Others

ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి 26 ప్రతిజ్ఞ ఆమోద దినోత్సవం సందర్భంగా
*
భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారతదేశంలో ‘్భరతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ ద్వారా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను , సమగ్రతను చాటిన తెలుగు తేజం పైడిమర్రి వెంకట సుబ్బారావు. భారత స్వతంత్ర సంగ్రామంలో వందేమాతరం అనే పాట ఎలా భారతీయుల్లో దేశభక్తిని , స్వతంత్య్ర కాంక్షను పెంచినదోస్వాతంత్య్రానంతరం పైడిమర్రి గారి భారత జాతీయ ప్రతిజ్ఞ భారతీయుల ఐక్యతను, దేశభక్తిని, జాతీయతను భవిష్యత్తు తరాలకు చాటే విధంగా ఉందనడంలో సందేహం లేదు.
జూన్10, 1916లో నల్లగొండ జిల్లా అనె్నపర్తి గ్రామంల జన్మించిన పైడిమర్రి మంచిరచయిత. బహుభాషావేత్త. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ట్రెజరీ విభాగగంలో ఉద్యోగం సంపాదించాడు. పుస్తక పఠనం. పుస్తక సేకరణ, కవితా వ్యాసంగం , వేద అధ్యయనం చేసేవారు. పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి వెట్టిచాకిరి ,్భస్వామ్య వ్యవస్థ పై పలు రచనలు చేశారు. ఆయన తన 18వ ఏటనే ‘‘కాలభైరవుడు’’ పేరున చిన్న నవల రాశారు. 1945 లోనే ఉషస్సు కథలు సంపుటిని రచించి తొలితరం కథా రచయితగా నిలిచారు.
దేవదత్తుడు, తులసీదాస్ , త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు,బ్రహ్మచర్యం, గృహస్థు జీవితం, స్ర్తిధర్మం , ఫిరదౌసి, శ్రీమతి అనేనాటకాలు రాశాడు. అదేవిధంగా అనేక అనువాద రచనలు చేశారు. 1945-46 లలో నల్లగొండలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తులో సభలో ప్రముఖ పాత్ర వహించారు. పైడిమర్రి గారి రచనలు, సేవలు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా చెప్పుకోవచ్చు.
‘‘్భరతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను’’ అంటూసాగే ప్రతిజ్ఞ నేడు దేశంలోని ప్రతి పాఠశాలలో పసి హృదయాలలో గుండెల నండా దేశభక్తిని పాదుకొల్పుతున్నది. ఈ ప్రతిజ్ఞ 1962లో పైడిమర్రి గారి కులం నుండి పురుడు పోసుకున్నది. ఈ రచనను చదివి ఉప్పొంగిన సాహితీవ్త్తేతెనే్నటి విశ్వనాథ, నాటి విద్యాశాఖ మంత్రి పివిజి రాజు దృష్టికి తీసుకెళ్లి ప్రతిజ్ఞ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాతప్రతిని అందచేశారు.
తరువాత బెంగుళూరు వేదికగా జరిగిన కేంద్రవిద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా ఆమోదించారు. జనవరి 261965 ఆమోదించిన నాటి నుంచి ప్రతి పాఠశాలలో ఈ ప్రతిజ్ఞ చేయించడం అధికారికంగా మొదలై నేటికీ 55 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది.
భారతదేశ జాతీయ సమైక్యతను తెలియజేసే ప్రతిజ్ఞ రచయిత పేరు తగిన ప్రాచుర్యంలో లేకపోవడం పెద్ద చారిత్రక తప్పిదంగా నేటి తరం రచయితలు, మేధావులు పరిగణించారు. దీన్ని మొదటగా గుర్తించిన ఎలికట్టి శంకరావు 2011 లో ఒక మహనీయుడి మూలాలలను పపంచానికి తెలియజేయాలని కొంతమంది సాహితీ మిత్రలతో కలసి ‘ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి’ అనే పేరుతో ఒక ప్రత్యేక సంచికను ప్రచురించారు. పైడిమర్రి పేరును పాఠ్యపుస్తకాలలో ముద్రింపచేయాలని ఉత్తరాంధ్ర రక్షణ తెనే్నటి పౌండేషన్ ప్రయత్నించాయి. ఈ పరంపరకొనసాగుతున్న తరుణంలో జన విజ్ఞాన వేదిక అనే ప్రజాసైన్స్ ఉద్యమ సంస్థ ప్రతిజ్ఞ అంశాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని క్షేత్రస్థాయిలోకి విస్తృతంగా తీసుకొని వెళ్లింది.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో ప్రతిజ్ఞ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయి. పైడిమర్రి జీవిత చరిత్రతో కూడిన కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశారు. ఈ తరుణంలో జన విజ్ఞాన వేదిక బాధ్యుడు మందరపు రాంప్రదీప్ పలు పాఠశాలలను సందర్శించి వేలాదిమంది విద్యార్థులను కలుసుకొని పైడిమర్రి గారి జీవిత చరిత్రను వివరించారు. ఎట్టకేలకు జనవిజ్ఞాన వేదిక, పలు అభ్యుదయ వాదుల కృషిఫలించి తెలుగు రాష్ట్రాలలో నూతనంగా ఆముద్రించిన పాఠ్య పుస్తకాలల్లో ప్రతిజ్ఞ ఎగువన పైడిమర్రి పేరు చేర్చారు. భారతీయతను చాటే ప్రతిజ్ఞను దేశానికి అందించిన పైడిమర్రి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని జనవిజ్ఞాన వేదిక డిమాండ్ చేసింది.
పైడిమర్రి వెంకటసుబ్బారావు గారి జీవిత చరిత్రను ఎం. రాంప్రదీప్ ‘్భరతదేశం నా మాతృభూమి’పేరుతో ఆంగ్లంలో ‘ది పార్గాటెన్ పేట్రియాట్’ పేరుతో రాసి పైడిమర్రి గొప్పదనాన్ని పాఠకులకు తెలియజేశారు. భారతీయులంతా ఒకటేనని చాటిచెప్పి ప్రతిజ్ఞ జాతీయ సమైక్యత, సమగ్రతకు, దేశభక్తికి ఎంతో దోహదపడుతుంది. అదేవిథంగా స్వీయక్రమ శిక్షణ నేర్పుతూ మన జాతి గొప్పతనాన్ని చాటి చెబుతూ నిండైన దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. చివరగా తల్లి గర్భంలో నుంచి పుట్టిన ప్రతి బిడ్డకు మాతృదేశం పట్ల ప్రేమ మరియు మమకారం చాటడానికి పైడిమర్రి గారి ప్రతిజ్ఞ నేడు చారిత్రక అవసరం అని కూడా చెప్పవచ్చు.

- సంపత్తి రమేష్ మహారాజ్ 9959556367