Others

కరిగిపోతే దొరకనిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఎన్ని విలువైన వస్తు సంపదలున్నా అవి ఏవీ కాలం ముందు ఎందుకూ సాటిరావు. ప్రపంచాధినేతలైనా, కోట్లకు పగడలెత్తిన సంపన్నులైనా కాలాన్ని తాము అనుకున్న రీతిలో సాగించలేరు. అందుకే ఓడలు బండ్లు అవుతాయ. బండ్లు ఓడలు అవుతాయ. ఎవరి కర్మానుసారం వారికి కాలం వారి జీవితాన్ని నడుపుతుంది. సత్యధర్మాలను పట్టుకుని కర్తవ్యాన్ని ఆగకుండా చేస్తుండేవారికి కాలం అనుకూలంగా ఉన్నట్టు అగుపిస్తుంది..కర్తవ్య విస్మరించినవారికి కాలం ప్రతికూలంగా పరుగెడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కాలం ఏదీ చేయదు. దానికి రాగిద్వేషాలు లేవు. ఎవరి కర్మకు వారి ఫలాన్ని అందిస్తుంది. అంతేకాదు కాలం ఒక సెకను కూడా ఎవరి కోసమూఆగదు. ఎంత ధనం పోసినా కొనలేనిదీ, అమ్మలేనిదీ, అప్పుతెచ్చుకోలేనిదీ, ఇచ్చుకోలేనదీ, గడిస్తే మరలా తెచ్చుకోలేనిదీ ఈ ప్రపంచంలో కాలం ఒక్కటే!
ప్రణాళికాబద్ధంగా, సమయస్ఫూర్తిగా, వాయిదా పద్ధతి లేక మరలిరాని ‘కాలాన్ని’ ఉపకరించుకునేవారికి అసలు తీరికే దొరకదు. ప్రతి మనిషీ తాను చేసే పనులను ఎప్పటికప్పుడు విమర్శించుకుంటూ పదుగురి సాయపడుతూ కాలాన్ని గడపాలి. ఒక్క నిమిషం వృథా గా గడిపినా కూడా ఎంతో విలువైన సమయం పోగొట్టు కున్నట్టే అవుతుంది. కనుక కాలం విలువ తెలిసి ప్రతి పనిని విశే్లషించి అవసరాలకనుగుణంగా క్రమపద్ధతిలో చేయగలగాలి.
అందుకే కాలాన్ని అతి జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ముందు ఏమిజరుగుతుందో, ఏమవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఉన్న సమయాన్ని తమ భవితకు అనుకూలంగా మలుచుకున్నవారే విజ్ఞులు. కులమతాలు, జాతులు, ప్రాంతాలు, వయసులు, స్ర్తి పురుషులు, పండిత పామరులు, ధనిక, దరిద్రులు ఎవరైనా కాలానికి తలవంచాల్సిందే.
గడచిన బాల్యాన్ని ఎవరు వెనక్కు తేగలరు? కౌమారం, వనం ఎవరికి వస్తారు మళ్లీ? మధ్య వయస్సు నుండి వృద్ధాప్యంలోకి జారడానికి ఎంతసేపు? అందుకే శిశువు నుండి ముసలిగా మారేదాకా ప్రతిక్షణాన్నీ అపురూపం అని గుర్తించి మసలుకుంటూ ఏ వయసులో బాధ్యతలను ఆ వయసులో తీర్చుకోవాలి.
అందం ఉందని అహంకరిస్తే కాలం తో పాటు అందమూ కరిగిపోతుంది. మరి అప్పుడు అహంకారానికి విలువే ఉండదు.
సమయం విలువ తెలిసినవారు తెలియని పసిపిల్లలకు అర్థమయేలా చెప్పాలి. పసిబిడ్డలు ఎదిగే ప్రతి దశలోను వారి పెంపకంలో మెళకువలను సమయానుకూలంగా పాటించాలి.
మన ధర్మశాస్త్రాలు అందుకే బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసాశ్రమాలను, ఆ ఆశ్రమాల్లో కాలానుగుణంగా పాటించాల్సిన బాధ్యతలను చక్కగా వివరించారు. . ఏ వయసులో ఆ ఆశ్రమధర్మాలను కాలహరణం లేక ఎవరు పూర్తిచేయగలరో వారు ఏనాడూ పశ్చాత్తాపానికి లోనయే అవకాశముండదు. అయ్యోఅని వగచే పని ఉండదు. లేకపోతే ఎంత తలపట్టుకున్నా ఆ సమయాన్ని కూడా పాడుచేసినవాళ్లుగా ఉంటారు.
విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు, ఇతర ఏ జీవనోపాధి కల్గినవారు కాలం విలువ తెల్సుకుంటే తమ జీవిత ప్రణాళికను తాము సిద్ధం చేసుకుని విజయాలు సాధించగలరు.
లేకుంటే అంతావ్యర్థం అయపోతుంది. ఇంట్లో గడిపే ఇల్లాలైనా సరే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేవలం పక్కంటివారితో కాలక్షేపపు కబుర్లు చెపుతూ ఉంటే అది ఆ ఇంటి సభ్యులకు ఎంతో హాని చేస్తుంది. అంతేకాదు వీరు కబుర్లు విన్నవారు కాలాన్ని నష్టపోయ వీరిని కాలం విలువ తెలియని మనుష్యులుగా లెక్కకడుతారు.మేము అంత చేశాము ఇంత చేశాము అని గొప్పలు పోనక్కర్లేదు. ఎవరైనా వారికున్నంత వెసలు బాటు బట్టి పని చేస్తుంటారు. అసలు పని చేయని మనిషి అంటూ ఎవరూ ఉండరు.ఎంత చేసినా సమయం మిగిలిపోతుంది అనుకున్నారంటే వారు చేయ వలసింది ఏదో చేయడం లేదనే విషయాన్ని సరిచూసుకోవాలి. అట్లాఅని ఇతరులకు సాయం చేయకుండా కేవలం స్వార్థంతో ఉండకూడదు. వివేక విచక్షణలతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
*