Others

అదుపాజ్ఞలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరికలు అనేవి మానవునిలో సహజంగా కలుగుతుంటాయ. కాని, కోరికలను నశింపచేసుకోవాలని గీత చెబుతుంది. ఈ కోరికలను జయించడం అంత సులభం కాదు. చివరకు తపస్సుకు ఉపక్రమిం చిన వారు కూడా కోరికలను పూర్తిగా త్యజించడం లేక పోయన వాళ్లు కనిపిస్తారు. కాని ఈ కోరికలను దూరం చేసుకోవలన్న ఈ ప్రయత్నం నిరంతరం వ్యాపకం కావాలి.లేకపోతే కోరికలనేవి అక్షయపాత్ర లాగా ఒకదాని తర్వాత పుడుతూనే ఉంటాయ.
వేదాంతపరంగా, ఆధ్యాత్మికపరంగా మహిషాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు దుష్ట కోరికలకు సంకేతం. మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించడానికి ప్రయత్నించినపుడు వాడు ఒకసారి వృషభరూపంలో, మరొకసారి ఏనుగు ఆకారంలో ఆమెను ఎదుర్కొన్నట్లు ‘దేవీ మహత్మ్యం’ చెబుతున్నది. కోరికలనుగాక ఆ కోరికలకు మూల స్థానమైన కేంద్రాన్ని పెకలించివేసినపుడే ఆ లక్ష్యం నెరవేరుతుంది.
రాక్షసాకారంలోని మధుకైటభులే దుష్ట సంకల్పాలయిన కామ, క్రోధ లోభాలు. వీటిని గుణలనీ అనవచ్చు. లేదా కోరికలన్నా అనవచ్చు. కామ క్రోధ లోభాలు రజోగుణం నుండి ఉద్భవించాయి కావున ఈ మూడింటిని త్యజించాలని అంటారు. ఈ మూడు నరక ద్వారాలని, అందువల్లనే ఈ దుష్టత్రయాన్ని త్యజించాలని గీత అంటోంది. ఈ మలినత్రయం చైతన్య రూపంలోని ఆత్మను కప్పివేస్తాయి. ఉదా లాంతర్ లో దీపం వెలిగించిన కాసేపటికి ఆ లాంతర్ కు ఉన్న గాజుబుడ్డి కి పట్టిన మసి పట్టి లాంతర్‌లోని దీపపుకాంతి కనిపించకుండా పోతుంది. అదేవిధంగా ఈ మురికి కప్పినపుడు చైతన్యశక్తి గల ఆత్మ కూడా నిర్వీర్యమవుతుంది.
కామక్రోధ లోభాలు మాత్రమే మన శత్రువులు కావు. అంతకన్నా ప్రమాదకరమైన శక్తి ఒకటి ఉన్నది. చంచలత్వం. ఇది ఒక అంతర్గత, అదృశ్య దుష్టశక్తి. ఒకవేళ మొదటి మూడిటిని మనం తెలుసుకోవచ్చునేమో ఈ చంచలత్వాన్ని మాత్రం మనం గ్రహించలేము. దీన్ని కట్టడి చేయలేము. చంచల స్వభావం కల మనస్సే కోరికలు కారణం అవుతుంది. మంచి మాటలు విన్నపుడు లేదా పెద్దలు చెప్పే ప్రవచనం విన్నపుడూకోరకలు అదుపులో ఉన్నట్లే ఉంటాయ. కానీ ఎదురుగా దేనినైనా చూసినపుడు మళ్లీ వెంటనే ఆ వస్తువుపై మనసు పోతుంది. ఈ ఒక్క వస్తువును తీసుకొందాం. తర్వాత ఇక ఏవస్తువునూ కోరుకోకూడదు అనుకొంటారు. కానీ ఆ వస్తువు తర్వాత మరొకటి కనబడుతుంది. చంచల మైన మనస్సు దానిని ఆకర్షిస్తుంది. అందుకే కలుపు మొక్కలు పెరికి వేసినట్లుగా చంచలస్వభావాన్ని, కోరికలను పూర్తిగా తీసేయాలి కానీ వాటిని అదుపు లో పెట్టుకోవడం అనుకోకూడదు.
ఇక్కడ తీసేయాలి అంటే కోరికలు లేకుండా చేసుకోవడం ఇది సాధ్యమా అంటే అవసరానికి తగిన కోరిక ఉండాలి కానీ అనవసరమైనవాటి పట్ల కోరికలు పెంచుకోకూడదు. ఉదా ఆకలి వేసినపుడు అన్నం తింటే సరిపోతుంది. కానీ అన్నానికి బదులుగా ఏ భక్ష్యాలు కావాలనో అనుకొంటే అది కోరికనే కానీ ఆకలి కాదు. అంటే అవసరం కాదు. కేవలం ఆకలికి ఏదో ఒక పచ్చడి అన్నం చాలు కానీ కోరికకు పంచదారతో చేసిన తీపి పదార్థాలు, లేదా నూనెలో వేయంచిన గరగరలు కావాలి. అది కోరిక అన్నమాట.
ఇట్లా ప్రతివిషయంలోను కోరికను అదుపులో ఉంచుకోవడమే కాక అసలు కోరిక ను దరి చేరనివ్వకపోతే మనిషిలో మంచితనమూ, మానవత్వమూ కోకొల్లలుగా ఉంటాయ. నలుగురిలో మంచిపేరును సంపాదించుకోవచ్చు. దుర్గాదేవిని ముప్పుతిప్పలు పెట్టిన రక్తబీజుడిలాంటిదే ఈ కోరక. దుర్గాదేవి రక్త్భీజుని సంహరించేటపుడు వాని శరీరంలోనుంచి వచ్చే ప్రతి రక్తపు చుక్కను చిందినంతనే మళ్లీ ఉద్భవిస్తున్నట్లు గ్రహించి, దీనికి మూలాధారమైన రక్తపుబొట్లు నేలమీద పడకుండా తగు జాగ్రత్త వహించింది. తన నాలుకలు భూమండలమంతా విశాలంగా వ్యాపింపజేసి దాన్ని పీల్చినపుడే ఈ రాక్షసుడి అంతం సంభవించింది. అదేవిధంగా కోరికలనే తలలను ఖండించినంతమాత్రాన సరిపోదు ఈ దుష్టశక్తి మూలాధారాన్ని ధ్వంసం చెయ్యలేకపోయినా దాని రూపాలైన కామ, క్రోధ, లోభాలను విసర్జించే ప్రయత్నం చెయ్యడం సగటు మానవుని కర్తవ్యం. కోరికలు దూరం చేసుకొంటే దుఃఖమే దరిచేరదని బుద్ధుడు కూడా చెప్పాడు.

- కె. చంద్రిక