Others

సదాశివ చింతనం - భవసాగర తరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలి మానవులు అజ్ఞాన వశమున పాపరతులై యుండి పలు క్లేశాలను అనుభవిస్తూ ఉంటారు. తరుణోపాయం సాయం కొరకు తమ బాధలను దుఃఖములను బాపుమని పరమేశ్వరుని వేడుకుంటూ వుంటారు. శివుడు భోళాశంకరుడు గదా! ఇది తెలిసి కూడా నిశ్చల భక్తితో, శ్రద్ధతో, ఆరాధనలు చేయాలనే తలంపును మరచిపోతూ ఉంటారు. పరమశివుని సేవించినచో ఫలము నిండుగా లభిస్తుంది. కానీ పర్వ దినాలలోనే తమ భక్తిని చాటుకొనుటకు శివలింగారాధన చేస్తూ వుండటం జగద్విదితమే.
జన్మరాహిత్యం చేయవలసినదిగా శివుని ఆర్తితో వేడుకోవాలి. తనువులు ఈ భూమిలో నుండు నందాక ఎలాంటి రోగాలు, దుఃఖములు రాకుండా మార్గం చూపించమని దయతో వీక్షించమనీ ప్రార్థించి శివుని కృపకు పాత్రులు కావాలి. శివుడు లింగరూపంలో నుండి వీతరాగులను రక్షిస్తూ ఉంటాడని వేదం.
శివనామ స్మరణ చేయుచూ, నిరంతరం శివధ్యానంలో వుండు వారికి ఈ లోకంలో వశం కానిదేదీ లేదని మహాకవి ధూర్జటి తన కాళహస్తీశ్వర శతకంలో మనోజ్ఞంగా మత్త్భేవృత్త పద్యంలో తెల్పిన తీరు సకల జనులకూ ఆచరణీయం. ఆ పద్యం ఇది.
మ పవి పుష్పంబగు - నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బువు - శత్రుండతి మిత్రుడే - విషము దివ్యాహారవౌ నెన్నగా
నవనీమండలి లోపలన్ - శివశివేత్యా భాషణోల్లాసికిన్
‘శివ’ నీ నామము సర్వవశ్యకరవౌ శ్రీకాళహస్తీశ్వరా
అంటూ మానవులెవరైననూ సరే ‘శివ శివ’ అని పల్కుచు, తన్మయత్వం పొందు వారికి ఈ విశ్వంలో అన్నియు అనుకూలంగా వుంటాయి. ‘వజ్రాయుధం పువ్వుగా మారుతుంది. నిప్పు మంచుగా చల్లగా మారిపోతుంది. అగాధమైన జలరాశి సముద్రము నేలగా మార్పు చెందుతుంది. కటిక శత్రువు గూడ క్షణంలో స్నేహితునిగా మారిపోతాడు. ప్రాణములను హరించే గరళము (విషము) కూడా ప్రాణాలందించే అమృతంగా మారుతుంది. ఓ శివా! నీ పేరు అన్నింటినీ వశపరచుకొంటుంది. శివనామం సర్వవశీకరణ మంత్రం. సర్వవశ్వౌషధం. అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ‘శివ’ అనే రెండు అక్షరాలు పాతకాలను హరించడంతోబాటు, పుణ్యములను ప్రోగుచేసి పెడతాయి. ఈశ్వరానుగ్రహం లోపిస్తే ఒక్క ఆరోగ్య భాగ్యమే కాదు. అన్ని భాగ్యాలూ ‘అభావాలే’ అవుతాయి. బ్రతికినన్నాళ్లూ నిరామయ స్థితిని అనుభవించి, శివచింతనతో జీవిస్తూ ఆయనలో లీనం కావడమే సజ్జనులు కోరుకొనే దైవ భావన. జన్మ సాఫల్యం అంటే ఇదే.
‘దేహాంతే తవ సాయుజ్యం - దేహిమే పరమేశ్వర’ అని స్తోత్రవాక్యం. నీ పద చింతనలో భయం వుండదు. నీ శరణాగతితోనే సర్వులకూ మోక్షపథం.
జీవుల ఆముష్మిక యాత్రలో అరిషడ్వర్గములనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులు శత్రువులై ప్రతిబంధకాలుగా వుంటాయి. ఇవి జీవులకు పాతకాలను కల్గిస్తూ వుంటాయి. ఈ మోహాదులను వదిలించుకొని సుఖజీవులు కావలెనన్నచో నీ ఆరాధన నీకు అభిషేకం - నీ స్మరణం - సదా నీ చింతనం, నీపై భక్తి శ్రద్ధలు, ‘శివాజ్ఞలేనిదే చీమైనా కుట్టద’నే కుట్టదనే నానుడి మదిలో నిల్పుకొని, అనూహ్యమైన నీ లీలలను కథలు కథలుగా చదువుతూ, వింటూ, నీ సంబంధిత కార్యాలను ఆచరించి ఆనందాబ్ధిలో మునికి ముక్తిని పొందాలి.
సారూప్య ముక్తిలో భగవంతుడు భక్తులకు తన రూపాన్ని ప్రసాదిస్తాడని శాస్త్ర వచనం గదా! కానీ నీవు లింగ రూపంలో దర్శనమిచ్చి, పరోక్షంగా మమ్ములను అనుగ్రహించుట ఎన్ని జన్మల పుణ్యఫలమో! ఎందరో యోగులూ మునులూ భక్తులు నీ నిజ రూపమును తలంచుకొనుచూ నీ లింగ రూపమును పలు స్తోత్రాలుగా పఠించి పరమానందమును పొందుచున్నాను.
బ్రహ్మాది దేవతలు అర్చించే లింగేశ్వరుడవు గదా! నిర్మల భాసితమై శోభిల్లే లింగమవు. జన్మజ దుఃఖ వినాశన లింగం అంటూ లింగాష్టకాన్ని పఠించుట జనుల అదృష్టము. ఇటు మానవులే గాక సాలీడు - సర్పము - ఏనుగును - బోయవాడు నిన్ను తమ మదిలో నిల్పుకొని - నిశ్చల భక్తి తత్పరతతో సేవింపుచూ ఒకరిని మించిన ఒకరుగా భక్తితో పరవశించి చేసిన నీ లింగ పూజకు నీవు ముగ్ధుడవై, అన్నీ చూస్తూ వారికి ముక్తిని ప్రసాదించి - ధన్యజీవులను చేశావు, వారి ద్వారా నీవు కాళహస్తీశ్వరుడవై శ్రీకాళహస్తి అనే పేరును సువర్ణముఖి నదీ తీరాన సార్థకము చేసి యుగ యుగాలనూ తరింప చేశావు. బాలమార్కండేయుని పునరుజ్జీవింప జేయుటకు ప్రాణాంతకుడైన ఆ యమునినే శిక్షించినావు. అర్జునునితో కిరాతుని రూపంలో యుద్ధం చేసి భక్తికి మెచ్చి - ఆయన శౌర్యాన్ని అభినందించి ఆనందించి పాశుపతమును అందించావు.
‘శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే’ అనే నానుడి ప్రకారం పరస్పరం సహకారం అందించుకొనుట - ఇరువురూ ఒకటేననే ఆధ్యాత్మిక భావనను జగతి జనులలో కల్పించుట లోక క్షేమం కొరకే గదా! బ్రహ్మ విష్ణువుల అహంకారము నణచి అగ్ని స్తంభంగా నిలిచి వారికి పరీక్ష పెట్టి ఆద్యంతములను తెలుసుకోలేక వారు అసత్యమును ఋజువుగా చూపితే వారి గర్వము నణచి లింగ రూపంలో సాక్షాత్కరించి వారిని అనుగ్రహించుటలో నీ ఔదార్యం ప్రశంసనీయమని ఎందరో కవులు, వేదాలు ఉపనిషత్తులు నిన్ను అనన్య భక్తితో కొలిచారు శివా!
ఆంధ్ర వాఙ్మయ సాహిత్యంలో శివ పారమ్య గ్రంథములు అనేకములు రచించి తరించిన మహనీయులు కవి పుంగవులు - ఎందరో నీ శరణాగతి తత్త్వంతో, నీ శివ ధ్యానంలో - చింతనతో - నిత్య స్మరణతో పునీతులై లోకానికి ‘శివ’ నామ ప్రాభవాన్ని అందించుట లోక కల్యాణం కోసమే గదా! కావలసింది ఆదిదంపతుల కృపయే!
‘శివ శివ శివ యనరాదా
శివనామము చేదా - శివ పాదము మీదా నీ శిరసు నుంచరాదా’ యని లోకానికి ఒక కవి అందించిన తీరు జన్మ సాఫల్యాన్ని కల్గిస్తుందనడంలో సందేహం లేదు. ‘ఓం నమశ్శివాయ శివాయ పరమాత్మనే’ సర్వం శివమయంగా భావించి మహా శివరాత్రి పర్వదినాన శివ నామ స్మరణలో - శివాలయాలలో ధ్యానం చేసి తరిద్దాం!

-పి.వి.సీతారామమూర్తి 9490386015