Others

ఈశ్వరార్పిత కర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సర్వధర్మాలనూ వదిలివేసి ననే్న శరణు పొందు’- అని గీత చెబుతోంది. వదలటం అంటే ఈశ్వరార్పితం చేయమని చెబు తున్నారన్నమాట. కర్మను ఈశ్వరునికి అర్పితం చేస్తే చేస్తున్న కర్మ ధర్మబద్ధమా కాదా అన్న ప్రశ్న ఉదయించదు. భగవత్పరమైన కర్మ ఎప్పుడూ ఆమోదయోగ్యమే అవుతుంది. ‘్ధర్మాలను విడిచిపెట్టు’ అనటంలో ‘విచ్చలవిడిగా ప్రవర్తించు’ అని అర్థంకాదు. నిష్క్రియత్వంతో అనీ కూడా కాదు. ఫలితం పైన ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని పాలించు అని అర్థం.
కైకేయి తన భర్తను రెండు వరాలు కోరింది. రాముని పదునాలుగేళ్లు వనవాసానికి పంపటం; భరతుని పట్ట్భాషేకం. అప్పుడు లక్ష్మణుడు అంగీకరించలేదు. ఇటువంటి అన్యాయానికి తలవొగ్గరాదన్నాడు. బాణపు దెబ్బతో కైక సంగతి తేలుస్తానన్నాడు. రాముడు తమ్ముని వారించాడు. బాణం గొప్పకాదు. ప్రేమబాణం ముందది నిలువలేదు. ‘్ధర్మం కర్మను నడిపించాలి! అని ప్రబోధించాడు, రాముడు. ధర్మానికి తలొగ్గటమే భగవంతుని పట్ల ప్రపత్తి.
కర్మలను ఎపుడు స్వార్థంతో చేస్తే లేక తనొక్కరి కోసమే చేసినా అది అంత మంచి ఫలితాన్నివ్వదు. కానీ నలుగురికోసమో లేక నలుగురికి మంచిదారిని చూపించాలనో కర్మచేస్తే ఫలితం శుభఫలితమే అందు కోవచ్చు. అది కూడా భగవంతునికి అర్పితం చేసిన పని ఎపుడూ జయానే్న కలిగిస్తుంది. అర్జునుడు కృష్ణునికి ప్రసన్నుడు. శరణాగతి పొందినవాడే! ఆయన ‘యుద్ధం చేయి!’ అంటే అర్జునుడు తప్పక ఆయన ఆదేశాన్ని పాటించేవాడు. మరి గీతను ఎందుకు బోధించాల్సి వచ్చింది? తన ఆజ్ఞవల్ల కాక, అర్జునుడు మనస్ఫూర్తిగా తన ధర్మాన్ని నిర్వర్తించాలన్నది కృష్ణుని అభిప్రాయం. అందుకే అర్జునుని సంశయాలన్నిటికీ ఆయన సమాధానాలిచ్చాడు. విషాదాన్ని పోగొట్టి, కర్తవ్యాన్ని బోధించాడు. భగవంతుడు మనిషిని కూడా వివేక విచక్షణాలిచ్చి పుట్టించాడు. కనుక ఏ పని చేసినా వివేకంతో చేయాలి. భగవంతుని కిష్టమైన పనే చేయాలి. అపుడు తప్పక జయం కలుగుతుంది.

- శ్రీ