Others

దూరం కావాల్సినవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈర్ష్య అసూయ అనేవి దుర్గుణాలు. వాటిని ఏమాత్రం దగ్గరకు రానివ్వకూడదు. ఈ ఒక్క విషయంలోనే కదా పొరపాటున అనుకొంటే అవి శరీరమంతా వ్యాపించే అంటువ్యాధి లాంటివి. ఒక్కసారి మనసులో ప్రవేశిస్తే చెడు ఫలితాన్ని ఇచ్చి కానీ దూరం కావు. దూరమవడం కూడా ప్రయత్నపూర్వకంగా మహాత్ముల బోధలతో, నిష్టతో, నియమంతో ఎవరికి వారు కష్టపడి దూరం చేసుకోవాలి కానీ వాటికవి ఎన్నడూ దూరం కావు పైగా తామర తంపలాగ నిత్యమూ అంతకంతకూ ఎక్కువ అవుతూనే ఉంటాయి.
కైక హృదయం అమృతతుల్యమైంది. దశరథునికి పుత్రోదయం లో కైకకూ భరతుడు పుట్టాడు. కానీ ఆమె కౌసల్యాతనయుడైన రాముడినే ఎక్కువగా ప్రేమించేది. ఎక్కువగా లాలించేది. ఆమెకు భరతుడు వేరుగాను, రాముడు వేరుగాను కనిపించలేదు. కానీ మంథర దగ్గర చేరి నీకు ఇంగిత జ్ఞానం కాస్త తక్కువ అయింది. నేను నీ దాసిని కనుక నీపై అత్యధిక ప్రేమ ఉన్నదాన్ని కనుక చెప్తున్నాను అంటూ రామునికి భరతునికి భేధాలను చూపించింది. అభూత కల్పనలతో కైకను పాతాళంలో ఉన్నట్లు చిత్రీకరించి చూపించింది.
పాపం అంతవిశాల హృదయ, అమృతోపమయ అయినా కైక ఒకే ఒక్కసారి మంధర మాటలకు తలొగ్గింది. ఇంకేముంది? ఈర్ష్యాసూయలు దగ్గరైయ్యాయి. వాటితోపాటు కోపం, క్రోధం, అహంకారం మరింత పెట్రేగిపోయాయి. వెంటనే తానే దశరథ మహారాజు అత్యంత ప్రియమైన దాన్నని విర్రవీగింది. తానొక్కతే యుద్ధరంగంలో సాయం చేయడంవల్ల దశరథుడు గెలిచాడని అపోహపడింది. గర్వాంధకారంతో మాట్లాడింది. ఏముంది? అందరూ ఆమె మాటను కాదనలేదు. మహారాజుతో సహా కైకమ్మ మాటలకు తలలు వంచారు. అందరిలో కలతలు రేపింది. వారంతా కన్నీరు పెట్టుకున్నారు. కానీ కైక మాత్రం చాలా సంతోషంగా ఉన్నానన్న భ్రమ చెందింది. మంధర తీయని అనుభూతిని పొందింది.
జరుగవలసని నష్ట జరిగింది. కొడుకులు వనాల పాలు అయ్యారు. అసలైన నాథుడు కాటికేగాడు. అపుడు కైకకు మత్తు దిగింది. ఈర్ష్యాసూయలు దూరం అయ్యాయి. అసలైన నిజం తెలిసింది. కానీ ఏమి లాభం ఎంత వగచింది. ఎంతో దుఃఖితురాలైంది. తాను తప్పు చేశానని పశ్చాత్తాపపడింది. కానీ నాథుడిని కోల్పోయిన వనితగానే మిగిలి పోయింది. కొడుకులు అసహ్యించుకున్న తల్లిగానే చరిత్రలో మిగిలిపోయింది. బావుకున్నది ఏమీ లేదు. కానీ దుర్గణాల వల్ల కళంకితురాలుగా మిగిలింది.
ఏ దుర్గణమైనా మొదట్లో చాలా ఆనందాన్ని ఇచ్చినట్లే కనిపిస్తుంది. కానీ ఏ దుర్గణమూ చెడు ఫలితం తప్ప మంచిఫలితం రాదు. మనకు ఎవరైనా కీడు చేసినా, వారిని మన్నించి పొమ్మనాలి కానీ ఆ చెడుగుణాలను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోను దగ్గరకు రానివ్వకూడదు. ఎదుటివారికి బుద్ధిచెప్పాలన్న ధ్యాసతో కూడా ఆ యాగుణాలకు ఆహ్వానం పలకకూడదు. ఎదుటివారి పనుల వల్ల మనకు కీడు జరిగిందని, మనకు నష్టం వాటిల్లిందని కూడా వాపోకూడదు. దాన్నుంచి తప్పించుకునే నైపుణ్యం తెచ్చుకోవాలి. అటువంటి వారి జోలికి పోకుండా తిరిగి తమదైన శైలిలో ముందుకే వెళ్లాలి. కానీ ఎక్కడా ఆగిపోకూడదు.అదే అసలైన జ్ఞానుల లక్షణం. ఒకనాటి దుర్గుణులు వారి తప్పునువారు తెలుసుకొంటారు. ఎవరి బుద్ధి వారు పదునుపెట్టుకుంటారు. ఎవరు చేసిన కర్మకు వారు ఫలితం అనుభవిస్తారు. కనుక ఎవరూ కూడా దుర్గణాలను దూరమే చేసుకోవాలి.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి