Others

పీనట్ బటర్ మంచిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీనట్ బటర్‌లో పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సంబంధించిన ప్రొటీన్స్, పిల్లల మెదడు పెరుగుదలకు సంబంధించిన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో లభించే మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని రోగనిరోధకశక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. కానీ పీనట్ బటర్‌ని పిల్లలకు ఇవ్వడం శ్రేయస్కరమేనా? చిన్నారి వయసు ఒక సంవత్సరం లోపు ఉంటే పీనట్ బటర్‌ను వారికి ఆహారంగా ఇవ్వకూడదు. సాధారణంగా కొంతమంది పిల్లలు పీనట్ బటర్ అలెర్జీకి గురవుతారు. చిన్నారి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నప్పుడు పీనట్ బటర్‌ను పరిచయం చేయవచ్చు. ఎందుకంటే అప్పటికే వారి జీర్ణక్రియ వ్యవస్థ పీనట్ బటర్‌ని అరిగించుకునేంతగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఒక సంవత్సరం లోపు చిన్నారుల్లో పీనట్ బటర్ వల్ల కొన్ని తీవ్రమైన ప్రతికూల ఫలితాలు చూపించే అవకాశం ఉంది. వికారం, శ్వాస సమస్యలు, ఊపిరి ఆడకపోవడం, మంట లేదా వాపు వంటి లక్షణాలు అటువంటి ప్రతికూల లక్షణాలలో ముఖ్యంగా గమనించవలసినవి. చిన్నారికి పీనట్ బటర్‌ను తినిపించే ముందు వైద్యుడిని సంప్రదించాలి. పీనట్ బటర్‌ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం.
* పీనట్ బటర్‌లో రిస్వెరాట్రోల్ అనే ఒక రకమైన బయోకెమికల్ ఉంటుంది. ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని శక్తివంతం చేయడానికి తోడ్పడుతుంది.
* పీనట్ బటర్ వల్ల చిన్నారుల్లో ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను అరికట్టవచ్చు. పీనట్ బటర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
* పీనట్ బటర్‌లో జింక్, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫొలేట్, నియాసిస్, థియామిన్, విటమిన్ బి6, రిబోఫ్లావిన్‌లు లభిస్తాయి. ఇవన్నీ పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి.
* పీనట్ బటర్‌లో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల్లోని మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి.
* పీనట్ బటర్‌లో లభించే ప్రొటీన్ పిల్లల్లోని పెరుగుదల, అభివృద్ధికి, శరీరంలోని కండర శక్తిని అలాగే శరీర పరిమాణాన్ని ఆరోగ్యంగా మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రొటీన్ అనేది పిల్లల ఎదుగుదలలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తుంది. *