Others

గ్రామ ముఖచిత్రాన్ని మార్చేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె వయసు 70 సంవత్సరాల పైమాటే.. అయినా ప్రజాసేవను మాత్రం విడనాడలేదు. చిన్నతనం నుంచీ ఆమెకు సమాజ సేవ అంటే ఆచలా ఇష్టం. కానీ దానికి ఆమెకు సరైన వేదిక దొరకలేదు. చిన్నప్పటి నుండీ ఆమె వినూత్నంగా ఆలోచిస్తుంది. ఒక చట్రంలో ఇమిడిపోయి ఎప్పుడూ ఆలోచించదు. కొత్తగా ఆలోచిస్తుంది. కేరళకు చెందిన ఈమె పేరు రోజ్. అందరికీ ఈమె సిస్టర్ రోజ్‌గా పరిచయం. ఎందుకంటే ఈమె నన్‌గా మారింది. అందుకే అందరూ ఈమెను సిస్టర్ రోజీగా పిలుస్తారు. రోజీ చిన్నప్పటి నుంచీ సమాజసేవకు అంకితమైంది. తాను చేసే ప్రతి పనీ సమాజానికి ఉపయోగపడాలని తపన పడేది. ప్రజా సేవ కోసమే రోజీ భోపాల్ విశ్వవిద్యాలయంలో సోషల్ వర్క్ కోర్సు చేసింది. తరువాత మేఘాలయలోని గారోహిల్స్ మెడికల్ సిస్టర్స్‌లో సభ్యురాలిగా చేరింది. ఇది రోమన్ కేథలిక్ చర్చిలోని నన్స్ విభాగం. ఇక్కడి రాజబాల ప్రాంతంలో ఏడు సంవత్సరాలు అందరికీ సేవ చేసింది. ఆ సమయంలోనే అక్కడి గిరిజనులు పేదరికంలో మగ్గుతున్నట్లు సిస్టర్ రోజ్‌కు అర్థమైంది. అందుకు కారణం వారు అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతులే.. వారు పండిస్తున్న పంటలైన వరి, పసుపు పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక వారు తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేవారు. అందుకు చాలా బాధపడిన సిస్టర్ రోజ్ వారికోసం కొత్త కొత్త వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి, పశు సంపద పెరిగేలా అనేక చర్యలను తీసుకుంది. అయినా అక్కడక్కడా ఆర్థిక అసమానతలు రావడంతో వారి వ్యవసాయ పద్ధతినే మార్చాలని నిర్ణయించుకుంది. అందుకోసం తన తండ్రి అనుసరించే పద్ధతిని వారికి పరిచయం చేయాలనుకుంది.
రోజీ తండ్రి కేరళలో రబ్బరు సాగు చేస్తూండేవారు. రబ్బరు పంటకు ఆదాయం బాగా వస్తుంది. చెట్ల పెరుగుదలకు కొన్ని సంవత్సరాలు పట్టినా.. అవి ఎదిగేకొద్దీ లాభాలు వస్తుంటాయి. పోనుపోను పెరుగుతాయి కూడా. ఇందులో లాభాలే తప్ప.. నష్టాలు రావు. ఇందుకోసం రోజీ వెస్ట్‌గారోహిల్స్‌లోని పరిసర గ్రామాల్లో రైతులకు రబ్బరు పంటపై అవగాహన కల్పించింది. 1987లో కొంతమందిని కేరళకు తీసుకెళ్లి వారికి సాగు వివరాలను పూర్తిగా తెలియజేసింది. దీంతో ఆయా గ్రామాల రైతుల్లో చైతన్యం వచ్చింది. వారంతా రబ్బరు సాగుకు ఆసక్తి చూపారు. ఇందుకు రబ్బరు బోర్డు నుండి కూడా అనుమతులు లభించడంతో 21 గ్రామాల్లోని 500 కుటుంబాలు రబ్బరు సాగును ప్రారంభించాయి. మొదట్లో కిలో రబ్బరు రూ. 15 ఉండేది. అది చూసిన రోజీ రబ్బరు బోర్డుతో పోరాడింది. 2010 నుంచి కిలో రబ్బరుకు రూ. 100 వస్తున్నాయి. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వెస్ట్‌గారోహిల్స్ అంతటా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఐదు శాఖలతో 22 కోట్ల రూపాయల టర్నోవర్‌ను నమోదు చేశారు. అలా రోజీ తాను ఉండే గ్రామంలో అనేక సమస్యలు ఎదుర్కొనే వారిని వదిలేయలేదు. వారందరికీ ఒక వేదికను అందించాలనుకుంది.. అందించింది.. రోజీ ఆలోచనతో ఇప్పుడు ఆ గ్రామం ముఖచిత్రమే మారిపోయింది. ఇప్పటికీ అంటే.. ఆమెకు 70 సంవత్సరాలు పైబడినా ప్రజాసేవను వీడలేదు. *