రతిఫలించె
ఆజాదు నీలోన నాగురుగోవిందు
డలరారె నిన్నంత నావహించె
గాంధి మహాత్ముడు గలడు నీలో ఁజూడ
నెహ్రూజీ న ఈలోన నిలువరించె
భద్రకాళినిఁ బోలు రుద్రమ్మ ఝన్సీల
తేజమ్ము నీలోనఁ దేలువాఱె

ఆ.వె. నాపటేలు శాస్త్రు లాశయ స్ఫూర్తివై
సామ్యవాదమునకు సతతమీవు
పాటు బడుచు దేశభక్తి ని హృదయాన
నింపుకొనగవలెను నిత్యమీవు!

- కె.ఎస్.ఎస్.