Others

అదుపుతోనే అద్భుతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనస్సును, బుద్ధిని నియంత్రించి కామాన్ని జయించాలి. కామశత్రు విజయమే కైవల్యం. ఆత్మానందం పొందటమే గమ్యం. కైలాసం పోనవసరం లేకుండా ఆ ఆనంద చిన్మయ స్థితిని అనుభవించవచ్చు ఇక్కడే.
కానీ ఇది చాలా కఠినం. పురాణాల్లో చాలామంది మనస్సును నియంత్రించి వారు అనుకున్నదానిని సాధించి నేటికీ అపూర్వ వ్యక్తులుగా కీర్తిగడిస్తున్నారు. మనస్సును నియంత్రించడానికి వయస్సుతో పనిలేదు. సామాన్యంగా కౌమారంలో ఆటలు, తిండి తప్ప మరేమీ లేదనేవారు ఉన్నారు. కానీ ఆ వయస్సులో కూడా మనస్సును నియంత్రించి భగవంతునిపై అచంచల విశ్వాసాన్ని నిలిపి ఆ రూపం లేని పరమాత్మ స్వరూపానే్న తమ కళ్లెదుట సాక్షాత్కారం చేసుకొన్న మహనీయులున్నారు. ధ్రువుడు, మార్కండేయుడు ఇలాంటివారిని మనం చిన్నవయస్సులో భగవంతుడిని సాక్షాత్కరింపచేసుకొన్న వారిగా గుర్తించవచ్చు.
యవ్వనంలోను కోరికల గుఱ్ఱానికి పగ్గాలు వేయడం అసాధ్యం అంటుంటారు. కానీ ఆ వయస్సులోనూ మనస్సును నియంత్రించవచ్చు నని భీష్ముని జీవితం చూస్తే అనిపిస్తుంది. భీష్ముని పూర్వజన్మ ప్రకారం ఆయన వర్తమాన జీవితం నడిచినప్పటికీ చూసేవారికి భీష్ముడు ఎంత మహాత్ముడో తన మనస్సును ఎట్లా నియంత్రించుకున్నాడో అనే విషయంలో అబ్బురం అనిపిస్తుంది.
కాశీరాజు ముగ్గురు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలు - వీరు మువ్వురూ అందగత్తెలు. వీరిని స్వయంవరం నుండి భీష్ముడు తన తమ్ముడు విచిత్రవీర్యుని కోసం సాల్వరాజును ఓడించాడు. భీష్ముని వెంట రావడానికి అంబ నిరాకరించింది. తాను సాల్వరాజును ప్రేమించానంది. భీష్ముడు దయాభావంతో సాల్వుని వివాహమాడి జీవించమంటే, సాల్వుడు నన్ను ఓడించి భీష్ముడు నిన్ను గెల్చాడు, అతనితో ఉండటం సబబన్నాడు.
అంబిక, అంబాలికలను విచిత్రవీర్యునికిచ్చి వివాహమొనర్చాడు. అంబ ఎవరికీ చెందక, ఎవరినీ వివాహమాడక అబలగా మిగిలింది. అక్కడనుంచి వెళ్లిపోయింది. పరమేశుని ప్రార్థించి శిఖండిగా జన్మించింది. భీష్ముని ప్రాణం పోవడానికి కారణమయ్యింది.
మానవ జీవితం అపురూపం, ఆనంద నిలయం. జీవకోటి యంతటిలో మానవ జన్మ సుకృతమైనది. ఈ విషయాన్ని గ్రహించక ప్రతి ఒక్కరూ తమ యిచ్చ వచ్చినట్లుగా, తమ మది మలచినట్లు జీవనయానం సాగిస్తూ సుఖం వస్తే పొంగటం దుఃఖం వస్తే క్రుంగటం చేస్తుంటారు. కూపస్తమండూకాల్లాగా, తామే గొప్పవారిమని తామే జగతికి ఉషాకిరణమనుకొంటుంటారు. కానీ ఎంతో మంది మహానుభావులు లోక క్షేమం కోసం ఇతరుల కోసం తమ జీవితాలనే తృణ ప్రాయాలుగా చేసి వారు మాత్రం నిమిత్త మాత్రులుగా ఉండిపోయారు.
దధీచి మహర్షి మహాఅరణ్యంలో తపస్సమాధిలో జీవితాన్ని గడుపుతుండేవాడు. కానీ దేవతలంతా వృత్తాసురుని సంహారం చేయడం కోసం మీ వెనె్నముక కావాలి అని అడిగితే ఆ మహర్షి ఎంతో ఆనందంగా తాను యోగాగ్నిలో కరిగిపోతూ తన వెనె్నముకను మాత్రం ఇంద్రుడికి ఇచ్చివేస్తాడు. ఎంతటి త్యాగశీలి ఆ మహర్షి. వీరే కాదు ఇంకా ఎంతో మంది మహానుభావులు తమ సుఖం కోసం కాక ఇతరుల సుఖసంతోషాల కోసం పాటుపడిన వారున్నారు.
కచుడు బృహస్పతి కుమారుడైనా దేవతలందరికోసం శుక్రాచార్యుని దగ్గరకు వెళ్లాడు. అక్కడ తాను వచ్చిన పని మాత్రమే చేస్తుండేవాడు. కానీ అక్కడ శుక్రాచార్యుని కూతురు కచుడిని మనసారా ప్రేమించానని ఎన్నో ఇక్కట్లు కల్పిస్తుంది. తన ప్రేమను ఆహ్వానించమని అడుగుతుంది. కానీ కచుడు మాత్రం తన పని పైన మాత్రమే దృష్టిని నిలుపుతాడు.
అంతటి కర్తవ్యదీక్షాపరుడిని చూసిన రాక్షసులు తమకు వచ్చిన విద్య తమ దగ్గరే ఉండాలని కుటిల ప్రయత్నాలు చేస్తారు. కచుడిని ఎన్నో మార్లు చంపేస్తారు కూడా. కానీ శుక్రాచార్యుని కూతరు దేవయాని తన ప్రేమ సఫలం చేసుకోవడానికని కచుడిని బతికింపచేస్తుంది.
చివరకు రాక్షసులు కచుడిని చంపి వాని శరీరాన్ని బూడిద చేసి శుక్రాచార్యుడు సేవించే సురలో కలిపి ఆచార్యుడితో సేవింప చేశారు కూడా. కానీ దేవయాని తన సుఖం కోసం శుక్రాచార్యుని నమస్కరించి కచుడిని బతికించమని కోరుకుని మరీ బతికిస్తుంది.
ఇదిగో ఈ ఘటన వల్ల కచుడు కోరుకున్న మృత సంజీవని విద్య అతనికి లభ్యమైంది.
తన పని పూర్తి అయిందని తాను తిరిగి పూర్వాశ్రమంలోకి వెళ్దామనుకొంటుంటే దేవయాని తన మనసులోని మాటను వెల్లడిస్తుంది. కానీ ఆమాటను అంగీకరించని కచుడిని అన్ని సార్లు కాపాడిన దేవయానినే ఎందుకోసం కచుడు అక్కడికి వచ్చాడో ఆ ఫలాన్ని పొందనీయకుండా చేస్తుంది రాక్షసులు కచుడి శరీరాన్ని కాల్చివేస్తే దేవయాని ఆయన మనస్సును కూడా కొలిమిలో పడేస్తుంది. కానీ కచుడు తన సుఖ కోసం కాక అందరి మంచి కొరకు విద్యను సముపార్జించడానికి వచ్చాడు కనుక తన బుద్ధి బలంతో కచుడిని దేవయాని శాపాన్నుంచి తన్ను తాను కాపాడుకొని తిరిగి తన స్వస్థానానికి వచ్చాడు. ఇదంతా చేశాడు అంటే కచుడు కూడా తన మనస్సును ఎంతగానో తన ఆధీనంలో ఉంచుకున్నట్లే తెలుసుకోవచ్చు.
కనుక దేనిని సాధించాలన్నా ముందు శరీరం పైనే కాదు మనస్సు పైన కూడా నియంత్రణ సాధించాలి. అపుడే అద్భుత ఫలితాలను పొందవచ్చు. దీనికి మంచి మార్గం ధ్యానం. ధ్యానం ద్వారా మనిషి తాను అనుకున్న మార్గంలో త్వరగా పయనించి అనుకున్న ఫలితాలను పొందుతారు.

- లక్ష్మి