Others

పావనం రామచరితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం ఎన్ని యుగాలు గడిచినా సర్వజనులచే పూజనీయమై విరాజిల్లుతున్నది. శ్రీరాముడు సకల జన మనోభిరాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే శ్రీరామునిగా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం భువిపై అవతారం ధరించివచ్చాడు. ఎన్నో కష్టనష్టాలను భరించి ఆచంద్ర తారార్కం అందరి సృదయాలలో నిలిచి ఉండేలా దీవించాడు.
శ్రీరాముని దివ్య చరిత్రను విన్నా, చదివినా , గానం చేసినా జన్మ చరితార్థమవుతుంది. వ్రాస్తే రామాయణమే రాయాలి అన్నట్లు ఎందరో నాటి నుంచి నేటి వరకు రామాయణాన్ని అనేక రూపాల్లో వెలయిస్తూనే ఉన్నారు.
శ్రీరాముని నమ్మిన బంటు భక్త శిఖామణి హనుమంతుడు. విడిపోయిన సీతారాములను కలపటానికి కారకుడై శ్రీరాముని ప్రేమ పూర్వక ఆలింగనానికి నోచుకున్న భాగ్యశాలి మారుతి. నిరంతరం రామానామామృతంతో మునిగితేలుతూ శ్రీరాముడినే తన ఆరాధ్యదైవంగా భావించి తన్మయత్వంతో భజిస్తూ ఉండే హనుమ భక్తకోటిలో అగ్రగణ్యుడు. ఇప్పటికీ ఎక్కడ రామనామం గానం చేస్తూన్నా అక్కడికి హనుమంతుడు వెళ్లి నిల్చుని ఆనందిస్తూనే ఉంటాడట.
శ్రీరాముని కంటే ముందుగానే రామ అనే నామము ఉన్నట్లుగా వేదాలలో ప్రకటింపబడింది. రామ అనే శబ్దం వల్ల ఎంతటి పాపరాశి అయినా దగ్ధమైపోతుంది. కనుకనే రామ నామానికి అంతటి పవిత్రత, ప్రత్యేకత ఉన్నాయి. లంకకు వారధిని నిర్మించే సమయంలో వానర సైన్యం పెద్ద పెద్ద బండరాళ్లను శ్రీరామ్ అంటూ వేస్తుండడంతో అవి అన్నీ తేలి ఉండవట. శ్రీరాముడు కూడా తాను కష్టపడాలి అనుకొని ఓ రాయిని సముద్రంలోకి విసరాడట. కానీ అది కాస్త బుడుంగుమని మునిగిపోయిందట. ఇదేమి విచిత్రం అని వానరులను అడడగా అక్కడే ఉన్న హనుమంతుడు శ్రీరామ్ అని అనకుండా బండరాయి వేస్తే మునగక తేలుతుందా ఏమిటి అన్నాడట. పైగా శ్రీరామ్ అనిపిస్తూ రాముని చేతనే రాయిని సముద్రంలోకి వేయించాడట. ఆ రాయి చిత్రంలో నీళ్లపై నిలబడిందట. అపుడు రాముడే రామ శబ్దానికున్న విలువ ను చూసి ఆశ్చర్యపోయాడట. అట్లా వారధి నంతా రామమంత్రంతోనే నిర్మించారు కనుక ఇప్పటికీ ఆ సేతువు ఉందనే వారు ఉన్నారు.
ఎందరో మహానుభావులు రామ నామ సంకీర్తనతో వారి జీవితాలను పునీతం చేసుకొన్నారు. మరెందరి జీవితాలనో రామాంకితం చేసి ధన్యులయ్యారు. రామభక్తి సామ్రాజ్య మే మానవుల కబ్బెనో మనసా ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే అంటూ రాముని భక్తులు అయినవారి దర్శనం కూడా ఎంతో గొప్పది అని కీర్తించారు.
శరణాగత రక్షకుడైన శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో ఎందరో రాక్షసులను సంహరించి ఋషులను ఆదుకున్నారు. తన పాద ధూలితో అహల్యకు పునర్జన్మను ప్రసాదించారు. పండ్లు అర్పించిన శబరికి మోక్షాన్ని అనుగ్రహించాడు. తనకోసం ప్రాణాలు అర్పించిన జటాయువుకు అంత్య క్రియలొనర్చాడు. ఉన్నత గతులు కల్పించాడు. రావణ సంహారం చేశాడు. మంచికి మారుపేరైన విభీషణుడిని లంకాధిపతిని చేశాడు.
శ్రీరామ చరిత్ర ఎంత పునీతమైందో అంత పవిత్రమైంది శక్తిగలది. రామాయణ పారాయణ చేస్తే రాముని వంటి ధర్మమూర్తులు అవుతారు. వారింట సిరిసంపదలు, సుఖశాంతులకు కొదువ ఉండదు. శ్రీరామ అని రామకోటి రాస్తూన్న భక్తకోటి ఇంకా ఇంకా పుడుతూనే ఉన్నారు. అందుకే సర్వజనులు సంతోషంతో కాలం గడుపుతున్నారు.

- అబ్బరాజు జయలక్ష్మి