Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. లోకమందున మోసాలనేకమాయె
నెట్టి సందర్భమున మోసమెట్టిదైన
మోసపోరాదు పలికితి ముద్దు లొలుకు
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈలోకంలో మోసాలెక్కువవై పోయాయ. ఎలాంటి సందర్భంలో నైనా ఎలాంటి మోసమయనా?ఎట్టి పరిస్థితిలో నైనా ఏ ఒక్కరూ కూడా మోసపోరాదని ముద్దుగా పలికాను. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ! మోసపోవద్దని జనాలకు చెప్పవయ్యా నీవైనా ప్రభాకరా!
తే.గీ. వ్యర్థమైనట్టి ఖర్చులనర్థహేతు
కములు దప్పని ఖర్చులు గాదనకుమ
పైస విలువను దెలుసుకో వలయు సుమ్మి
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం అనేకమైన అనర్థాలకు కారణాలు అనవసరమైన ఖర్చులే. తప్పని సరైనఖర్చుల విషయంలో మాత్రం లోభత్వం కూడదు. ఏదియైమైనా పైస విలువ తెలుసుకొని ఖర్చుచేయాల్సిన అవసరం ఉందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! అనవసరమైన ఖర్చులు మానుకోమని చెప్పవయ్యా సూర్యనారాయణమూర్తీ !

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262