Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ధెర్యమందింప నిలువని తనువదేలా?
ప్రేమగనుఁ బల్క రించని పెదవదేల?
మంచిపనులనుఁ జేయని మనుగడేల?
చూడుమో కర్మసాక్షి!యోసూర్యదేవ!

భావం: ఇతరులకు ధైర్యాన్ని అందించాలనుకోని ఈ శరీరం దేనికి? ప్రేమగా పలుకరించని ఈ పెదవి దేనికి? సమాజంలో మంచి పనులను చేయని బ్రతుకు దేనికి? వ్యర్థమన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోదించుము తండ్రీ.
తే.గీ . దైవ భక్తియుఁ బాప చింతనము లేని
బ్రతుకుఁ జూడంగఁ బిదప దుర్భరము గాదె!
యవియుఁ గల్గిన చోహాయి యల్లుకొనదె?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దైవభక్తి పాపచింతన లేని బ్రతుకు తరువాత కాలంలో ఎంతో దుర్భురమైపోతుంది. ఆరెండు కలిగి యున్న పక్షంలో హాయి అనేది మనల్ని అల్లుకుని పోతుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానకి ప్రబోధించుము తండ్రీ !

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262