Others

భోజనపు అలవాట్లే ప్రధాన కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న ఒక వార్త వెలువడింది.
అందులో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞానంనుండి కొన్ని పంక్తులు వినిపించారు. ‘ఈశాన్య దేశాన కోరంగి వ్యాధితో కోటి మంది కోళ్లలాగా కొట్టుకొని చస్తారు.. హరి గోవిందా..’ అని అందులో ఉంది. ఇక్కడ ఈశాన్యం అంటే భారతదేశానికి చైనా ఈశాన్య దేశమే కదా? కోరంగి జబ్బు అంటే కరోనా వైరస్ అని వ్యాఖ్యాతలు వివరణ ఇచ్చారు. బ్రహ్మంగారు ఇలా చెప్పారా? లేదా? అనేది వారి వారి విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.
ఇంతకూ ఈ కరోనా వైరస్ అంటే ఏమిటి?
ఊహాన్ అనబడే చైనా రాష్ట్రంలో ఈ అంటువ్యాధి పుట్టింది. దీని బారిన పడి వందలాదిమంది ఇప్పటికే చనిపోయారు. అధికారికంగా వేల సంఖ్యలో వ్యాధిగ్రస్థులు ఉన్నారు. ఈ సంఖ్య లక్షల మీద ఉన్నదని, దానిని చైనా దాచిపెడుతున్నదని అనధికారిక వర్తమానం.
కరోనా వైరస్ పాముల నుండి వచ్చిందని మొదట భ్రమించారు. ఎందుకంటే ఈ డ్రాగన్ సంతతి వారికి సజీవమైన సర్పాలను మక్కువతో భుజిస్తారు. ఐతే తర్వాతి పరిశోధనలలో ఈ వ్యాధి గబ్బిలం నుండి వచ్చిందని నిర్ధారించారు. చైనీయులకు గబ్బిలం చాలా స్వాదుష్టమైన భోజన పదార్థం. కుక్కలు, పందికొక్కులు, మిడతలు, ఉడతలు ఇలా అన్నిరకాల జీవ జంతువులను చైనీయులు భుజిస్తారు.
ఈ వైరస్ ప్రభావం ప్రత్యక్షంగా చైనా ఆర్థిక వ్యవస్థపై పడింది. సూరత్ నుండి బెల్జియం దేశంనుండి హాంగ్‌కాంగ్‌కు వజ్రాలు ఎగుమతి చేస్తారు. సానబెట్టబడిన ఈ వజ్రాలను హాంగ్‌కాంగ్‌నుండి ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేస్తారు. ఇప్పుడీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం ద్వారా ఒక్క సూరత్ (గుజరాత్)లోనే 8000 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రాథమిక అంచనా.
ఇక రెండవది పర్యాటక రంగం. ప్రపంచ దేశాలన్నీ చైనీయులను నిషేధించటంతో వారి పర్యటన ఆగిపోయింది. ఇలా సింగపూర్ వంటి దేశాలు భారీగా నష్టపోయాయి. చైనా నుండి ఎవరినీ రానివ్వకపోవటం చైనాకు ఎవరూ వెళ్లకపోవటంవల్ల చైనా వృద్ధిరేటు గత రెండు నెలల్లో (2020 జనవరి - ఫిబ్రవరి) భారీగా పడిపోయింది. ఇది చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. అమెరికా వంటి దేశాలు ఈ సమస్యను సంయుక్తంగా ఎదుర్కొందాము అని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ మీద దృష్టి పెట్టింది. ఐనా సత్వర ఫలితాలు ఉండవని మరికొన్ని నెలలు ఈ విధ్వంసం తప్పదని వారు తేల్చారు.
ఇంతకుముందు స్వైన్‌ఫ్లూ వైరస్ వచ్చినప్పుడు చైనాలో పెద్దసంఖ్యలో పందులను సజీవంగా ఖననం చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ సోకిన చైనీయుల శవాలకు కూడా దహన సంస్కారాలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రావటం లేదు.
ఈ వైరస్ వల్ల పాకిస్తాన్ ఎంతటి బలహీన దేశమో మరోమారు యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. భారత్‌తో సహా అన్ని దేశాలవారు తమ తమ పౌరులను స్వదేశాలకు ప్రత్యేక విమానాలల్లో తరలిస్తుంటే పాకిస్తాన్ మాత్రం తమ పౌరులను తమ స్వదేశానికి తీసుకొని వెళ్లలేదు. ‘మాకీ వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం లేదు. బతికినా చచ్చినా వారు చైనా వైద్య పర్యవేక్షణలోనే ఉంటారు’ అని ప్రకటించి చేతులు దులుపుకుంది.
ఔను: పాకిస్తాన్ చైనాలు మిత్ర దేశాలు చైనాకు పాకిస్తాన్ వలస దేశం..
భగవద్గీత చాలా గొప్ప గ్రంథం.
దానిని కోట్లాది స్వదేశీయులు, విదేశీయులు నిత్యం పారాయణ చేస్తుంటారు. అందులో ఏది తినవచ్చునో ఏది తినకూడదో అందరికీ అర్థమయ్యే భాషలో శ్రీకృష్ణుడు ఒక అధ్యాయంలో చెప్పాడు. సాత్విహారం శ్రేష్టం. బతికి ఉన్న బల్లులను, తొండలను, బొద్దింకలను, మిడతలను తినటం ఏమిటి??
గబ్బిలాలను తినటం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి చైనాను పట్టి పీడిస్తున్నది. మానవతా దృక్పథంతో మనం సానుభూతి ప్రకటించినా చైనీయుల దుష్టస్వభావానికి కమ్యూనిజానికి కరోనా వైరస్‌కు వారి భోజనపు అలవాట్లు ఒక ప్రధాన కారణం అని గుర్తించక తప్పదు. చేసుకున్న వారికి చేసుకున్నంత అనే సామెత ఇందుకే పుట్టింది. భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చైనా కంకణం కట్టుకున్నది. ఇప్పుడు గబ్బిలం రూపంలో భగవంతుడు జిన్‌పింగ్ అనే ఈ డ్రాగన్ దేశానికి సవాలు విసిరాడు.
1948లో డాక్టర్ కోట్నీస్ బొంబాయ నుండి చైనా వెళ్లి సేవలు అందించాడు. (శాంతారాం డాక్టర్ కోట్నీస్‌కీ అమర్ కహానీ అనే సినిమా కూడా హిందీలో తీశాడు.) ఇవ్వాళ అలాంటి పరిస్థితి లేదు. ఎవ్వరూ చైనా వెళ్లి అక్కడి ఆపన్నులకు సేవలు చేయలేరు. చేతనైనంత వరకు ఈ మహమ్మారి ఇండియాలోకి ప్రవేశించకుండా చూసుకుంటే చాలు. అంటే చైనీయులను వారి ఫుడ్ సెంటర్లను ఇండియాలో కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ పౌరులు మూడువందలు మందిని ఊహాన్ నుండి తరలించినట్లు చెప్పారు. ఊహాన్ నగరం రోడ్లు నిర్మానుష్యమైనాయి. నగరమంతా పెద్ద వైద్య శిబిరంగా మారింది. దాదాపు 26 దేశాలకు ఈ వైరస్ వ్యాపించినట్లు ఆధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా తైవాన్, హాంగ్‌కాంగ్ వంటి దేశాలల్లో ఈ వ్యాధి బాధితుల సంఖ్య అధికంగా ఉంది. చైనాలో వ్యాధిసోకి చికిత్స పొందుతున్న వారి సంఖ్య వేలల్లోనూ అనుమానితుల సంఖ్య లక్షలలోనూ ఉంది. భారత్, రష్యా వంటి సరిహద్దు దేశాలు తమ బార్డర్స్ మూసివేశాయి. ఇది రాజకీయంగా కూడా ఆయా దేశాల అంశాలపై కూడా ప్రభావితం చూపవచ్చు.
లోగడ కేరళలో నీఫా వైరస్ వచ్చినప్పుడు అనుసరించిన చికిత్సా విధానానే్న ఇప్పుడు కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఎందుకంటే కరోనాకు స్పష్టమైన చికిత్స ఏదీ ఇంతవరకు నిర్ధారణ కాకపోవటం విచిత్రం. కరోనా వలన తెలంగాణా రాష్ట్ర ఉత్పత్తులపై, ఎగుమతులపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఐటి-ఇండస్ట్రీస్ జనరల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ ప్రకటన ప్రకారం నిత్యజీవితావసర వస్తువులు తెలంగాణ నుండి చైనాకు చాలా సంస్థలు ఎగుమతి చేస్తున్నాయి. ఇప్పుడీ పరిశ్రమలపై నిషేధం విధించటంతో రాష్ట్ర ఉత్పత్తిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ‘‘చైనాలో పరిశ్రమలు మూతపడితే తెలంగాణ ఉత్పత్తులు భవిష్యత్తులో ఆగిపోక తప్పదు’’ అని జయేష్ రంజన్ 5-2-2020 నాడు ప్రకటించారు.
జపాన్ నావికులకు కూడా ఈ వ్యాధి సోకింది. వేలాది చైనీయులు బాలీ ద్వీపంలో చిక్కుబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ఊహాన్ నగరం మొత్తం వేలాది పడకల హాస్పటల్‌గా మారినా సరిపోవటం లేదు. నిజానికి స్వైన్‌ఫ్లూ, కరోనా వంటి మహమ్మారులకు ప్రాచీన భారతీయ పద్ధతులు ఉన్నాయి. కాని వాటిని పాటించే వారెవరు? పైగా మార్క్సిస్టులు ఈ భారతీయ విధానాన్ని అపహాస్యం చేస్తున్నారు.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్