Others

సహృదయత అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమర్శ ఎలా ఉండాలి? విమర్శ ఒక రచనని ప్రకాశింపజేయిస్తుంది. ఒక రచనని ప్రకాశింపజేయని విమర్శ అసలు విమర్శనే కాదు. భారతీయలంకారిక సిద్ధాంతాలన్నీ కూడా విమర్శ కావ్యగత సౌందర్యాన్ని ప్రకాశింపజేస్తుంది. అయితే ఒక రచనని మనం చదివినపుడు అది చాలా బాగుంది అన్నా, రచనలోని కొన్నిటిని చదివినా కూడా మనకు పూర్తిగా తెలిసినట్టు కాదు. ‘రచనలోని ఏ అంశం బాగుంది, ఎక్కడ బాగుంది, దాన్ని ఎలా విడదీసి చూడాలి, విశిష్టమైనదిగా ఉందా, ఒకవేళ రచన ప్రత్యేకతని పెంచే ప్రయోజనకర మాటలు రచన బలాన్ని పెంచుతుందా- ఇన్ని ప్రశ్నలకి విమర్శ మాత్రమే సమాధానం ఇవ్వగలదు.
సాహిత్యంలో ఒక రచనా వైశిష్ట్యాన్ని చూపించేదే విమర్శ. మంచి విమర్శ అన్నది సాంప్రదాయిక అవిచ్ఛిన్నతని పోషిస్తుంది. మంచి విమర్శ పాఠకుడి అభిరుచిని తీర్చిదిద్దుతుంది. పాఠకుడు కేవలం వాచ్యంగా రచనకే పరిమితమై అభిరుచి కలిగిన అతన్ని విమర్శ, వ్యంగ్య, వక్రత, అలంకారిక ప్రధానమైన రచనలు ఆస్వాదించే స్థాయికి తీసుకువస్తుంది. ఇట్లా పాఠకుడి అభిరుచి స్థాయిని పెంచేదే విమర్శ. విమర్శ అన్నది రచనలోని సౌందర్యన్ని దానిలోని ప్రాణాన్ని విశదీకరిస్తుంది. విమర్శ ముందా? రచన ముందా అన్న ప్రశ్న ఉదయించినపుడు పాఠకుడికి ముందు వచ్చేది రచనే. దానిలోని గుణగణాల్ని తేల్చి రచన ఉత్తమమైనదా లేదు, ఉత్తదేనా అన్నది తెలుస్తుంది. మరి ఆ రచన రాసిన రచయితలో అంతర్లీనంగా జరిగే సంఘర్షణ మాటేమిటి? అయితే ఒక రచన చేసేప్పుడే రచయిత పలు విధాలుగా తన రచనలోని లోపాల్ని చూసుకొని స్వీయ విమర్శ చేసుకుంటాడు. అయితే రచనని ప్రకాశింపజేయడానికి వచ్చే విమర్శ రచనలో భాగం కాదు. రచన వేరు విమర్శ వేరు. మంచి రచనకి విమర్శ తోడు అయితే గొప్పగా విలసిల్లుతుంది. రచన తరువాతనే విమర్శ కాబట్టి దానికి ఉండే లక్షణం వేరు. అంతర్గతంగా రచనకి స్వీయ విమర్శ లేకుంటే అది జీవం లేని రచననే. విమర్శ లేని రచన చైతన్యం కోల్పోయి యాంత్రికత కొట్టినట్టుగా ఉంటుంది. గొప్ప రచన అయినా కూడా ఒక స్థాయిలో విమర్శ చేసుకొని పాఠకుడి ముంగిట నిలపగలిగితేనే దానికి సార్థకత లభిస్తుంది. అలా కాకపోతే అది కేవలం అనుభూతి ప్రధానంగానే మిగిలిపోతుంది.
ఒక రచన గుణాన్ని నిర్ణయించడానికి అనేక సాహిత్య సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ఒకసారి పురాతన భారతదేశ సాహిత్య మేధావుల్ని పరిశీలిస్తే పండితులు, సహృదయులు అయిన భరత, భామహా, దండీ, వామన, ఆనంద వర్థన, కుంతక, రుయ్యాక, జగన్నాధ వంటి ఎందరో మేధావులు సూక్ష్మ వివేచనతో రస, అలంకార, గుణ, రీతి,్ధ్వని, వక్రోక్తి లాంటి సిద్ధాంతాలని ప్రతిపాదించారు. కవిత్వానికి కూడా సాధ్యమైనంతవరకు విమర్శ పరికరాలను ప్రాచీనులు సిద్ధం చేశారు. ప్రధమ శతాబ్దం నుంచి ఇంచుమించు పదిహేడవ శతాబ్దం వరకు విమర్శపై భారతదేశంలో కృషి జరిగింది.
అయితే విమర్శ స్వభావం ఎలా ఉండాలి? వైయక్తిక ప్రశంశ దగ్గరనో, స్వీయ వ్యక్తి మీద రచన వేసిన ప్రభావం ఏమిటి అన్న దగ్గర్లోనే పాఠకుడు ఆగిపోతే విమర్శలోకి సరిగా ప్రయాణం చేయలేదనే అనుకోవాలి. అయితే రచన చదివే పాఠకుడు సహృదయుడు అయి ఉండాలన్నది ప్రాచీన అలంకారికుల అభిప్రాయం.
విమర్శకులని స్థూలంగా నాలుగు విభాగాలుగా వివరించాడు ఇలియట్. అసమగ్ర విమర్శకులు, అసత్య విమర్శకులు, నిరంకుశ విమర్శకులు, సాంకేతిక విమర్శకులు అని వర్గీకరణ చేశాడు. రచనకి అన్వయమైనవి అని పరిశీలించే విమర్శకుడు సాంకేతిక విమర్శకుడిగా పరిగణించారు. ఇక నిరంకుశ విమర్శకుడు నియమాలని తయారుచేసి ఒక టేప్‌తో కొలిచినట్టుగా రచనని తూకం వేస్తాడు. అయితే సాంకేతిక విమర్శకుడిని మొత్తం విమర్శకుడిగా ఇలియట్ అంగీకరించలేదు.
విమర్శలో సమతౌల్యం, భావావేశ రాహిత్యం, బౌద్ధికత ఉండాలి. అవి లోపిస్తే విమర్శకుడు అసమగ్ర విమర్శకుడు అవుతాడు. పాండిత్యం, పరిశీలన, సహృదయత, విశే్లషణ లాంటి ప్రాథమిక విమర్శ లక్షణాలనేవి లేకుండా కేవలం లేఖనా చాతుర్యంతో రాసేవాడు అసత్య విమర్శకుడు. ఈ నాలుగు రకాలవాళ్లు సరైన విమర్శకులు కారు. అభిరుచి విమర్శకుల సహృదయత వున్నవారే గాని మిగతా ముగ్గురికి సహృదయతని ఆశించడం అత్యాశే అవుతుంది.
అయితే విమర్శకుడు కేవలం ప్రశంసని ఇచ్చినంత మాత్రాన రచనమీద వెలుగు ప్రసరించదు. అలాగే విశే్లషణ, సహృదయత లేని విమర్శ రచనని దెబ్బతీయడానికే పనికివస్తుంది. అందుకే రచనమీది విమర్శ రచనలోని పరమార్థాన్ని, అది కలిగించే అనుభూతిని, వైశిష్ట్యాన్ని తెలిపేదిగా ఉన్నపుడే అది మంచి విమర్శ అవుతుంది. మరి విమర్శ మీద పట్టు సాధించాలి అంటే విమర్శకునికి శిక్షణ అవసరం. సుశిక్షితుడు కాని విమర్శకుడు చేసిన విమర్శలో పస ఉండదు. నాలుగు పనులని విమర్శకుడు చేయాలి. విశే్లషణ, తులనాత్మక పరిశీలన, వ్యాఖ్యానం, చివరిది నిర్ణక్షం. ఈ నాలుగు అంశాలు ఉన్నపుడే అది విమర్శ అవుతుంది.
విమర్శకుడికి ఉండాల్సిన లక్షణాలని ఇలియట్ గొప్పగా వర్ణించాడు. అలాగే విమర్శకుడి లక్షణాలను వాటి తీరుతెన్నులని అనుశీలన (సాహిత్య విమర్శ) అనే గ్రంధంలో మందేశ్వరగారు రచించిన ఈ గ్రంథంలో చూడొచ్చు. విమర్శకుడు వ్యాఖ్యానించాలి, రచనని వివరించాలి. అలా చేయకపోతే విమర్శ తన వైశిష్ట్యాన్ని కోల్పోయి సంక్షిప్తీకరణం లాంటి ఒక యాంత్రిక వ్యాపారంగా మారుతుంది.
పాండిత్యము, బుద్ధి నైశిత్యము అన్నది విమర్శకునికి ఉన్నపుడే అతని విమర్శ సారవంతమై, విద్యగా రూపుదిద్దుకొని పాఠకులకి, రచయితలకు ఉపయోగపడుతుంది. మంచి విమర్శకుడు సహృదయుడు అయినప్పుడే నాలుగు కాలాలపాటు రచనని ప్రకాశింపజేయగలడు. రచన ప్రకాశవంతం అయినపుడే రచయిత కూడా చరిత్రలో నిలిచిపోయే రచనలు చేయడానికి ముందుకు వస్తాడు. ఒక రచన మంచి విమర్శకుడి చేతిలో పడ్డాకనే వెలుగులోకి వస్తుంది అన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు.

-పుష్యమీ సాగర్