Others

మనో మూల మిదం జగత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దైనందిన జీవితంలో సంవత్సరం, మాసం, తిథులు, నక్షత్రాలు, రాశులు, గ్రహణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మతాన్ని నమ్మేవారు, శుభ ఫలితాలను కోరేవారు మంచి శకునం, మంచి దినం చూసుకునేవారు కోకొల్లలు.
ఈ చరాచర విశ్వం ఒక మానవాతీత శక్తిపై ఆధారపడి, సృష్టి లయ స్థితులకు కారణభూతములై నిరంతరం అనేక జీవరాశుల సృష్టివలయులు ఎక్కడో ఏదో ప్రాణి ప్రాణం పోసుకోవడం, పోగొట్టుకొనడం జరుగుతూనే ఉంది. జీవరాశులకెల్లా అత్యుత్తమ జన్మ మానవ జన్మ అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి ఋషి వాక్యం కూడా. అంతేకాదు వేదవేదాంగాలు కూడా చెబుతున్నాయి. ఇంకనూ మానవ శాస్త్ర విజ్ఞానం మానవ జీవిత పరిణామాల గూర్చి అనేక కోట్ల సంవత్సరాల జీవన ఆకృతి మార్పులే నేటి మానవ స్వరూపాల అని సాదర్శక రూపం తెలియబరుస్తున్నాయి.
ఈ సృష్టి ఒక శక్తికి లోబడి ఉన్నదని ఘంటాపథంగా చెప్పవచ్చు. దీనిని ఆస్తికులు దైవ శక్తియని ఇతరులు శక్తియని అంగీకరించారు. ఏది ఏమైనప్పటికీ మన భారత దేశం సర్వమత సమ్మేళనం. వైదిక సంప్రదాయాన్ని జీర్ణించుకొని సర్వమతములను సమ్మానించవలెనని ఉన్నది. సర్వ ఆదరణ స్వ ఆరాధన మన మత సంప్రదాయం.
ఇక ప్రతి సంవత్సరంలో ఎన్నో చతుర్ధశులు, అమావాస్యలు వస్తుంటాయి. వాటిలో కొన్నిటికి మాత్రమే ప్రాధాన్యత కల్గి పర్వదినంగా భావిస్తారు. అట్టిదే మాఘమాసంలో వచ్చే చతుర్ధశి, అమావాస్యలకు అత్యంత ప్రాశస్తి గలదు. శివరాత్రి మహోత్సవాలు చతుర్ధశి అమావాస్య మాఘమాసంలో జరగడం ఇంకా చెప్పదలచుకుంటే పర్వదినం ఈ సంవత్సరం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రోజు. అధమాధములు కూడా ఈ రోజు ఉపవాసముండి తెలిసో తెలియకో శివనామస్మరణ చేస్తూ జాగరణతో ఉండి మరణించిన వారికి కైలాసప్రాప్తి కల్గిందని ఎన్నో గాథలున్నాయి.
‘‘శివుని ఆజ్ఞ కానిదే చీమైనా కుట్టదని’’ అంటారు మన పెద్దలు. నాటి నుండి నేటి వరకు కొందరికి అది వేదవాక్కు. దాన్ని నమ్ముతున్న వారెందరో, ఆ నమ్మకంతో శైవ సాంప్రదాయం పాటించేవారు. శివరాత్రి మహోత్సవాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో జాగరణ చేసి శివనామస్మరణతో శివపార్వతి కళ్యాణం జరిపించి, తరించే పర్వదినాలు ఈ శివరాత్రి మహోత్సవం గురించి శివపురాణంలో చక్కగా వివరించబడింది.
ద్వాదశలింగ క్షేత్రాలలోనూ, ఇతర శివాలయాల్లో రుద్రయాగాలు, రుద్రాభిషేకాలు, శివపార్వతీ కళ్యాణం, లింగోద్భవ ఉత్సవములను కనులారా గాంచి రాత్రంతా శివనామస్మరణ చేస్తూ జాగరణ చేస్తూ కొందరు అంగరంగ వైభవంగా వీర శైవ భక్తుల అగ్నిగుండాలు వెలిగించి ‘‘హశ్మరభః శరభః’’ అంటూ ఢమరుకాది భువనాంతరళము దద్దరిల్లగ శంఖనాదాలతో ‘‘శంభో శంకర మహదేవ హరహర’’ అని వీరావేశంతో నృత్యాలు చేస్తుంటారు. ముఖ్యంగా కోటప్పకొండ తిరునాళ్లు చూసి తీరవలసిందే. బండ్ల మీద ప్రభలు కట్టి రంగుల చీరలతో ముస్తాబు చేసి, ఆపైన శిఖరంగా ఇత్తడి లేదా రాగి చెంబులను బోర్లించి ఎద్దులను అలంకరించి సాక్షాత్తు నందీశ్వరులే కదలి వస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా శ్రీకాళహస్తి, శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ, కీసరగుట్ట, కొరివి (వరంగల్ జిల్లా), వాడపల్లి, నల్లగొండ జిల్లాలోనే గాక పీఠాధిపతులు తమ ఆశ్రమాల్లో శివరాత్రి ఉత్సవాలు చేస్తారు.
శివరాత్రి నాడు ప్రాతఃకాలంలోనే లేచి కాలకృత్యాలు తీర్చుకుని బిల్వ పత్రములతో, గనే్నరు పూలతో శివుడ్ని అర్చించి, నిరాహారంగా ఉండి రాత్రంతా జాగరణ చేసి శివనామ స్మరణతో గడిపిన వాళ్లకు శివుడు తన కరుణా కటాక్షములతో కృపాదృష్టితో తన సాయుజ్యానికి చేర్చుకుంటాడని భక్తజనుల నమ్మకం. ఆ నమ్మకంతోనే నేటి నాగరికత ప్రపంచంలో ఆధునిక జీవితం గడుపుతూ, నగర, పట్నవాసులు సైతం తమ శక్త్యానుసారం శివరాత్రి నాడు అత్యంత శ్రద్ధా భక్తులతో భోళాశంకరుని కొలచి ఆథ్యాత్మికానందం పొందుతారు. మరికొందరు జాగరణ పేరుతో టీవీల ముందు, సినిమా హాలులో కూర్చుని జాగరణ చేస్తున్నామని ఆత్మద్రోహం చేసుకుంటారు. ఆధునిక భక్తాగ్రేసరులు! భోళా శంకరుడు కాబట్టి తన బిడ్డలైన భక్తులకు కొంగుబంగారమై వారి కామితార్థములు తీర్చి కడకు మోక్షప్రాప్తి కల్గిస్తాడని శివపురాణంలో ఉంది. కాబట్టి ఎన్ని రోజులు ఎన్ని పాపాలు చేసినా ఉపవాసం ఉండి, శివజాగరణ చేసి పవిత్రంగా ఈ ఒక్కనాడైనా శివనామస్మరణతో గడిపితే, కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణ గాథలు చెబుతున్నాయి.
కాబట్టి మనం కూడా ‘‘హర హర మహాదేవ శంభో శంకర’’ అంటూ ఆ కైలాసనాథుని స్మరణతో మన జీవితాలను పావనం చేసుకుందాం. తరిద్దాం.

-కొలనుపాక మురళీధరరావు