Others

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నది. కరోనా వైరస్ చైనాలోని ఉహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ అన్నిచోట్లకు పాకుతుండడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఈ వైరస్‌ను అడ్డుకోవడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నారు. మొదట ఈ వైరస్ ఎలా పుట్టింది అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.
క్రైట్, కోబ్రా ఈ రెండూ కూడా విషపూరితమైన సర్పాలు. ఇవి ఎక్కువగా చైనాలో కనిపిస్తుంటాయి. ఈ విష పూరితమైన పాములు కరవడం వలన లేదంటే, వాటిని తినడవ వలన వైరస్ సోకి ఉండొచ్చని అంటున్నారు. ఈ వైరస్ సోకిన 28 రోజుల్లోగా మనిషి మరణిస్తాడు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి యాంటీ యాక్షన్ మెడిసిన్ తయారుచేసే పనిలో నిమగ్నమైపోయింది చైనా. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజారవాణాను నిలిపివేసింది చైనా ప్రభుత్వం. చైనాలోని ఊహాన్ నగరంలో తొలిసారిగా గుర్తించిన కరోనా వైరస్, వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తోంది. ఊహాన్‌లో డిసెంబర్ చివరివారంలో తొలి కేసు నమోదుకాగా, ఇప్పటివరకు 9 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరో 440 మందికి వైరస్ సోకినట్టు చైనా ప్రకటించింది. కొత్తగా పుట్టుకొచ్చిన ‘కరోనా’ వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. ఇది శ్వాస వ్యవస్థపై పంజా విసిరి ప్రాణాలను హరిస్తోంది. ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రాణాంతక వైరస్ విజృంభించి, మన దేశంలోనూ వ్యాప్తిచెందే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో 9156 మంది ప్రయాణికులను పరీక్షించగా కరోనా వైరస్ కేసులు బయటపడలేదని వైద్యాధికారులు చెప్పారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులుంటే వైద్యపరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. మరోవైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనా ముఖ్యంగా ఊహాన్ నుంచి తమ దేశానికి వస్తున్న పర్యాటకులకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు వినానాశ్రయాల్లోనే హెల్త్‌చెకప్‌లు చేస్తున్నారు. భారత్ కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. చైనానుంచి వచ్చే ప్రయాణికులకోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ సదుపాయాన్ని ఏర్పాటుచేసింది.
ఆరోగ్య సంస్థ కూడా అప్రమత్తమైన ఈ వైరస్‌పై అత్యవసరంగా సమావేశమైంది. చైనాతోపాటు జపాన్, కొరియా, థాయ్‌లాండ్, అమెరికా దేశాల్లో కొత్తరకం ‘కరోనావైరస్’ సోకడంవల్ల 17 మంది మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) అత్యవసర కమిటీ సమావేశమై ఆ దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ నాలుగు దేశాలకు పాకిందని అందిన సమాచారంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించాలనే విషయంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ అత్యవసర కమిటీ సభ్యులు చర్చించారు. గతంలో సార్స్.. చైనాలో ఇలాంటి భయంకరమైన వైరస్‌లు పుట్టుకురావడం కొత్తేమీ కాదు. అక్కడి వాతావరణం పరిస్థితులే ఇందుకు కారణం. గతంలో 2002 నవంబరు నుంచి 2003 జులై మధ్య దక్షిణ చైనాలో కరోనా కుటుంబానికి చెందిన సార్స్ వైరస్ విజృంభించి ఇతర దేశాలకూ వ్యాపించింది. 37 దేశాల్లో దాదాపు 8000 మంది ఈ వైరస్ బారిన పడగా.. 774 మంది ప్రాణాలు కోల్పోయారు. 2004 తర్వాత నుంచి ఒక్క సార్స్ కేసు కూడా నమోదు కాలేదు.
కరోనా వైరస్ అంటే? కరోనా వైరస్‌ను 1937లో గుర్తించారు. ఈ వైరస్ ఎక్కువగా కోళ్లు, చుంచు ఎలుకలు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గబ్బిలాల ఊపిరితిత్తుల వ్యాధులకు కరోనా వైరస్ కారణమవుతోంది. కొన్ని రకాల కరోనా వైరస్‌లు మానవుల్లోకూడా సాధారణ జలుబు, ఫ్లూ ఫీవర్ వంటి స్వల్పకాలిక వ్యాధులకు కారణమవుతున్నాయని 1960లో గుర్తించారు. కాలక్రమేణా ఈ వైరస్‌ల్లో ఉత్పరివర్తనలు జరిగి మనిషికి ప్రాణాంతక వైరస్‌లుగా మారాయని వైద్యపరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఆరురకాల హ్యూమన్ కరోనా వైరస్‌లను గుర్తించారు. వీటినే 229 ఈ - ఆల్ఫాకరోనా వైరస్, ఓసీ 43, బీటాకరోనా వైరస్, హెచ్‌కేయూ 1 బీటా కరోనా వైరస్, సార్స్ కరోనావైరస్, మెర్స్‌కరోనా వైరస్, నోవెల్ కరోనా వైరస్‌లుగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం చైనాలోని ఊహన్ నగరంలో విజృంభిస్తున్న వైరస్‌ను నోవెల్ కరోనా వైరస్‌గా గుర్తించారు.
లాటిన్ భాషలో కరోనా అంటే క్రౌన్ అని అర్థం. క్రౌన్ లేదా, హేల్ ఆకారంలో వైరస్ ఉండటంవల్ల దీనికి ఆ పేరుపెట్టారు. ఈ వైరస్ మానవుల్లో ఊర్ధ్వశ్వాసకోశ వ్యాధులకు (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్), జీర్ణాశయ వ్యాధులకు కారణమవుతోంది. ఈ వైరస్ సోకిన వారిలో జలుబు (రన్నింగ్ నోస్), గొంతునొప్పి జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. శీతాకాలంలో, వేసవి కాలం ప్రారంభంలో ఎక్కువగా ఈ వైరస్ సోకుతోంది. కొందరిలో బ్యాక్టీరియల్ బ్రాంకైటీస్, న్యూమోనియాకు ఈ వైరస్ కారణమై ప్రాణాంతకమవుతోంది. 2003లో ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించిన ఈ వైరస్ బారిన 8098 మంది పడగా అందులో 774 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2012 సౌదీ అరేబియాలో, మరలా 2013లో సౌదీ అరేబియాలో 124 మందికి వైరస్ సోకి వారిలో 52మంది మృతి చెందినట్లు గుర్తించారు. 2014లో అమెరికాలో, 2015లో కొరియాలో వ్యాధిని గుర్తించారు. 2019 డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా 2,468 కేసులు నమోదుకాగా, వారిలో 851మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
వైరస్ ఎలా వ్యాప్తిచెందుతుందంటే? హ్యూమన్ కరోనా వైరస్‌లు వైరస్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాప్తి చెందుతాయి. వైరస్ వ్యాప్తి చెందడంలో ముక్కు, నోటి నుండి స్రవించే స్రావాలు కీలకపాత్ర పోషిస్తాయి. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మడం, దగ్గడం వల్ల వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తిచెందుతోంది. ఆ తుంపరలతో కలుషితమైన దుస్తులు, ఇతర వస్తువులు, కరచాలనం, తాకడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి ప్రవేశిస్తుంది. అరుదుగా మలమూత్రాల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.
దీని లక్షణాల ఇలా ఉన్నాయి... వైరస్ సోకిన రెండు లేదా మూడు రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలను బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ లక్షణాలుగా విభజించారు. మైల్డ్, మోడరేట్ లక్షణాల్లో ముక్కులనుంచి స్రావాలు కారడం (రన్నింగ్ నోస్), దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఫ్లూ జ్వరం, కామన్ కోల్డ్ లాంటి లక్షణాలు ఉంటాయి. వైరస్‌లు శ్వాసనాళాలు, శ్వాసకోశాలకు వ్యాపించినప్పుడు బ్రాంకైటీస్, న్యూమోనియా లక్షణాలు బయటపడతాయి. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో, అవయవాలు మార్పిడి చేయించుకున్న వారిలో, క్యాన్సర్, ఎయిడ్స్ బాధితుల్లో, ఎక్కువకాలం విచక్షణారహితంగా స్టెరాయిడ్స్ వాడిన వారిలో, ఊపిరితిత్తుల వ్యాధుల బాధితులు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మంచినీరు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. వ్యాధిపై అప్రమత్తతతో ఉండి ముఖానికి మాస్క్ ధరించాలి. వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు, కోళ్లఫారాలు, జంతుసంరక్షణ శాలలు, కబేళాల దగ్గరకు వెళ్లకూడదు. అనుమానితులకు, ఇతరులు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా కర్చ్ఫీ అడ్డుపెట్టుకోవాలి. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

- వాసిలి సురేష్, 9494615360