Others

ఆత్మవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదెరువు
కరువెక్కడిది
ఊరున్నా చెరువుంటే
భరోసా ఆకాశన్నంటుతుంది
కానీ కాలంపై కనె్నఱ్ఱజేసి
బీడుకు ఊతమై
ఇంటి గరిసెల్ని పంట గింజలతో నింపి
తృప్తితో నవ్వే అమ్మ చెరువు
నిండుకుండలా ఊరంతటికీ పెద్దమ్మాలా
చెరువుంటే అంతకన్నా పండగేముంది?
చల్లదనపు దీవెనల్ని
చెరువునుండి చేదుకుంటే
అంతకన్నా ఆత్మ విశ్వాసం ఎక్కడుంది?
చెరువంటే ఊరవతలి స్థలం కాదు
మన జీవన చరిత్రల సమస్తం
బతుకును కాలం గారడీలో
జేజార్చుకున్న ఒట్టికట్టెలాంటి ఊరుకు
తన దేహపు తడితో పరిమళమద్ది
జీవన సౌందర్యాల్ని జతచేసిన సాహసి చెరువు
అందరికై అలుగెత్తిన అమృత వర్షిణి
ఆయకట్టుకు సోయగాలద్దిన చెలిమి
ఆందోనను తరిమేసే బలిమి
బ్రతికేందుకు చింతనెందుకు?
ఎడతెగని వేదనెందుకు?
కాపాడుకోవాల్సింది చెరువుల్ని
నిలుపుకోవాల్సింది మనుగడల్ని
తరతరాల బంధం చెరువు
బ్రతికేందుకు అదొక్కటే ఆదెరువు

- తిరునగరి శ్రీనివాస్ 8466053933