Others

లింగపూజ అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన ధర్మం అంటే సనాతనం అంటే శాశ్వతము ప్రస్తుతము మతంగా కొనసాగుతున్న హిందూ ధర్మంలో విగ్రహరాధన ప్రత్యేక విశిష్టతను సంతరించుకొన్నది. విశ్వవ్యాప్తమైన మహాచైతన్యమే మన ముందు ఉన్నదనే భావనతో భగవంతుడిగా నామకరణం చేసికొని స్ర్తి, పురుషరూపాలలో, విగ్రహారాధన చేస్తారు హిందువులు. విగ్రసాన్ని మలచి అట్టి విగ్రహశక్తిని యంత్ర రూపంలో ఉంచి విశేషమంత్ర శక్తిని ధారపోసి వేదోక్తముగా ప్రాణప్రతిష్ట చేయుట జరుగుచున్నది.
విగ్రహము అనగా విశేషముగా గ్రహించునది అని అర్థం. ప్రాణప్రతిష్టచేయబడిన విగ్రహానికి ప్రతినిత్యం అభిషేకము. ధూపదీప నైవేద్యముతో ఆరాధన చేయబడుచున్నది. అట్టి విగ్రహాన్ని దర్శించి, ధ్యానించి సమస్త విశ్వాన్ని దర్శించిన అనుభూతి పొందుతూ విశ్వకల్యాణాన్ని కోరుకునుచున్నారు హిందువులు. అంటే విగ్రహము నిగ్రహము కోసమేనని తెలుసుకోవాలి. భారతీయులు చేసే శివాలింగార్చన, అభిషేకాదులను కొంతమంది పాశ్చాత్యులు, విమతస్తులు ద్వేషభావనతో హిందువులు జడపదార్థాన్ని పూజిస్తారని అవహేళన చేస్తున్నారు.
సత్యం తెలియకోవడం, తెలుసుకొనాలనే కోరిక లేకపోవటమే ఈ మూర్ఖత్వానికి కారణం. సత్యమేమంటే విశ్వం అంతటిని ఒకే చైతన్యంగా లేక అఖండ చైతన్యంగా చూడగలగడం భారతీయుల స్వంతం. రుద్రాభిషేకం చేసేటప్పుడు ఈ మహావిజ్ఞానాన్ని ఒక ప్రార్థనాశ్లోకంగా మనం పెట్టుకున్నాం. ఈక్రింది శ్లోకాన్ని చూడండి.
శ్లో॥ ఆ పాతాళ నభఃస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్
జ్యోతిః స్ఫాటిక లింగవౌళి విలసత్ పూర్ణేన్దు వాన్తామృతైః
అస్తోక ప్లుత మేక మీ శమనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివమ్ ॥
పై శ్లోకం విశ్వమంతా శివలింగాకారంలో ఉన్నదని మనకు చెప్పుచున్నది. అంటే శివలింగాన్ని అభిషేకించటం విశ్వాన్ని ఆరాధించుటమేనని తెలుస్తోంది కదా. అర్థనారీశ్వర స్వరూపాన్ని లింగాకారంలో పూజించుటలో విశ్వంలో స్ర్తి పురుషతత్వాలు యిమిడి ఉన్నాయి. సృష్టి తత్వం ఒక్కటే అనే దానికి సంకేతంగా ఖగోళమంతా లింగాకారంలో ఉన్న కారణంగా లింగాకారాన్ని పూజించుట విశిష్టమైన ఆధ్యాత్మిక తత్త్వం. నాస్తికులు, హేతువాదులు అనూచానంగా వస్తున్న శాస్త్ర విషయాలకు కూడా ఆధారము లేనిదే నమ్మనంటారు. పైవిషయంలో అటువంటి వారి సందేహవృత్తికి బ్రహ్మాండమంతా శివలింగాకారంలో ఉన్నదని నిరూపించే ఈ చిత్రమే దృష్టాంతం. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఇ.ఎన్.ఏ) ఉపగ్రహము ద్వారా ప్లాంక్ టెలిస్కోప్ నుపయోగించి ఒక సంవత్సరమంతా పూర్తి విశ్వాన్ని ఛాయాచిత్రంగా చిత్రీకరించి 2010 జూలై 5వ తేదిన ప్రపంచానికి ఇట్టి చిత్రం వేదాలలోను, పురాణాలలోను ఉన్న విషయాలు వాస్తవాలని నిరూపించడం జరిగింది.ప్లాంక్ టెలిస్కోప్ ద్వారా వెలువడిన ఛాయాచిత్రం ద్వారా విశ్వం ‘శివలింగం’ ఆకారంలో ఉన్నదని తెలియవచ్చినది. (బ్రహ్మాండం శివలింగం ఆకారంలో ఉన్నదని ‘లింగపురాణం’ మూడవ అధ్యాయంలో చెప్పబడింది) విశ్వచిత్రంలో శివలింగరూపం హాట్‌గాస్ తో ఏర్పడింది. శివపురాణంలో ఆద్యంతాలు తెలియని జ్యోతిర్లింగం సృష్టికి ముందు ఆవిర్భవించినట్లు చెప్పబడింది.తైత్తిరీయాణ్యకమనే వేదభాగంలో విశ్వంలోని జ్యోతిరోళసమూహాన్ని శిశుమారము (మొసలి) ఆకారంలో ఉన్న విరాట్పురుషునిగా ధ్యానం చేయమని చెప్పారు. విరాటపురుషుడు విశ్వచిత్రంలో శిశుమారం ఆకారంలో కనబడుచున్నాడు. ఇట్టి శిశుమారానికి శిరస్సు పరబ్రహ్మ మూర్ధం, ధర్మం, పైదవడ చతుర్ముఖ బ్రహ్మకింది దవడ యజ్ఞ పురుషుడు, అశ్వినులు ముందు పాదాలు, హృదయం విష్ణువు మిత్రావరుణులు వెనుక పాదాలు, మధ్యమం అత్రిమహర్షి జననేంద్రియం సంవత్సర దేవత, తోక మొదటి భాగం ఇంద్రుడు , మూడవ భాగం ప్రజాపతి , నాల్గవ భాగం భయరహితమైన బ్రహ్మరూపం, ఇది సమస్త విశ్వరూపం, శక్తివంతం (తైత్తిరీయారణ్యకం ప్ర-2-పుట-196)
(ఈ వివరాలన్నీ డా. చిర్రావూరి శివరామ కృష్ణశర్మగారిచే రచించబడిన ‘శ్రుతిసౌరభం’ గ్రంథంలో వివరించబడ్డాయి.)
సమస్త విశ్వానికి ధర్మమే ఆధారం. నిలబడడానికి ఆధారం పాదాలు. నేటి కలియుగంలో ధర్మం మూడు పాదాలు లోపించి ఒక పాదంపై నడుస్తుంది. అందుకే ఈ శిశుమారం ఒకే పాదంపై ఆధారపడియున్నది. అందుకే ధర్మం యొక్క ప్రభావం తగ్గి, అధర్మం ప్రభావం పెచ్చరిల్లుచున్నది.
శిశుమారాన్ని యజ్ఞాల ప్రారంభంలో ధ్యానిస్తారు. సాయంకాలం ఉత్తరంవైపు తిరిగి ధ్యానిస్తే అపమృత్యు దోషం తొలగుతుంది. స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అగ్ని ప్రమాదం వల్ల మరణం దూరమవుతుంది. నీటి ప్రమాదం వల్ల మరణం తప్పిపోతుంది. సంతానం లేకుండా మరణం ప్రాప్తించదు. ఆహారం బాగా జీర్ణమవుతుంది అని ఈ ధ్యానాకి ఫలం చెప్పారు. ఈ శిశుమార ప్రస్తావన శ్రీ మద్భాగవతంలో కూడా ఉంది. పై వేదంలో వర్ణించిన ముఖం, మధ్యమం తోక భాగాలు ఈ విశ్వచిత్రంలో కనబడుతున్నాయి. పై విశ్వచిత్రంలో ప్రణవము, శిశుమారము, పాలపుంత మొత్తము శివలింగం ఆకారంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఖగోళంలో ఉన్న బ్లాక్‌హోల్స్ ఇప్పటికీ శాస్తవ్రేత్తలకు అంతుబట్టని విషయంగానే మిగిలి యున్నది. బ్లాక్ హోల్స్ సూర్యుని వంటి పెద్ద జ్యోతిర్గోళాలను కూడా తన లోనికి ఇముడ్చుకుంటాయని తెలుస్తుంది. వాటి నుంచి ప్రణవనాదం వస్తోందని నాసా అంతరిక్ష శాస్తజ్ఞ్రులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్తజ్ఞ్రులు తెలియజేస్తున్నారు. ఈ విషయం వింతగా కనిపించవచ్చునేమో కాని భారతీయులు ప్రతినిత్యం చేసే సంధ్యావదనంలో ‘‘ఓం ఇత్యై కాక్షరం బ్రహ్మ’’అగ్నిర్దేవతాబ్రహ్మ , ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం, సాయుజ్యమే వినియోగం (తై.ఉ.4-5-33) అని మంత్రంలో చెప్తారు. అంటే విశ్వమంతా ఓంకారమే అదే బ్రహ్మ. విశ్వచిత్రంలో అవశేషాలలో పశుపతిదేవుని ముద్రికపై ప్రణవం ఉంది.
పెద్ద అండాకారంగా ఉన్న విశ్వానికి సంస్కృత భాషలో బ్రహ్మాండమని పేరు. ఈ పేరే దాని స్వరూపాన్ని తెలియజేస్తుంది. శిశుమారానికి మధ్య, మానవుని వెన్నుపూసవలె పొడవు గీతవలె పాలపుంత ఉంది. వెన్నుపూసకు ‘మేరుదండం’ అని పేరు. దానిలో ఉండే సుషుమ్నా నాడి ప్రాణిలో చైతన్యానికి స్థానం. దీనిలో షట్చక్రాలలో దేవతలను ధ్యానించడం మంత్ర శాస్త్ర సంప్రదాయంలో ఉంది. విరాట్ పురుషుడు శిశుమారానికి పాలపుంతయే మేరు పర్వతం. దేవతా నిలయం కావచ్చు. విశ్వచిత్రంలో ఇది అధిక వెలుగుకు స్థానంగా ఉంటుంది. విశ్వచిత్రంలోని శివలింగం -శిశుమారం -ప్రణవలిపి హిందూ మతం యొక్క విశిష్ట లక్షణాలకు, శాశ్వతమైన భారతీయుల ఆరాధనా విషయాలలో విశ్వారాధన మిళితమై ఉంటుందనడానికి ఇంకే ఆధారం కావాలి? విశే్లషించి దర్శించగలిగితే హిందూ ఆరాధనా విధానమంతా విశ్వారాధన తద్వారా విశ్వమానవ సౌభ్రాతృత్వమే అని తెలుస్తుంది.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014