Others

చర్మానికి కవచం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణం మారింది. పగలు వేడిగానూ, రాత్రి చలిగాలులూ వీస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో జలుబు, దగ్గులతో పాటు చర్మం కూడా బాగా దెబ్బతింటుంది. మిగిలిన కాలాలన్నింటికంటే ఈ కాలం చర్మానికి కూడా పరీక్షా కాలమనే చెప్పాలి. అందుకే చర్మానికి తగిన చిట్కాలను పాటించడం తప్పనిసరి. అన్నిటికంటే ప్రధానమైన చిట్కాగా గంటకోసారి ద్రవపదార్థాలను తీసుకోవడం ముఖ్యం.
* ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగాలి.
* ఉపాహారం తరువాత పళ్ళరసం, మధ్యాహ్నం మజ్జిగకానీ, కొబ్బరినీళ్లు కానీ, నిమ్మరసం కానీ తాగాలి.
* రాత్రి గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల వాతావరణ మార్పులతో వచ్చే జలుబు, దగ్గులు తగ్గుముఖం పడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు పాలు నేచురల్ మాయిశ్చరైజర్ కాబట్టి చర్మాన్ని పొడిబారనీకుండా చూసుకుంటుంది.
* స్నానం చేసే నీటిలో చివరగా చిక్కని పచ్చిపాలు కలుపుకుని నాలుగైదు మగ్గులు పోసుకుంటే ఉపయోగం ఉంటుంది. లేదంటే స్నానం తరువాత ముఖానికి క్రీము రాసుకునే ముందే పచ్చిపాలలో దూదిని ముంచి ముఖం, మెడ శుభ్రం చేసుకుని చల్లని నీటితో సోప్ లేకుండా తుడిచేసుకున్నా సరిపోతుంది.
* ఎండతో అలసి చెమట, మురికితో ఇంటికి రాగానే మళ్లీ సాయంత్రాలు ఏదో ఒక పార్టీకి వెళ్ళాలంటే పార్లర్‌కి వెళ్ళేంత ఓపిక ఉండదు. ఇంట్లో కూడా ఫేస్ మాస్కులు వేసుకునేంత సమయం కూడా ఉండదు. అందుకని రోజూ ఉదయమే ఒక చిన్న గినె్నను తీసుకుని రెండు చెంచాల పాలు, కాస్త తేనె, కీరదోసకాయ రసం కలిపి పూయాలి. ఇది ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది.
* చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరినీళ్ళను తీసుకోవాలి. ఇందులో గంధం, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖం తేటగా మారుతుంది.
* పుచ్చకాయరసంలో కొద్దిగా టొమాటో గుజ్జు కానీ బొప్పాయి గుజ్జు కానీ కలిపి ఐస్ క్యూబ్ ట్రేలో పోయాలి. సాయంత్రానికి ఇది క్యూబ్స్‌లా తయారవుతుంది. అప్పుడు ఒక క్యూబ్‌ని కర్చ్ఫీలో చుట్టి రెండు మూడు నిముషాలు ముఖాన్ని రబ్ చేసి కాసేపు అలాగే వదిలేయాలి. తరవుత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ముఖం తాజాగా తళుకులీనుతుంది.
* ఈ సమయంలో పొడిబారిన చర్మం నిర్జీవమైతే ముడతలు వచ్చి వయసు ఎక్కువగా కనిపిస్తారు. ఇలా జరగకుండా ఉండాలంటే పైపై మెరుగులే కాకుండా సీజన్‌లో దొరికే పండ్లు అయిన ఆరెంజ్, ద్రాక్ష, అవకాడో, దానిమ్మ, అరటి పండు వంటి యాంటీ ఏజింగ్ పళ్లను తినడం మంచిది.
* మార్కెట్లో దొరికే కెమికల్ సన్‌స్క్రీన్ లోషన్స్ కన్నా కేరట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్స్‌లో దేనినైనా కొన్ని చుక్కలు స్నానం నీటిలో కానీ, సమయం ఉంటే నలుగుకు ముందు ఒంటికి రాసుకునిగానీ శుభ్రం చేసుకుంటే సూర్యరశ్మి నుంచి చర్మం సురక్షితంగా మచ్చలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

- డేగల అనితాసూరి 92475 00819