Others

అలా.. అన్నమాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*శ్రీ శంభు ఫిలిమ్స్ బ్యానర్‌పై బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం పూజాఫలం (1964). మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా నిర్మించారు. మంచిగంధం, మల్లెపువ్వులు, మనస్సులోగల ఒక నిష్కల్మష హృదయుని జీవితంలోకి ముగ్గురు యువతులు ప్రవేశించి, కల్లోలాన్ని సృష్టించారు. చివరికి ఆ ముగ్గురిలోనే తన జీవిత భాగస్వామిని గుర్తించడం ఈ చిత్ర కథ. ఆ ముగ్గురు యువతులుగా సావిత్రి, జమున, ఎల్.విజయలక్ష్మి ఆయా పాత్రల్లో జీవించారు. వారి మధ్య నలిగిన యువకునిగా అక్కినేని నటించారు. చిత్రం అడుగడుగునా బి.ఎన్.రెడ్డి కళాత్మక దృష్టి కనిపిస్తుంది. హీరో గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే చివరి సన్నివేశాల చిత్రీకరణ బి.ఎన్.రెడ్డి ప్రతిభకు నిదర్శనం. ఘనం శీనయ్య రాసిన ‘శివదీక్షా పరురాలనురా..’ పాట, సంగీతం, అభినయం, చిత్రీకరణ అపూర్వంగా సాగి, రసహృదయులను మెప్పించింది. ఎల్.విజయలక్ష్మి ఈ నృత్యానే్న కాక ‘మదనా మనసాయెరా’ అంటూ పాడుతూ చేసే నృత్యం కూడా గొప్పగా ఉంటుంది. ఎస్.రాజేశ్వర్‌రావు మంచి సంగీతాన్ని అందించిన చిత్రాలలో ఇదొకటి. ‘పగలే వెనె్నల’, ‘నిన్నలేని అందమేదో’, ‘అందేనా ఈ చేతులకు అందేనా?’, ‘ఇది చల్లని వేళైనా’, ‘ఎందు దాగి ఉన్నావో బృందావిహారి’, ‘నేరుతునో లేదో ప్రభూ’, ‘సుందర సురనందన’ పాటలు పాపులర్ అయ్యాయి. ప్రణయానే్న కాక చక్కని వేదాంత సారాన్ని వివరించేటట్లు సి.నారాయణరెడ్డి రాసిన ‘వస్తావు పోతావు నాకోసం, వచ్చి కూర్చున్నాడు నీకోసం, యముడు వచ్చి కూర్చున్నాడు నీకోసం’ అనే భావగీతం ఈ చిత్రంలోనిదే. స్వంత చిత్రాలు కాకుండా బయట రెండు చిత్రాలకు మాత్రమే బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించారు. మొదటిది భాగ్యరేఖ (1957), రెండవది పూజాఫలం. బి.ఎన్.రెడ్డి మొదటిసారిగా ఈ సినిమాలో ప్రధాన కథకు సమాంతరంగా ఒక కామెడీ ట్రాక్‌ను పెట్టారు. జెమిందారుగారి తమ్ముడి కొడుకు గోవిందయ్య వేషంలో రమణారెడ్డిని పెట్టి, అతని కొడుకు రాజాగా పొట్టిప్రసాద్‌ను తీసుకున్నారు. అతనికి ఈ చిత్రం మంచి మలుపునిచ్చింది. అక్కినేని వయొలిన్ విద్వాంసుడిగా కనిపిస్తారు. ఆ సన్నివేశాల్లో వయొలిన్‌ను వాయించింది పోరూర్ గోపాలకృష్ణన్. మాటలు డి.వి.నరసరాజు, ఫొటోగ్రఫీ యు.రాజగోపాల్ అందించారు. మితిమీరిన క్లాసికల్ చిత్రంగా ముద్రపడి కాసులు సంపాదించుకోలేకపోయింది.

-పూజారి నారాయణ