Others

అమ్మతనం ఆడదానికి వరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మతనం అనేది ఆడవారికి దేవుడిచ్చిన వరంగానే చెప్పాలి. అమ్మనవ్వాలని ప్రతి స్ర్తి తహతహలాడుతోంది. గర్భవతి అయినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవటానికి ప్రయత్నించినపుడే కాలచక్ర భ్రమణం సజావుగా సాగుతోంది.
గర్భం పోవటమనేది నేడున్న జీవనయానంలో సర్వ సాధారణంగా జరిగిపోతుంది. ప్రతి ఆరు గర్భాల్లో ఒకటి పోతుందని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. కాబట్టి గర్భవతులు ఎల్లవేళలా జాగ్రత్తలు పాటిస్తే సుఖ ప్రసవానికి దగ్గరవుతారు.
గర్భం ధరించిన మహిళలు ఎలాంటి వత్తిడి, భయానికి లోనుకాకుండా ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అది కడుపులోని బిడ్డపై ప్రభావం చూపుతోంది.
బరువైన వస్తువులు మోయకూడదు. విశ్రాంతి తీసుకోవటానికి ప్రాధాన్యతనివ్వాలి.
పుట్టబోయో బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి పౌష్టికాహారమైన పాలు, పండ్లు, మాంసం, గుడ్లు తీసుకోవటానికి ప్రాధాన్యత నివ్వండి.
ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదిస్తూ వారు చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.
నెలలు నిండిన స్ర్తిలు ఎక్కువగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఒకవేళ ప్రయాణం చేయాల్సివస్తే కుదుపులు లేకుండా చూసుకోవాలి.
నెలలు నిండిన తరువాత శృంగారానికి దూరంగా ఉండటం మంచిది.
నిద్రపోయేటపుడు ఎడమవైపు తిరిగి పడుకోవటం మంచిది.
ప్రసవం అయిన వెంటనే బిడ్డకు తల్లి చనుబాలు ఇస్తే బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
భవిష్యత్తులో ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. *