Others

ఎముకలు బలంగా ఉండాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎముకలు బలంగా ఉండాలంటే వాటికి విటమిన్ డి, క్యాల్షియం అందాలి. ఎముకల ఆరోగ్యం కోసం గ్లాసుడు పాలు రోజూ తీసుకుంటే తగిన క్యాల్షియం లభిస్తుంది. అలాగే తాజా పండ్ల రసాలను తీసుకోవటం ద్వారా విటమిన్ ‘డి’ లభిస్తుంది.
*కూరగాయలు, రోజువారీగా తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది. బీట్‌రూట్, క్యారెట్, బీన్స్, స్వీట్ పొటాటోస్, దోసకాయ వంటివి తీసుకుంటే ఎముకలకు కావల్సిన ‘ఎ’విటమిన్ లభిస్తుంది.
* విటమిన్-కె కావాలంటే కాలిఫ్లవర్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ ‘కె’ లభిస్తుంది. ఇవి ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి.
* నడక, ఎరోబిక్స్, బాస్కెట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి.
*పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, గింజలు తీసుకుంటే ఎముకలకు కావలసిన శక్తి లభిస్తుంది. ఉదాహరణకు ఒక బాదంపప్పులో 75 మి.గ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే నువ్వుల్లో 37 మి.గ్రాముల కాల్షియం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. *