Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఆకలియు లేకఁ దినెడి యాహారమేల?
శ్రద్ధ ఁ జూపక ఁ జదివెడి చదువులేల?
బుద్ధినిలుపగలేనట్టి పూజలేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఆకలి లేకుండా భుజించే ఆహారం, ఏ మాత్రం శ్రద్ధ చూపకుండా చదివే చదువు, దేవునిమీద చిత్తం నిలుపలేకుండా చేసే పూజ నిరుపయోగాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు ప్రభాకరా!

తే.గీ. దిక్కు మాలిన వైరనులెక్కువాయె
భయము నంబ్రజ గజగజ వణుకుచుండె
నీ విపత్తల కడ్డంబు నీవే గాద
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: నేటికాలంలో దిక్కుమాలిన వైరసులెన్నో వచ్చి పడిపోతుండడంతో ప్రజలంతా భయంతో గజగజ వణికిపోతున్నారు. ఇటువంటి విపత్తులకు అడ్డుపడి ఆదుకునే ఆరోగ్య ప్రదాతవు నీవే కదా. కర్మసాక్షియైన ఓ సూర్యదేవా! దయజూపవయ్య తండ్రీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262