Others

నందీశ్వరా నమో నమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాదేవుని ప్రమథగణాలలో ముఖ్యుడు మరియు వాహనమూ అయిన నంది మానవాళికీ ఆహారం అందించేందుకు ఎద్దురూపంలో సహాయ పడుతున్నాడు. ఆవులు పాడినిస్తే ఎద్దు పంటలు పండించే రైతుకు శాయశక్తులా సాయపడుతుంది.
అటువంటి నందిని గురించి స్మరించుకోవడం ఎంతైనా సముచితం. కలియుగాంతంలో లేచి రంకెవేస్తాడని స్వయంభువుగా వెలసిన యాగంటినందిని గురించి కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారు. యాగంటి సమీపంలో వెలసిన మహానంది ఒక దివ్య పుణ్యక్షేత్రం.శిలాదుడనే మహర్షి తపస్సు వలన కలిగిన మహానంది పెరిగి పెద్దవాడై పరమ శివుని మెప్పించి ఆయనకు వాహనమయ్యడు. మహానంది కొలను లోని నీరు స్వచ్ఛమై అన్ని కాలాలలో హెచ్చుతగ్గులు లేకుంటా పరమ పవిత్రంగా ఉంటుంది. సర్వరోగములూ హరిస్తూ భక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది. మహానందికి చుట్టుపక్కల మరో ఎనిమిది నంది యొక్క దేవాలయాలున్నాయి.
ప్రమథనంది, సూర్యనంది, సోమనంది, నాగనంది, విష్ణునంది, శివనంది, గరుడనంది, మ రియు వినాయక నంది అనే పేర్లతో ప్రసిద్ధమై ఈ నవనందులనూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు దర్శించుకున్నవారికి గ్రహబాధలు, అనారోగ్యాలు తొలగి సుఖసంతోషాలతో జీవించగలరని ప్రతీతి. సృష్టి, స్థితులకు బ్రహ్మ, విష్ణులు ప్రతీకలైతే సర్వగణములకే కాక మానవాళి మనుగడలో మమేకమై పురుషునికి ప్రకృతి సిద్ధమైన నేస్తంగా సాక్షాత్కరించిన పశువులను సైతం మనకు అనుగ్రహించిన ఆదిదేవుడు పశుపతి నాథునిగా నేపాల్‌ళో పూజలందుకుంటున్నాడు. అందుకే ఆయన బోళాశంకరుడై అవనిని సర్వవేళలా కాపాడే ఆదిదేవుడయ్యాడు. కాబట్టి చెట్టునైనా, పుట్టనైనా పూజించే సంప్రదాయం కలిగిన మనదేశంల సరదా పేరుతో పశువులను హింసించకుండా మంచి ఆహారాన్నిచ్చి ఆనందింపచేయడమే మనిషి తెలుపుకునే కృతజ్ఞత అని గుర్తుంచుకని పండుగ వేళ ఆనందంతో శుభాశీస్సులు అందిస్తాయి.

-అనిత