Others

శాంతమూర్తి సరస్వతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరస్వతీ దేవి శాంతమూర్తియై ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి దర్శనమిస్తుంది. ఈ తల్లి విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఈ జ్ఞాన ప్రదాయిని కరుణ తోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఈతల్లిని మాఘశుద్ధ పంచమి రోజు విశేషంగా ఆరాధిస్తారు. మాఘశుద్ధ పంచమిని ‘శ్రీపంచమి’ అంటారు. శ్రీపంచమి విద్యారంభ దినమని అందరూ దేవీభాగతం, బ్రహ్మాండ పురాణం వంటి పురాణాలలో శ్రీ పంచమిని గురించి విశేషంగా చెప్తున్నాయ. సకలవిద్యా స్వరూపిణి అయిన పరాశక్తి ‘సరస్వతీ దేవి’గా జన్మదినంగా చెప్తారు.
మాఘ పంచమిన అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణంచెప్తుంది.ఈ రోజున విద్యాభ్యాసం చేసినవారికి సకల విద్యలూ కరతలామలకం అవుతాయ. విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత విద్యాదానానికే ప్రాముఖ్యత ఉంటుందని ప్రతివారు చదువుకునేవారికి సాయం లేదనకుండా చేయాలని పెద్దలు చెబుతారు.
విద్యచేత వినయం, వినయం చేత జ్ఞానము, జ్ఞానము చేత ధనం, ధనం చేత అధికారము సంప్రాప్తిస్తాయి. ఎవ్వరిచే దొంగిలించబడనిది, నలుగురికి పంచగల శక్తి విద్యకు మాత్రమే ఉంది. సమాజంలో విద్య కలిగినవాడు ధనవంతుని కన్నా, సంఘంలో గొప్పవాడని, ఎక్కడివెళ్లినా బతకకలు గుతాడని చెప్పే శతకకర్తల మాటలు ప్రతివారి జీవితంలోనూ అనుభవంలోకి వస్తాయ.
మనిషికి మాటేప్రాణం సరస్వతీ దేవిని ప్రతివారు ఆరాధించి సద్బుద్ధిని పొందడానికి కృషి చేయాలి. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అనీ పిలుస్తారు. సరస్వతీ దేవిని పూర్వం అశ్వలాయనుడు ఆరాధించి ఆ తల్లి కటాక్షం పొందాడని అంటారు. సరస్వతీ దేవి ఆరాధించే విధానం ‘సరస్వతీ రహస్యోపనిషత్’ అనే గ్రంథం తెలియపరుస్తోంది. ‘‘వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలు గల ఈ వాగ్దేవి ‘సామాంపాతు సరస్వతి’ అనే మకుటంతో ఉన్న శ్లోకాలతో పఠించడం వల్ల శారదాదేవి సంతోషించి అపార జ్ఞాన రాశిని ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తారు.

- కూచిబొట్ల వెంకట లక్ష్మి