Others

చెప్పేది ఒకటి.. చేసేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ చెప్పింది ఆచరించేవారు కొద్ది మందే ఉంటారు. చెప్పేవారు కూడా వారు చెప్పినదాన్ని ఆచరించరు. అందుకే వాళ్లు చెప్పింది విన్నవాళ్లకు హృదయపులోతుల్లోకి వెళ్లి వారిలో పరివర్తన తీసుకొని రాదు. ఎపుడు శ్రోతల్లో మార్పును ఆశిస్తారో అపుడు ఆ ప్రవక్త ముందు తాను చెప్పేది ఆచరించి ఆతరువాత ఇతరులకు చెప్పాలి.
ఓసారి రామకృష్ణ పరమహంస దగ్గరకు ఓ తల్లి తన కొడుకు తీసుకొని వచ్చి స్వామీ నా కొడుకు అతిగా పంచదార తినేస్తుంటాడు. చెప్తే వినడం లేదు మీరైనా చెప్పండి అందట. అపుడు రామకృష్ణుడు వారం తరువాత రండి అని ఆ తల్లి కొడుకులను పంపించేశాడు. ఆ వారంలో కొడుకు ఎందుకు తనతో మాట్లాడలేదో స్వామి అని ఆలోచించాడు. తల్లి తనను కరుణించలేదేమి అని ఆలోచించింది.
వారం తర్వాతవీరు మళ్లీ రామకృష్ణపరమహంస దగ్గరకు వెళ్లారు. అపుడు ఆయన ముందు నీవు టీలో పంచదార వేసుకోకుండా తాగుతుండు. నెమ్మదిగా నీవు చక్కెర తినే అలవాటును మానేస్తావు అన్నారట.
అది విన్న ఆ పిల్లవాడు ఇది చెప్పడానికి వారం తర్వాత అని ఎందుకన్నారు అని అడిగాడట. అపుడు ఆ పరమహంస నేను ఈ వారంరోజులు పంచదారలేకుండా టీ తాగాను. అవి నాకు అలవాటు అయ్యాయ కనుక, తాగగలిగాను కనుక మీకు చెప్పాను అన్నారట. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయ తన రామకృష్ణుడు చెప్పినట్లు చేస్తూ చివరకు ఆయన ముఖ్య శిష్యుల్లో ఒకడుగా మారాడట. ఇదే నన్నమాట ఆచరించి చెప్పిందేదైనా వినేవారిలో మంచి మార్పును తీసుకొని రాగలుతుంది.
అట్లానే ఓసారి రాజు దగ్గరకు ఓ పండితుడు వచ్చి అయ్యానేను గీతాప్రవచనం ఇస్తాను. దానిని వినండి. తృణమో ఫలమో నాకివ్వండి అన్నాడట. సరే నని ఆ రాజు దానికి ఒప్పుకున్నాడు. పండితుడు చెబుతూ మధ్యలో ఇలా చెప్పాడట.
అనన్యాశ్చిన్త యన్తోమాం యేజనా పర్యుపానతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్
పండితుడు పై శ్లోకంలో ఒకో పదానికి అర్థం చెపుతూ వచ్చాడు. ‘‘ఎవరు నన్ను ఎట్టి చింతలూ లేక మనస్ఫూర్తిగా నన్ను ఉపాసిస్తారో వారి యోగక్షేమాలు నేనే చూసుకొంటాను. వారు దేనికీ ఎవరినీ యాచించనక్కరలేదు’’. ఈ వివరణ విన్న రాజు వెంటనే ఆసనం నుంచి లేచి యిలా అన్నాడు.
‘‘పండితవర్యా! మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే అది మీరు సరిగా అర్థం చసేకోలేదని నాకనిపిస్తోంది. ఇంటికి వెళ్లి స్థిమితంగా కూర్చుని యోచించండి. ఇక రుూ వేళకిది ముగిద్దాం’’ అన్నాడు రాజుగారు. అంతా విస్తుపోయారు. పండితుడయితే అవమానభారంతో ఎంతో బాధపడ్డాడు. ఇంటికి వెళ్ళి తన గదిలో కూర్చున్నాడు దిగాలుగా, ఉలుకు పలుకులేకుండా.
‘‘రాజుగారేమన్నారు?’’ అనడిగింది భార్య. అతనేం మాట్లాడలేదు. మరింత దిగులుగా ఉండిపోయాడు.
‘‘ఏమయిందండీ! ఎందుకలా ఉన్నారు. రాజుగారేమన్నా అన్నారా!’’ అనడిగింది బాధగా.
‘‘ఆఁ అన్నారు. ఆ శ్లోకం నేను సరిగా అర్థం చేసుకోలేదని పదిమందిలో నన్నవమానించారు’’ అని జరిగిన విషయం చెప్పాడు. అది విని ఒక్క క్షణం ఆలోచించి అన్నదామె.
‘‘ఆలోచిస్తే వారన్నది నిజమేననిపిస్తోందండి. ‘‘మీరు కోపగించుకోండి. స్థిమితగా ఆలోచించండి. అంటూ ఆ శ్లోకం అర్థం ఏమిటి? ఎవరయితే నిండు మనస్సుతో నన్ను ఉపాసిస్తారో వారి మంచి చెడులు నేను చూసుకుంటాననే కదా! కాని మనం చేసిందేమిటి? మన యోగ క్షేమాలని ఆ భగవంతుని మాని రాజుగార్ని ఆశ్రయించాం. అంటే చెప్పిందొకటి ఆచరించేది మరొకటి అయింది కదా. అదే కదా రాజుగారి ఉద్దేశ్యం. ఆలోచించండి’’ అన్నది మెల్లగా.
అతనుఆమె మాటలు విన్నాడు. స్థిమితంగా కూర్చుని యోచించి అన్నాడు. ‘‘నిజమే! ఇప్పుడు నాకంతా అర్థమయింది. నువ్వుచెప్పేదంతా నిజమే ’’ అని భార్యని మెచ్చుకున్నాడు. మర్నాడు అతను అంతః పురానికి మందిరానికి వెళ్లలేదు. రాజభటులు వచ్చారు. కొంతవేళకి ఏవేవో కానుకలూ తెచ్చారు.
‘‘వద్దు, నాకివేం వద్దు, నేనిక మందిరానికి రాలేను. నా మాటగా రాజుగారికి చెప్పండి. నేను నమ్మిన దేవుడే నా యోగక్షేమాలు చూసుకుంటాడు’’ అని నేనన్నానని రాజుగారికి చెప్పండి, మరేం భయంలేదు అన్నాడు. భటులు వెళ్లిపోయారు. ఆ మర్నాడు రాజుగారే స్వయంగా వచ్చారు, పండితుని ఇంటికి.
‘‘పండితవర్యా! నన్ను మన్నించండి. మీరనుకున్నట్లు నేను మిమ్మల్ని అవమానించలేదు’’ అన్నారు. ‘స్వామీ! నాకెంతో ఆనందంగా ఉంది. మీరు గీత సారాంశాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఆ శ్లోకం ఆచరణాత్మకంగా నిరూపించారు. కాని మీరు మందిరానికి రావడం మానకండి. మీ ప్రవచనం వినాలని ఎక్కడెక్కడనుంచో ఎంతోమంది వస్తున్నారు. వారిని నిరుత్సాహపరిచి బాధపెట్టకండి అని వేడుకుంటున్నాను’’ అన్నాడు రాజు.
పండితుడూ చాలా సంతోషించాడు. తనకు గుణపాఠం నేర్పినందుకు కృతజ్ఞతగా రాజుగారికి నమస్కరించి సరేనన్నాడు. రాజుగారు ఏవో కానుకలు సమర్పిస్తూ కాదనకండి. స్వీకరించండి’’ అన్నారు. అలా చెప్పేదేదైనా ఆచరించి చూపితే అది చాలా ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి